Home Andhra Pradesh వెన్నుపోటు గురించి జగన్ రెడ్డి, సజ్జల మాట్లాడటం సిగ్గుచేటు

వెన్నుపోటు గురించి జగన్ రెడ్డి, సజ్జల మాట్లాడటం సిగ్గుచేటు

0
9

-తల్లిని, చెల్లిని గెంటేసి వారికి వెన్నుపోటు పొడిచిందెవరు?
– మాజీ మంత్రి పీతల సుజాత

ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిని లపాకి లక్ష్మిపార్వతిని పక్కన పెట్టుకొని వెన్నుపోటు గురించి సజ్జల అండ్ టీం మాట్లడటం దెయ్యాలు వేదాలు వళ్లించినట్లు ఉందని మాజీ మంత్రి పీతల సుజాత ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ….. వెన్నుపోటు గురించి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉంది. సజ్జల రామకృష్ణా రెడ్డి, జగన్ రెడ్డి చెప్పే ప్రవచనాలు వినడానికి ప్రజలు అమాయకులు కాదు.

ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన లక్ష్మిపార్వతిని పక్కన పెట్టుకొని వెన్నుపోటు గురించి సజ్జల అండ్ టీం మాట్లడటం దెయ్యాలు వేదాలు వళ్లించినట్లు ఉంది. బాబాయిని వెన్నుపోటు పొడిచి పిన్నమ్మ తాళి తెంచిన వ్యక్తి ఏ పోటుకిందకు వస్తారో సజ్జల చెప్పాలి. మీది అనుకుంటున్న వైసీపీ పార్టీ మీది కాదు. తెలంగాణ చెందిన శివకుమార్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్.సి.పి) అని రిజిష్టరు చేయించుకున్నారు. కానీ అతని దగ్గర నుంచి పార్టీని కబ్జా చేసి వెన్నుపోటు పొడించిందెవరు. కాంగ్రెస్ పార్టీ వైయస్.రాజశేఖర్ రెడ్డికి, మీకు అధికారాన్నిచ్చింది. ఆ అధికారాన్ని అడ్డంపెట్టుకొని వేల కోట్లు వెనెకేసుకుని , మీకు అన్నం పెట్టిన కాంగ్రెస్ పార్టీకే వెన్నుపోటు పొడిచారు.

వైసీపీ గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి విజయమ్మను తొలగించి కన్నతల్లికే వెన్నుపోటు పొడిచింది జగన్ రెడ్డి కాదా? అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో వాటా హక్కు కల్పించి మహిళల ఆత్మగౌరవాన్ని పెంచారు. ఆ చట్టాన్ని తూట్లు పొడిచే విధంగా జగన్ రెడ్డి తన సొంత చెల్లికి ఆస్తిలో వాటా హక్కు ఇవ్వకుండా గెంటేశారు. దశల వారి మద్య నిషేదమన్న మహిళలకు ఇచ్చిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మద్యనిషేదం చేయకపోగ ప్రతి గ్రామంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల్ని చిన్నాభిన్నం చేసేలా మద్యం ధరలు విపరీతంగా పెంచేశారు.

నవరకాలుగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి వెన్నుపోటు పొడిచింది జగన్ రెడ్డి, సజ్జల అండ్ టీం. వీరు వెన్నుపోటు పొడవడంలో బూర్జు దొరలని మించిపోయారు. మీ వెన్నుపోట్లని కప్పిప్పుచ్చుకోవడానికి దుష్ట, కుటిలమైన బుద్ధితో, ఆలోచనలతో టీడీపీకి, చంద్రబాబు నాయడుకి ఆపాదించి మాట్లాడితే చూస్తూ ఊరుకోం. రాష్ట్ర ప్రజలు మీ దుర్మార్గమైన మాటలని నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎల్లప్పుడూ అందరినీ మోసం చేయడం కుదరదనే నగ్నసత్యాన్ని గుర్తుంచుకోవాలి. వైసీపీ నేతలకు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని పీతల సుజాత హెచ్చరించారు.

NO COMMENTS

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!