– హవాలా డబ్బు. మరణాయుధాల మాఫియా పై పోలీసులు కఠినంగా స్పందించాలి
– రాష్ట్రంలో గోహత్య నిషేధ చట్టాలు కఠినంగా అమలు చేయాలి
– విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రచార ప్రముఖ్ పగడాకుల బాలస్వామి డిమాండ్
తెలంగాణలో విచ్చలవిడిగా కొనసాగుతున్న గోవుల స్మగ్లింగ్, జంతువుల అక్రమ రవాణాపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగడాకుల బాలస్వామి డిమాండ్ చేశారు. బుధవారం భాగ్యనగర్ శివారు ప్రాంతంలోని ఘట్కేసర్ దగ్గర గోరక్షకుడిపై కాల్పులకు తెగబడిన ఇబ్రహీం, అతడి ముఠాపై పై కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం ఆయన ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు.
గోరక్షకుడిని చంపేందుకు అత్యంత సమీపంలో నుంచి కాల్పులకు దిగిన గోవుల స్మగ్లర్ ఇబ్రహీం ను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఇబ్రహీం వెనుక ఉన్న ముఠాను, వారి వివరాలను వెంటనే బయటపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో జిహాదీ మూకలు అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మారణాయుధాలు చేత పట్టుకుని తిరుగుతున్నప్పటికీ పోలీస్ యంత్రాంగం తగు రీతిలో స్పందించడం లేదని ఆరోపించారు. గో హంతకులు ఎంతటి వారైనా బుద్ధి చెప్పాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు.
హిందువుల మనోభావాలను గాయపరుస్తూ గోహత్యలకు పాల్పడుతున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గోహత్య నిషేధ చట్టం కఠినంగా అమలు చేయాలని బాలస్వామి డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తిపలికి.. ఇబ్రహీం, అతని వెనకాల ఉన్న గ్యాంగ్ ను పట్టుకోవాలన్నారు. నగరంలో, రాష్ట్రంలో వారి వెనకాల ఉన్న శక్తులను గుర్తించి చట్టపరమైన శిక్ష చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.