Suryaa.co.in

Andhra Pradesh

దోపిడీ, లూఠీతో ప్రజల్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమేనా అభివృద్ధి వికేంద్రీకరణ?

• పంచభూతాల్ని కూడా వదలకుండా 4 ఏళ్లకే రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా సర్వనాశనం చేశారు
• రాజధాని పేరుతో విశాఖ, ఉత్తరాంధ్రప్రాంతంలోని భూములు, ఆస్తుల్ని స్వాహాచేసేశారు
• జీవోలమీద జీవోలిచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, బ్రాహ్మణవర్గాల సబ్ ప్లాన్ నిధుల్ని దారిమళ్లించారు
• కేంద్రం పంచాయతీలకు ఇచ్చిన రూ.12వేలకోట్ల నిధులు దిగమింగి, సర్పంచ్ లను భిక్షగాళ్లను చేశారు
• అమరావతి రైతుల్ని అడ్డుకోవడానికి ఉత్తరాంధ్ర ప్రాంతం జగన్మోహన్ రెడ్డి, మంత్రుల జాగీరో, వాళ్ల అబ్బ జాగీరో కాదు
-బొండా ఉమామహేశ్వరరావు

జగన్మోహన్ రెడ్డి, ఆయనమంత్రివర్గం మూడున్నరేళ్లపాలనలో అభివృద్ధివికేంద్రీకరణ అనే మాటకు అర్థమే మార్చేశారని, దోచుకో..దాచుకో…పారిపో అనే 3 విధానాలనే 3 రాజధానుల ముసుగులో రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!

“5ఏళ్లు అహర్నిశలు కష్టపడిన చంద్రబాబుగారు, ఆయనహయాంలో అమరావతిని వడ్డించిన విస్తరిలా తయారుచేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక అది కుక్కలు చింపిన విస్తరి కన్నా దారుణంగా తయారైంది. భూములతోపాటు సర్వంకోల్పోయిన రైతులు కడుపుమంటతో న్యాయం కోసం రోడ్డెక్కితే మంత్రులంతా ఒళ్లుకొవ్వెక్కి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అనేమాటకు ముఖ్యమంత్రికి, మంత్రులకు అర్థమే తెలియదు. ప్రజల్ని, రాష్ట్రాన్ని లూటీచేయడం, దోచుకోవడమే అసలైన అభివృద్ధి వికేంద్రీకరణ అన్నట్లుగా వారి తీరుంది.

అభివృద్ధి వికేంద్రీకరణపై బహిరంగచర్చకు వచ్చే ధైర్యం మంత్రులకు ఉందా?
రాజధాని అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి తీరు అమ్మకు అన్నంపెట్టలేని వాడు చిన్నమ్మకు చీరలు కొనిపెడతానన్నట్టుగా ఉంది. అసలు వికేంద్రీకరణపై ఈ ప్రభుత్వానికి నిజంగా అవగాహన ఉంటే దానిపై తాము బహిరంగచర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేస్తున్నా. టీడీపీ ప్రభుత్వంలో ఒక్కోప్రాంతంలో ఒక్కోరకమైన అభివృద్ధి జరిగింది, అదీ అసలైన అభివృద్ధి వికేంద్రీకరణ అంటే. ఒక్క రాష్ట్రానికి ఒకటే రాజధాని అని న్యాయస్థానాలు చెబుతున్నా వినకుండా, ఈప్రభుత్వం కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. అమరావతి రైతులు గతంలో న్యాయస్థానం-దేవస్థానం యాత్రచేస్తే ప్రజలనుంచి అపూర్వ ఆదరణ లభించింది. నేడు జరుగుతున్న అమరావతి-అరసవెల్లి పాదయాత్రకు కూడా అంతకు మించిన అపూర్వ ప్రజాదరణ వస్తోంది. అమరావతికి, ఆప్రాంత రైతులకు ప్రజల్లో ఆదరాభిమానాలు పెరగడాన్ని చూసిఓర్వలేకనే మంత్రులు ఇష్టానుసారం నోరుపారేసు కుంటున్నారు. ఆ మంత్రులు ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఏ జిల్లాలో అయినా కోటిరూపాయల అభివృద్ధి జరిగిందని చెప్పగలరా? వాస్తవాలతో నిరూపించగలరా? 4 ఏళ్లపాలనతో రాష్ట్రాన్నిసర్వనాశనం చేసి, పదేళ్లపాటు వెనక్కు తీసుకెళ్లారన్నది ఎవరూకాదనలేని పచ్చినిజం.

