– కాంటాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామంటున్న ప్రభుత్వం 12 ఏళ్లు విద్యావ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న సీఆర్‌పీలను ఎందుకు రెగ్యులరైజ్ చేయరు?
– శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా సర్వశిక్షా అభియాన్‌లో 3,500 మంది క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ (సీఆర్‌పీ)లు పనిచేస్తున్నారు. 2011 నుంచి వీరు విద్యాశాఖలో పనిచేస్తున్నారు. వీరందరు బీఎడ్ పూర్తిచేసి టెట్‌లో సైతం క్వాలిఫై అయిన అభ్యర్ధులే. కాంటాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామంటున్న ప్రభుత్వం 12 ఏళ్లు సీఆర్‌పీలుగా పనిచేస్తూ విద్యావ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న వీరిని ఎందుకు రెగ్యులరైజ్ చేయరు? వైకాపా ఎంపీ, రాజ్యసభ సభ్యులు, బీసీనేత ఆర్. కిష్ణయ్య తెలంగాణాలో సీఆర్‌పీలను పెర్మినెంట్ చేయాలని ఉద్యమం చేస్తున్నారు.
తెలంగాణ సీఆర్‌పీలకు న్యాయం చేయాలని కోరుతున్న వైకాపా నాయకులు ఏపీలో ఉన్న సీఆర్‌పీల సమస్యలపై ఎందుకు దృష్టి పెట్టరు? క్రిష్ణయ్యకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏపీలో సైతం వైకాపా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడి సీఆర్‌పీలకు న్యాయం చేయాలి. గత టీడీపీ ప్రభుత్వంలో పెంచిన రూ.23,500 జీతంతోనే నేటికి పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక వీరికి రూపాయి జీతం కూడా పెంచకలేదు. ప్రస్తుతం వీరితో వారి విధులకు అదనంగా విద్యాబోధన కూడా చేయిస్తున్నారు. విద్యా శాఖలో ఎంతో భాద్యతగా, కీలకంగా పని చేస్తున్న వీరిని పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.