Suryaa.co.in

Telangana

ఇది ప్రజాస్వామ్య దేశమా?రాచరికపు రాజ్యమా?

-ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిండైన ఆయుర్ ఆరోగ్యాలతో కలకాలం చల్ల ఉండాలని కోరుకుంటున్నాం
-కెసిఆర్ జన్మదిన సంబురాలు చేయండి, దాంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారం కూడా చేయండి…
– రైతులు, నిరుద్యోగులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
-రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగాలంటే ముఖ్యమంత్రి సరైన నిర్ణయాలు తీసుకోవాలి
-డబల్ బెడ్ రూం ఇల్లు, మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, కేజీటు పీజీ, నిరుద్యోగ బృతి ..ఇలా గత ఎనిమిదేళ్ళగా అనేక వాగ్దానాలు ఒక్కటి అమలు కాక ప్రజలు నానా ఇబ్బందుల్లో కూరుకుపోయారు.
-ముఖ్యమంత్రి పుట్టినరోజు సంబురాలతో పాటు ఈ ప్రజా సమస్యలని కూడా గుర్తించాలి
-ముఖ్యమంత్రి మెప్పుకోసం టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పెద్దపెద్ద కటౌట్లు కట్టి, బెలూన్లు ఎగరేసి కేకులు కట్ చేస్తున్నారు. దీనికి బదులు ముఖ్యమంత్రి పేరుమీద ప్రతి నియోజికవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టినట్లయితే పేద, నిరుద్యోగ యువత స్కిల్స్ ని నేర్చుకొని ఉద్యోగాలు పొందే పరిస్థితి వుండేది
-బిస్వాల్ కమిటీ 1లక్షా 90వేల ఉద్యోగాలు ఖాళీ వున్నాయని చెబితే .. 50వేల ఉద్యోగాలే ఖాళీగా వున్నాయని సిఎస్ సోమేశ్ కుమార్ చెప్తున్నారు. లక్షా 32వేల ఉద్యోగాలు బర్తీ చేశామని దొంగలెక్కలు చెబుతారు. 72వేల ఉద్యోగ ఖాళీలు వున్నాయని మళ్ళీ కొత్తమాట చెబుతున్నారు. పూటకో మాట చెప్పి నిరుద్యోగల జీవితాలతో చెలగాటం ఆడటం న్యాయమా?
-ఎఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్

సంబురాలు చేసుకోండి. కానీ మా సమస్యల గురించి ప్రశ్నించే హక్కు లేకుండా పోలీసులని పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారు. గాంధీ భవన్ లోకి రావద్దంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని వరుసగా మూడు రోజులు పాటు అరెస్ట్ చేసి నిర్బంధానికి గురి చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులని, కార్యకర్తలని నిర్బంధానికి గురి చేసి నిర్బంధ తెలంగాణని తయారు చేస్తున్న కేసీఆర్.. ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి.

”ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ శాంతులతో వుండాలని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు 3 రోజులు కాదు 365 రోజులు జరుపుకున్నా ఇబ్బంది లేదు కానీ మా సమస్యలు మీ ద్రుష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకూ న్యాయం ? ఆఖరికి గాంధీ భవన్ కి ప్రవేశం కూడా లేకుండా పోలీసుల వలయంలో గాంధీ భవన్ ని నిర్బంధించడం ఎంతవరకూ న్యాయం ? ఇది ప్రజాస్వామ్య దేశమా ? రాచరికపు రాజ్యమా ? అని ప్రశ్నించారు ఎఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. ఈ మేరకు ఆయన ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు.

”ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ వేడుకలు జరుపుకోవడంలో వున్న శ్రద్ద పేద ప్రజలని ఆదుకోవడంలో కూడా చూపించాలని గుర్తు చేస్తున్నాం. రైతులు, నిరుద్యోగులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగాలంటే ముఖ్యమంత్రి సరైన చర్యలు తీసుకోవాలి.

” డబుల్ బెడ్ రూం ఇల్లు, మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, కేజీటు పీజీ, నిరుద్యోగ బృతి ..ఇలా గత ఎనిమిదేళ్ళగా ఇచ్చిన అనేక వాగ్దానాలలో.. ఒక్కటి అమలు కాక ప్రజలు నానా ఇబ్బందుల్లో కూరుకుపోయారు. పేదలకు ఇల్లు లేదు, భూమి లేదు, ఉద్యోగం లేదు, సరైన విద్యలేదు, రైతుల ఆత్మహత్యలు, దిక్కుతోచని స్థితిలో నిరుద్యోగుల ఆత్మహత్యలు.. ఎన్నో ఆశలు ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణ నేడు సమస్యల సుడిగుండంగా మారిపోయింది. ముఖ్యమంత్రి పుట్టినరోజు సంబురాలతో పాటు ఈ ప్రజా సమస్యలని కూడా గుర్తించాలని కోరుకుంటున్నాం” అని తెలియజేశారు దాసోజు.