ఆఖరికి కేంద్రప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికోసం కేటాయించిన దాదాపు రూ.12వేల కోట్ల నిధుల్ని కూడా ఈ ముఖ్యమంత్రి దారిమళ్లించాడు. ఆ నిధుల్ని ఏమయ్యాయంటే సమాధానంలేదు. ఆఖరికి సర్పంచ్ లు కోర్టులకు వెళితే, ప్రభుత్వాధికారులు న్యాయస్థానంలో చేతులుకట్టుకొని నిలబడాల్సిన దుస్థితి వచ్చింది. అధికారులు కోర్టులచుట్టూతిరిగి చీవాట్లు తింటున్నారుగానీ, ఈప్రభుత్వంలో పంచాయతీలకు నిధులుమాత్రం రావడంలేదు. పంచాయతీ సర్పంచ్ లు రోడ్లపైకి వచ్చి భిక్షాటన చేసే దుస్థితికి రావడమేనా జగన్ రెడ్డి చెబుతున్న అభివృద్ధి వికేంద్రీకరణ? అన్నిరకాలుగా రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించడమే అసలైన అభివృద్ధి వికేంద్రీకరణ అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి తీరుంది.

జగన్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏం చేసిందో ఆయావర్గాల వైసీపీనేతలు సమాధానం చెప్పగలరా? రూ.26,448కోట్ల బీసీసబ్ ప్లాన్ నిధుల్ని డైవర్ట్ చేసినజగన్మోహన్ రెడ్డిని నిలదీసే ధైర్యం వైసీపీలోని బీసీనేతలకు ఉందా? రూ.4,341కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు, రూ.662కోట్ల ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో అధికారంలోఉన్న ఎస్సీ, ఎస్టీ నేతలు చెప్పాలి. రూ.1483కోట్ల మైనారిటీల నిధుల్ని దిగమింగిన జగన్మోహన్ రెడ్డి, వారిగొంతుకోసింది వాస్తవంకాదా? కాగ్ వంటి కేంద్రవిభాగానికే అంతుచిక్కని విధంగా ఈప్రభుత్వం, ముఖ్యమంత్రి పేదలసొమ్ముని స్వాహాచేశాడు. బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనారిటీ, కాపుల నిధుల్ని దిగమింగడానికేనా ప్రజలు వైసీపీనేతల్ని, జగన్మోహన్ రెడ్డిని గెలిపించింది? ఆయావర్గాలకు చెందిన వైసీపీనేతలు, మంత్రులు తాములేవనెత్తిన అంశాలపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నాం. ( ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, బ్రాహ్మణ ఇతరవర్గాల సబ్ ప్లాన్ నిధుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారిమళ్లించిన విధానాన్ని అందుకు సంబంధించిన జీవోలను ఉమామహేశ్వరరావుగారు విలేకరులకు ప్రదర్శించారు).

రాజధాని పేరుతో విశాఖకేంద్రంగా రూ.40వేలకోట్లుస్వాహా…!
విశాఖను రాజధాని చేస్తామని చెప్పి, అక్కడి ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి రుణాలు పొందారు. ఎమ్మార్వో కార్యాలయం, రైతుబజార్ సహా, విద్యాసంస్థలు, ఇతర ప్రభుత్వభవనాలు తాకట్టు పెట్టి, తెచ్చిన రూ.40వేలకోట్లసొమ్ము ఏమైందో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. జీవోలమీద జీవోలుఇచ్చి, విశాఖలోని రూ.40వేలకోట్ల ప్రజలసొమ్ముని జగన్ రెడ్డి స్వాహాచేశాడు.ఒక్క రాజధాని కట్టలేని అసమర్థ జగన్మోహన్ రెడ్డి మూడురాజధానులు ఎలా కడతాడో ప్రజలకు చెప్పాలి. 3రాజధానులపై ఈప్రభుత్వానికి ఉన్న సమగ్రవిధానం ఏమిటోచెప్పాలి. 3న్నరేళ్ల పాలనలో ఈప్రభుత్వం విశాఖలో ఎక్కడైనా సరే ఒక్కతట్ట మట్టి వేసిందా? వికేంద్రీకరణపై ఈ ప్రభుత్వం ఏంచేసిందో, గతప్రభుత్వంలో ఏంజరిగిందో జగన్మోహన్ రెడ్డి శ్వేతపత్రం విడుదలచేయగలడా అని సవాల్ విసురుతున్నాం. ఉత్తరాంధ్ర, విశాఖ ప్రాంతవాసులకు ఈ ప్రభుత్వంపై నమ్మకంఉందా? అమరావతి రైతుల్ని ఉత్తరాంధ్రలో అడుగుపెట్టనీయరా… అదేమన్నా జగన్మోహన్ రెడ్డి, వైసీపీనేతల అబ్బజాగీరా? రైతుల్ని, మహిళల్ని అడ్డుకుంటే ప్రజలే వైసీపీనేతల చొక్కాలు పట్టుకొని సమాధానం చెబుతారు. బొత్ససత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్ సహా, మంత్రులు, వైసీపీ నేతలు ఎవరైనా ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి” అని బొండా తీవ్రస్వరంతో హెచ్చరించారు.

LEAVE A RESPONSE