Suryaa.co.in

Andhra Pradesh

కిక్కిరిస్తున్న సరిహద్దులు

– సామాన్యులకు కష్టాలు తగుబోతుల అరాచకాలకు అంతేలేదా?
– సరిహద్దులో మద్యం ప్రియుల ఆగడాలు
తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో మద్యం ప్రియుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది వీటిని అరికట్టడానికి వెళ్లిన పోలీసులకు సైతం ఎదురుదెబ్బలు తగులుతున్నాయి మద్యం ప్రియులు పోలీసుల పై విరుచుకు పడటమే కాకుండా వారిని సైతం నానా బూతులు తిడుతూ వీరంగం చేస్తున్నారు అలాంటి సంఘటన రాజోలి ప్రాంతంలో జరిగిన సంఘటనే అందుకు నిదర్శనం.
తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు తక్కువగా ఉండటంతో రాయలసీమ ప్రాంత వాసులు ఇక్కడికి వచ్చి మద్యం సేవిస్తున్నారు.మద్యం బాటిళ్లు తీసుకుని పంట పొలాల్లో రైతులు తిరిగే ప్రాంతంలో తాగుతు చిందులు వేస్తున్నారు. స్త్రీల ముందే మూత్ర విసర్జన, మలవిసర్జన చేయడమే కాకుండా అడ్డు వచ్చిన రైతులను, మహిళలను లైంగికంగా సైతం వేధిస్తున్నారు. మహిళలను దుర్భాషలాడటం ప్యాంటు జిప్ విప్పి చూపించడం ఏం చేసుకుంటారో చేసుకోండి అని పంట మొక్కల సైతం పీకి పారేసి రైతులకు నష్టం కలిగిస్తున్నారు తాగి పారవేసిన మద్యం సీసాలను పంట పొలం లోనే పగల గొడుతున్నారు.
సీసా పెంకులు పంట పొలం యజమానులకు, కూలీలకు, పశువులకు గుచ్చుకుని గాయాలు అవుతున్నాయి. మద్యం ప్రియుల ఆగడాలను వేధింపులను తట్టుకోలేక పోలీసులకు సమాచారం ఇస్తే నివారించడానికి విచారించడానికి వచ్చిన పోలీసులపై దుర్భాషలాడుతూ వీరంగం సృష్టిస్తున్నారు. ఈ మధ్యనే రాజోలి ప్రాంతంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన లక్ష్మణ అనే వ్యక్తి చిత్తుగా మద్యం సేవించి వీరంగం సృష్టించారు.
పోలీసు అధికారులు విచారణకు వస్తే వారిని నానా దుర్భాషలాడి, వారిని క్రిందపడవేసి, వారి వాహనానికి ఈయన తల బాదుకుని, పోలీసులు గాయపరచడంటూ ఎదురుదాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగక మతఘర్షణలు జరిగే విధంగా పోలీసులను భయపడే విధంగా మాట్లాడడం జరిగింది. అందుకు నిదర్శనమే ఈ వీడియో. పోలీస్ అధికారులునే ఇలా భయపెడితే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అధికార ప్రజాప్రతినిధులు ఓ మారు ఆలోచించండి.

LEAVE A RESPONSE