Suryaa.co.in

Andhra Pradesh

డామిట్.. హెలికాప్టర్ కథ అడ్డం తిరిగింది!

(భూమా బాబు)

నా హెలికాప్టర్… నా ఇష్టం… నా డ్రామా!” అని జగన్ అనుకున్నారు. కానీ డామిట్ కథ అడ్డం తిరిగేసరికి మరో పెడబొబ్బలకు స్క్రోలింగ్ స్క్రిప్ట్ సిద్ధం చేసింది సాక్షి. కానీ ఇందులో కూడా ఒక ట్విస్ట్ వుంది.

విచారణ మొదలయ్యే సరికి ప్రభుత్వ కుట్ర అని శోకాల స్క్రోలింగ్ మొదలెట్టింది గుండెపోటు సాక్షి. జగన్ గారి రాప్తాడు పర్యటనలో ఆయన హెలికాప్టర్ యొక్క విండ్ షీల్డ్ దెబ్బ తిన్నట్లు చూపి సాక్షిలో పెద్ద డ్రామా మొదలెట్టారు.

“ప్రభుత్వ కుట్ర… కేంద్ర మంత్రి రామ్మోహన్ గారి శాఖ ద్వారా చౌకబారు రాజకీయం… హెలికాప్టర్ సంస్థలకు బెదిరింపులు…” అంటూ సాక్షిలో స్క్రోలింగ్ వార్తలు వేస్తున్నారు ఇప్పుడు. “జగన్ గారి హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింటే, అది ప్రభుత్వ తప్పే!” అని అప్పుడు ఆరోపించింది సాక్షినే. “జగన్ గారు క్షేత్ర స్థాయిలోకి వెళ్లనీయకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారు…” అని ఇప్పుడు వాపోతున్నదీ సాక్షినే.

అసలు జగన్ గారికి హెలికాప్టర్లు ఇవ్వనీయకుండా కుట్ర చేస్తున్నారట! “అయ్యో పాపం, జగన్ గారు ఎలా తిరుగుతారు?” అని జనం అందరూ బాధపడతారు అని బేబక్క టీమ్ అంచనా ఏమో కానీ, జగన్ గారు మాత్రం “నేను డ్రామాలు వేయడంలో ఎక్స్పర్ట్ ని” అని నిరూపించారు.

“హెలికాప్టర్ వద్ద జగన్ను చూడటానికి వచ్చే వారిని పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకొంటున్నారు. ఖబడ్దార్ అని రెచ్చగొట్టి తోసుకుని వెళ్ళింది వాళ్లే.” “జగన్ గారికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది…” అని సాక్షి వారు ఆరోపించారు అప్పుడు.

కానీ, జగన్ గారికి భద్రత అంటే, ఆయన డ్రామాలు వేయడానికి అడ్డంకులు లేకుండా చూడటమా? అనేది నేరుగా చెప్పేయవచ్చు కదా. “హెలికాప్టర్ పైలెట్లకు నోటీసులు జారీ చేయడం ఏమిటి?” అని సాక్షి వారు మండిపడుతున్నారు. “ఇది జగన్ గారిని వేధించడమే…” అని సాక్షి వారు అంటున్నారు. కానీ, హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింటే, విచారణ చేయకుండా ఎలా ఉంటారు?

ఇంతకీ, జగన్ గారి హెలికాప్టర్ విండ్ షీల్డ్ కి దెబ్బ తగిలితే, అంత పెద్ద డ్రామా ఎందుకు? “నా పర్యటనలు… నా ప్రచారం… నా డ్రామాలు…” అని జగన్ గారు అనుకున్నారా? “నా భార్య సాక్షి ఉందిగా, ఏదైనా కవర్ చేస్తుంది” అని ఆయన అనుకున్నారా?

చివరికి, జగన్ గారి హెలికాప్టర్ విండ్ షీల్డ్ డ్రామా ఒక కామెడీ షో లాగా మారింది. “జగన్ గారు డ్రామాలు వేయడంలో దిట్ట…” అని జనం అందరూ నవ్వుకున్నారు. అదో పెద్ద గుండెపోటుకు మించిన డ్రామా అని కాస్తా అవగాహన వున్న వారికి కూడా సాక్షి స్క్రోలింగులు జ్ఞానోదయం చేసింది.

ఇంతకీ, జగన్ గారి హెలికాప్టర్ విండ్ షీల్డ్ కి దెబ్బ తగిలిందా? లేక, ఆయన డ్రామాలు వేయడానికి ఒక సాకు దొరికిందా? ఈ ప్రశ్నకి సమాధానం “దేవుడికే తెలియాలి” అని, చంద్రబాబు వచ్చి చెప్పి దర్యాప్తు ఆపేస్తే గానీ ఈ హాస్యం ఆగదేమో సాక్షిలో.

కానీ, ఏమాటకామాట, జగన్ గారు గొప్ప నటులు, సాక్షి స్క్రిప్ట్ అద్భుతం, ఆంధ్రాను రంజింపజేస్తున్నారు తమ హాస్యంతో! వున్నట్లుండి ఈ హాస్యం ఇప్పుడు మనకు ఎందుకు అనే అనుమానం రావచ్చు. బేబక్క రాజ్ కసిరెడ్డి స్పై గా మారి మొత్తం కక్కేసి పరారీలో వున్నాడు.

ఆయన సంస్థల మీద, బంధువుల వద్ద రైడింగ్ మొదలైంది. స్పై సినిమాల నుండి టెక్ కంపెనీల ముసుగులో.. తమ వేలకోట్ల మద్యం కుంభకోణం డబ్బులు ఎలా తెల్లధనంగా మార్చారో బయటపడుతున్న వేళ, డైవర్షన్ కోసం ఈ గిలిగింతలు మొదలెట్టింది బేబక్క.

LEAVE A RESPONSE