ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో దశ మహా విద్యా పూర్వక నవ ఛండీయాగ మహోత్సవం

Spread the love

-తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని.. అవరోధాలు తొలగిపోవాలని.. తెలుగు ప్రజలకు శుభం చేకూరాలని..లక్ష్యం
-పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాట్లు పూర్తి

(హైదరాబాద్): తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో దశ మహా విద్యా పూర్వక నవ ఛండీయాగ మహోత్సవం జరుగనున్నది. ఉదయం 7-30 గంటల నుండి మధ్యాన్నం 2-30 గంటల వరకు ఈ యాగం నిర్వహిస్తారు. లోక కళ్యాణంతో పాటు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు మున్ముందు శుభ సూచకంగా ఉజ్వలంగా ఉండాలని, విజయం దిశగా ముందుకు సాగాలని.. తెలంగాణ, తెలుగు ప్రజలందరికీ అంతా శుభం చేకూరాలని కాసాని జ్ఞానేశ్వర్ ఈ నవ చండీ యాగాన్ని చేపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టిన జైత్ర యాత్రకు ఎలాంటి అవరోధాలు, అపశృతులు తలెత్తకుండా లక్ష్యం సిద్దించేలా ఆ దేవీ మాతను నవ చండీ యాగం ద్వారా తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రార్ధించనున్నారు. కాగా, ఎన్టీఆర్ భవన్ లో ఛండీయాగం కు సంబంధించిన ఏర్పాట్లను  తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.

Leave a Reply