తెలివైన వారైతే చెయ్యరు. నేరం ఎప్పుడైనా బయటపడుతుంది అని. కానీ చంద్రబాబు లాంటి వారు షాక్ ఎందుకవుతారు అంటే ఇంతకు కూడా దిగజారుతారా అని ఊహించని నేరాల గురించి తెలిసినప్పుడు.
నాకు తెలిసి ఆయన షాక్ అయ్యింది గొడ్డలిపోటులో, తిరుమల కల్తీ నెయ్యిలో.
తర్వాత కల్తీ లిక్కర్ లో .
అది చేసిన క్రిమినల్స్ .. ఎప్పటి నుండో మొదలెట్టి, అలవాటై, మానలేక కొనసాగించడం ఎవరికీ షాక్ ఇవ్వదు. అడ్డంగా చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ను ప్రశ్నిస్తూ.. ఆయన పాలననే పరిహాసం చేస్తుంటే.. ఆయనకు మరింత షాక్ కలిగింది.
లోతుగా చేస్తున్న విచారణలో ఆయన విస్తుపోయే ప్రాథమిక సమాచారం లభించింది. మిగిలిన వారిలా వెంటనే రియాక్ట్ అయ్యి అరెస్టులు చేసి, చేతులు దులుపుకోరు.
వెన్నులో చలి పుట్టేలా.. బెయిల్లకు బెంబేలు ఎత్తుతూ.. కోర్టులకు పరిగెత్తెలా.. సాక్ష్యాల కోసం విచారణను మరింత లోతుగా చేస్తున్నారు. అందులో తన మన వుండదు. తప్పించుకొనే ప్రసక్తి వుండదు.
ఇప్పటికే ఉప్పంది నన్ను ఇరికించేలా ఉన్నారు అంటూ జోగి రమేశ్ గుమ్మడికాయ దొంగలా భుజాలు తడుముకున్నాడు. ఇటీవలే ఇబ్రహీంపట్నం కూడా మరో ఉద్దానంలా మారింది కిడ్నీ సమస్యలు వస్తున్నాయి ఫ్లై యాష్ వలన అని ఒక పోరాటం చేశాడు.
కొన్ని దశాబ్దాలుగా ఉన్న దాని వలన కాదు, అక్కడ అమ్మిన నకిలీ లిక్కర్ వలన అని ఏ మాత్రం కామన్ సెన్స్ ఉన్న వాడికైనా అర్థం అవుతుంది. బహుశా కోర్టుల ద్వారా బెయిల్ తెచ్చుకొని సమాజంలో పెద్ద మనిషిలా ఇంకా చలామణి అవ్వడానికి వేస్తున్న రిహార్సల్స్ లెక్కన అనిపిస్తోంది.
అది అక్కడితో ఆగుతుందా లేదా తాడేపల్లి వరకు డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ అండ్ క్యారీ చేసిన లిక్కర్ బాసులకు కూడా ఇందులో ప్రమేయం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అందుకే చంద్రబాబు షాక్ అయినట్లున్నారు.
వివేకా కేసులో నారాసుర రక్త చరిత్ర అని వ్రాసిన రోజు కూడా నోరు జారలేదు. సాక్ష్యాలు దొరికాక, చిన్నగా చెప్పారు. ఇంట్లోని మనుషులే వివేకాను చంపేశారు అని ఆయన చెప్పినా.. వివేకా కూతురు కూడా నమ్మక, ఎన్నికల్లో రాజకీయ అంశంగా వాడుకోకండి అని కోర్టుకు వెళ్లారు. ఇవ్వాళ ఆమే సీబీఐ విచారణను మళ్లీ లోతుగా చెయ్యమని కోర్టుకు వెళ్లారు.
అందుకే ఆచి తూచి చంద్రబాబు చెబుతారు. చెబితే అది నిజమవుతుంది. తాజాగా చంద్రబాబు చేసిన ఈ ప్రకటనతో వైకాపాలో వణుకు మొదలైంది.
-చాకిరేవు