Home Political News దళిత బంధు..గిరిజన బంధు మిణుగురు పురుగులు లాంటివి

దళిత బంధు..గిరిజన బంధు మిణుగురు పురుగులు లాంటివి

0
6

తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న దళిత బంధు ఇస్తామంటున్న గిరిజన బంధు మిణుగురు పురుగులు లాంటివి. వారి జీవితాలలో వెలుగును నింప లేవు. దళితుల వద్ద 25 లక్షల అసైన్డ్ భూమి ఉంది. వారికి శాశ్వత హక్కును కలిపించాలి. భూమి లేని వారికి మూడు ఎకరాలు కాకున్నా కనీసం ఒక ఎ కరము భూమి, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వండి.

గిరిజనులకు- ఆదివాసీలకు పోడు భూములను సాగు చేసుకోనివ్వండి. పట్టాలు ఇప్పించండి. వారిని పొర్లించి పొర్లించి కొట్టించిన సందర్బాలు ఉన్నాయి. జైల్ లో పెట్టినారు. ఇండ్లు నిర్మించి ఇచ్చి, విద్యాలయాలు, వైద్యాలయాలు ఏర్పాటు చేయండి గిరిజనుల కోసం. మీరు పెట్టిన పథకాలు పూర్తి చేయాలంటే యాబై యేండ్లు కావాలి . అప్పటి వరకు మీరు అధికారం లో ఉండాలి, జీతాలకే కష్టంగా ఉంది. అప్పులు పుట్టడం కష్టం. తీర్చడం అంతకన్నా కష్టం. అప్పులు ఎట్లా తీరుస్తారో చెప్పండి, ఈ పథకాలకు పైసలు ఎక్కడి నుండి వస్తాయి?

పన్నుల భారం ప్రజల మీద వేయాలి. ఇంకోటి ఈ పథకాలు పూర్తి అయ్యే వరకు, మీరు అధికారం నిలుపు కోవాలి, మీ తరువాత కేటీఆర్ గారు, వారి తరువాత వారి కుమారుడు ముఖ్య మంత్రులు కావాలి. మీకు తాలియ బజాయిస్తున్న వారంత కడ వరకు మీతో ఉంటారని నమ్మకం లేదు. మీ చుట్టూ ఉన్న నాయకులు చాలా మంది, ఇతర పార్టీలలో ఎదిగి ఆ పార్టీలను మోసం చేసి వచ్చిన వారే.

అందుకే నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల అన్నట్లు.. మంచి పథకం ఒక్కటి పెట్టి వారిని బాగు చేయండి. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, చదువు కున్నంత విద్య ఉచితంగా అందించండి. కావాల్సినంత వైద్యం రూపాయి ఖర్చు కాకుండా ఇవ్వండి. అప్పుడే ఆ వర్గాలు బాగుపడతాయి

– నారగొని ప్రవీణ్ కుమార్,
సామాజిక కార్యకర్త

NO COMMENTS

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!