”అనేక మంది నిరుద్యోగులు తల్లితండ్రుల మొహం చూపించలేక కోచింగ్ సెంటర్లలో శిక్షణ పూర్తి చేసుకొని నోటిఫికేషన్లు రాక నానా ఇబ్బందులకు గురౌతున్నారు. ముఖ్యమంత్రి మెప్పుకోసం టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పెద్దపెద్ద కటౌట్లు కట్టి, బెలూన్లు ఎగరేసి కేకులు కట్ చేస్తున్నారు. దీనికి బదులు ముఖ్యమంత్రి పేరుమీద ప్రతి నియోజికవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టినట్లయితే పేద నిరుద్యోగ యువత స్కిల్స్ ని నేర్చుకొని ఉద్యోగాలు పొందే పరిస్థితి వుండేది. నిర్మాణాత్మకమైన పనులు చేయకుండా కేవలం ముఖ్యమంత్రి మెప్పు కోసం టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్రాకులాడుతున్నారు” అని విమర్శించారు దాసోజు.

”నిరుద్యోగ బృతి లేదు, శిక్షణ తరగలు లేవు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు లేవు. దానికి తోడు నిరుద్యోగుల జీవితంతో చెలగాటం ఆడుతున్నారు. బిస్వాల్ కమిటీ 1లక్షా 90వేల ఉద్యోగాలు ఖాళీ వున్నాయని చెబితే .. 50వేల ఉద్యోగాలే ఖాళీగా వున్నాయని సిఎస్ సోమేశ్ కుమార్ చెప్తున్నారు. లక్షా 32వేల ఉద్యోగాలు బర్తీ చేశామని దొంగలెక్కలు చెబుతారు. 72వేల ఉద్యోగ ఖాళీలు వున్నాయని కొత్తమాట చెబుతున్నారు. పూటకో మాట చెప్పి నిరుద్యోగల జీవితాలతో చెలగాటం ఆడటం న్యాయమా ? జిల్లాలు పెరిగాయి. లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉన్నప్పటికీ భర్తీ చేయడం లేదు. ప్రైవేట్ సెక్టార్ లో ఉద్యోగం వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం లేదు, స్వయం ఉపాదికి కూడా ప్రోత్సాహం ఇవ్వకుండా .. కేవలం సంబరాలు చేసుకొని సంతోషపడితే.. మరి పేదలు, కష్టాలు ఊబిలో కూరుకున్న ప్రజల జీవితాల్లో ఎవరు సంతోషం నింపాలి మీకు ఓట్లు వేసి గద్దెనెక్కించిన ప్రజలని ఎవరు ఆదుకోవాలి ?” అని ప్రశ్నించారు దాసోజు.

‘డబుల్ బెడ్ రూం ఇల్లు ఆశ చూపి ఇవ్వలేదు. దాదాపు నలఫై లక్షల మంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కోసం దరఖాస్తు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పూరిగుడిసెలో నివాసం వుంటున్న పేదప్రజలు వున్నారు. డబుల్ బెడ్ రూం ఇల్లు వస్తే ఆత్మాభిమానంతో బ్రతకొచ్చని ఎదురు చూస్తుంటే నామమాత్రానికి ఓ పది వేల ఇల్లు కట్టేసి.. ఇళ్ళ నిర్మాణాలు చేపట్టేశామని గొప్పలు చెబుతున్నారు. నలఫై లక్షల ఇళ్ళ నిర్మాణాలు ఎప్పుడు చేపడతారు ? దీనికి పై ఒక సమగ్రమైన అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారు” అని పేర్కొన్నారు దాసోజు.

‘సమస్యలు అనేకం ఉన్నప్పటికీ సంబురాలు చేసుకుంటున్నారు. తప్పుకాదు.. సంబురాలు చేసుకోండి. కానీ మా సమస్యల గురించి ప్రశ్నించే హక్కు లేకుండా పోలీసులని పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారు. గాంధీ భవన్ లోకి రావద్దంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని వరుసగా మూడు రోజులు పాటు అరెస్ట్ చేసి నిర్బంధానికి గురి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులని, కార్యకర్తలని ఎక్కడికక్కడ నిర్భంధానికి గురి చేస్తున్నారు. ఇది ఎంత వరకు న్యాయం ? రాజ్యాంగాన్ని కించపరుస్తూ నిర్బంధ తెలంగాణని తయారుచేస్తున్నారు. ఇది అన్యాయం. ఇది ప్రజాస్వామ్య దేశమా ? రాచరికపు రాజ్యమా ? ముఖ్యమంత్రి ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి.” అని కోరారు దాసోజు

LEAVE A RESPONSE