– అమరావతి రాజధానిలో బీజేపీ నేత సత్య కుమార్ పై దాడి కాదు
-ప్రధానమంత్రి మోడీపై విరుచుకుపడిన సీపీఐ రామకృష్ణ
గుంటూరు : సీపీఐ జిల్లా స్థాయి జనరల్ బాడీ సమావేశం నికి విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, మోడీ 9 సం. ల పరిపాలనలో భారత దేశం9కోట్ల మంది కఠిక దరిద్రులు ఉన్న దేశంగా నిలిచింది.నిరుద్యోగులు ఎక్కువగా వున్న దేశంగా ప్రపంచంలో ప్రసిద్ధికెక్కింది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గితే భారత దేశంలో అధికదరలు అమ్ముతున్నారు.రైతుల పైపార్లమెంట్ సాక్షిగా ఊకదంపుడు మాటలు తప్పితే ఏమి సాంధించావని ప్రశ్నించారు.దేశవ్యాప్తంగా బ్యాంక్ లను మోసం చేసి నా27మంది గుజరాతీ మోసగాళ్లను విదేశాలకు పంపిన ఘనుడు మోడీ.దేశంలో ప్రతిపక్ష పార్టీలు అన్ని ఏక గొంతుకతో మోసగాళ్లను అదుపులోకి తీసుకోవాలని అడుగుతున్న పట్టించుకోవు.
రాష్ట్రాన్ని దివాలతీయించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది.పోలవరం ప్రాజెక్టును ఆపివేసి నిధులు మంజూరు చేయకుండా చేతులు దులుపుకొన్నారు.అదానీ అంబానీలు కొమ్ముకాస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.మన రాష్ట్ర.లో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా బీజీపీని చూసి గడగడ వనికిపోతున్నాయని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీకి రోడ్ మ్యాప్ ఇవ్వాలని, కేంద్రం దగ్గర నాదెండ్ల మనోహర్ అడగటం సిగ్గుచేటు.బీజేపీ కనుసన్నల్లో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తున్నారన్న విషయం ప్రజలకు తెలుసు. రాష్ట్రంలో జగన్, కేంద్రంలో మోడీ ప్రతిపక్క్ష పార్టీల నోరు నొక్కుతున్నారు.విభజించు పాలించు అన్న రీతిలో బీజేపీ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలనచేయడం సిగ్గుమాలిన చర్య.
ప్రధాని బీజేపీ ఆవిర్భావ సభలో మోడీ డొల్ల మాటలను మీడియా సమావేశంలో ప్రసంగిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.రాబోయే రోజుల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోరాటం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.పులివెందుల రాజకీయాలు సీబీఐ అధికారులకు తెలియవా అంటూ ఎద్దేవాచేశారు.మోడీని అనుసరిస్తూ జగన్ మోహన్ రాష్ట్రంలో నడుస్తున్నారు. అమరావతి రాజధాని లో బీజేపీ నేత సత్య కుమార్ పై దాడి కాదు. ఆదినారాయణ రెడ్డి కోసం వారు వచ్చారని అనుకుంటున్నాను.