సీఎస్ గారూ.. మేము బహిరంగ చర్చకు రెడీ… మీరు రెడీనా ?

– అనుకూల మీడియాతో ప్రశ్న-సమాధానాలెందుకు?
– మా తప్పయితే ఆందోళన విరమిస్తాం
– లేకుంటే వేతన స్థిరీకరణ చేస్తారా
– సీఎస్ సార్ గారికి నమస్కారం!

అయ్యా chief secretary గారికి నమస్కారములు. మీరు ఎన్నిసార్లు మీకు అనుకూల మీడియ విలేఖరులతో question answers సెషన్స్ నిర్వహించి నా , వాళ్ళు మీకు అనుకూల ప్రశ్నలు మాత్రమే అడుగుతారు.

మీకు నిజంగా మా Salaries మీరు ఇచ్చిన PRC ద్వారా పెరిగినవి అని నిరూపించాలి అనుకుంటే, మా ఉద్యోగులతో live లో question answers సెషన్ నిర్వహించండి.మొత్తం బండారం బయట పడుతుంది.
మేము ఉద్యోగుల తరుపున కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాము. మీకు నిజము చెప్పగలిగే ధైర్యము ఉన్నదా?

1. మీరు మాకిచ్చిన 5 DA లు 2022 జనవరికి సంబంధించిన DA లా లేదా 2021 July వరకు ఇవ్వవలసిన DA లా సమాధానం చెప్పండి?
2. వాస్తవంగా 2019 July, 2020 jan,2020 July, 2021jan, 2021 July లలో మీరు మాకు రావాలిసిన DA లు సమయానికి ఇచ్చి ఉన్నట్లయితే మీరు ఈ రోజు ఇచ్చిన fitment 23% మరియు HRA తగ్గించటము వలన వాస్తవ జీతం తగ్గేదా పెరిగేదా చెప్పండి?
3. DA లు ప్రతి 6 నెలలుకు ఇవ్వవలసి ఉంటుందా లేదా PRC ఇచ్చినప్పుడు మాత్రమే ఇస్తారా?
4. మీరు కాగితాలు లెక్క చూడండి అంటున్నారు. (pay slip)ఆ కాగితాల లెక్క ప్రకారం మాకు 2021 July వరకు రావలసిన DA లతో 27 % ir తో, పాత HRA Slabs ద్వారా మా జీతం ఎక్కువ ఉంటుందా ? అవే da లతో 23 % fitment మరియు మీరు ఇచ్చిన నూతన HRA Slabs ద్వారా జీతం ఎక్కువ ఉంటుందా చెప్పండి?
5. మాకు రావాల్సిన 2021 December కంటే ముందున్న DA ల ద్వారా కాకుండా, మీరు ఇచ్చిన PRC ద్వారా మా జీతం పెరిగినది అని నిరూపించగలిగితే, మేము ఈ రోజే ఉద్యమం ఆపేస్తాము.
నిరూపించక లేకపోతే మీ తప్పు ఒప్పుకుని అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ ద్వారా మా వేతన స్థిరీకరణ చేయగలుగుతారా?
దయచేసి ఇది సవాల్ అనుకుంటారో..
లేక మరేదైనా అనుకుంటారో మీ ఇష్టం.
మేము బహిరంగంగా చర్చకు రెడీ.
అందుకు మీరు రెడీనా?

– ఓ ఏపీ ప్రభుత్వ ఉద్యోగి

Leave a Reply