అవును, అవును! వైజాగ్ కి రాబోతున్న ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ డాటా సెంటర్ ముమ్మాటికీ వైఎస్సార్సీపీ వేసిన విత్తనమే! దీని వెనుక జగన్ గారి ‘విత్తనం’ ఉందంటే నమ్మాల్సిందే.
ఎందుకంటే:
ఇది కేవలం గూగుల్‌కు అద్దెకు ఇవ్వడానికి, అదానీ కట్టే “గూగుట్ డాటా సెంటర్”!
గూగుల్ పేరు వాడితే వచ్చే పబ్లిసిటీ కోసం అదానీ గారు ఇంత పెద్ద సాహసం చేస్తున్నారన్నమాట! నిజంగా అదానీ 87 వేల కోట్ల పెట్టుబడి పెడుతుంటే, అదానీకి కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి, గూగుల్ పేరు చెప్పడం చంద్రబాబు తప్పు కాదు, ఎందుకంటే క్రెడిట్ అంతా జగన్ గారి కలలో కనపడిన అదానీ-గూగుల్ ఒప్పందానికే దక్కాలి కదా!
గూగుల్ ప్రతినిధి ఐటీ సెక్రటరీ భాస్కర్‌కు లేఖ రాశారట! (సేమ్ టు సేమ్ కియా ఆలోచన వైఎస్ రాజశేఖర్ రెడ్డిది అని అసెంబ్లీలో ఓండ్రపెట్టిన బుగ్గన లెక్కన). ఆ లేఖలో, “అదానీ గారు కట్టిన డాటా సెంటర్‌ని మేము వాడుకుంటాం, కృతజ్ఞతలు జగన్ గారు” అని రాసి ఉంటారని జగన్ గారి భక్తులు నమ్మాలి!
నిజానికి 2019కి ముందు అదానీకి 500 ఎకరాలు డాటా సెంటరుకు చంద్రబాబు ఇచ్చినా.. జగను నిద్రపోయాడు 5 ఏళ్లు.
ఇప్పుడు చంద్రబాబు అదానీకి కృతజ్ఞతలు చెప్పకపోవడం, జగన్ సర్కార్‌కు ఆ క్రెడిట్ ఇవ్వకపోవడం… ఇదంతా జగన్ గారికి ఆ ఘనత దక్కకుండా బాబు పన్నిన “డాటా సెంటర్ క్రెడిట్ మాయాజాలం” తప్ప మరొకటి కాదు అని వైకాపా కార్యకర్తలకు పిచ్చెక్కిస్తున్నాడు!
గూగుల్ ఎక్కడో అమెరికాలో ఉంటేనేం? దాన్ని వైజాగ్‌కి రప్పించి, అదానీతో కట్టించి, క్రెడిట్ వైఎస్సార్సీపీకి దక్కేలా చేసిన జగన్ గారి దార్శనికతకు వందనాలు! ఈ మొత్తం కథలో వైజాగ్ అభివృద్ధి ఎంత ముఖ్యం అనేది పక్కన పెడితే, క్రెడిట్ మాత్రం ముమ్మాటికీ వైఎస్సార్సీపీదే! హే హే హే!
లండన్ వెళ్లి వారం పైగా ఉండి వచ్చినా మార్పులేదు. కొంచెం పెరిగినట్లుంది!