సేంద్రియ కర్బనం పెంచితేనే వ్యవసాయం మనుగడ.
డా. ముచ్చుకోట . సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక
గత డెబ్భై సంవత్సరాల క్రిందట వ్యవసాయ భూములలో 1 శాతం ఉన్న సేంద్రియ కర్బనం ఇప్పుడు డెబ్భై శాతం క్షీణతతో 0.3 శాతానికి దిగజారింది . భూములలో సేంద్రియ కర్బనం పెంచకపోతే ప్రపంచ ఆహార భద్రతకు పోషకాహారానికి రాబోయే రోజులల్లో పెనుముప్పు పొంచివుంది.
“అధిక సేంద్రీయ కార్బన్ కంటెంట్ ఉన్న నేలలు మరింత సారవంతమైన ఉత్పాదకతను కలిగి ఉంటాయి, మంచి నీటిని శుద్ధి చేయగలవు, వాతావరణ మార్పుల ప్రభావాలకు జీవనోపాధి యొక్క స్థితిస్థాపకతను పెంచడంలో సహాయపడతాయి”.
దీనర్థం, ఐక్యరాజ్య సమితి 2030 ఎజెండా ద్వారా స్థాపించబడిన అనేక అంతర్జాతీయ అభివృద్ధి లక్ష్యాలను, ముఖ్యంగా ఆకలి పోషకాహార లోపాన్ని నిర్మూలించే రెండవ లక్ష్యం సాధించడానికి గ్రహం యొక్క నేలల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వాటి సేంద్రీయ కార్బన్ కంటెంట్‌ను పెంచడం చాలా కీలకం. విలువైన, హాని కలిగించే వనరు వాతావరణం నుండి మొక్కలు లేదా సేంద్రీయ అవశేషాల ద్వారా “స్థిరపరచబడిన” తర్వాత కార్బన్ భూగర్భంలో వేరుచేయబడుతుంది.
తరువాత చాలావరకు సహజ ప్రక్రియల ద్వారా నేలల్లో కలిసిపోతుంది. నేల కార్బన్ కంటెంట్‌లో జీవించి ఉన్న అలాగే చనిపోయిన భాగాలను కలిగి ఉంటుంది ఫీల్డ్ స్టబుల్, అలాగే సహస్రాబ్దాల క్రితం నుండి కుళ్ళిన పదార్థాలను కూడా కలిగి ఉంటుంది. కానీ మట్టి చెదిరిపోయినప్పుడు లేదా క్షీణించినప్పుడు, చిక్కుకున్న కార్బన్ క్షయం ఫలితంగా ఏర్పడే ఇతర గ్రీన్‌హౌస్ వాయువులు మళ్లీ వాతావరణంలోకి విడుదల చేయబడతాయి.
దీని అర్థం భూమి యొక్క నేల కార్బన్ రిజర్వాయర్ వాతావరణంలోకి భారీ మొత్తంలో గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేయగలదని లేదా మనం ముందుకు వెళ్లే నిర్వహణ నిర్ణయాలను బట్టి వాటిలో ఎక్కువ భాగాన్ని సీక్వెస్టర్ చేయగలదని నివేదిక పేర్కొంది.
ఇప్పటికే, గ్రహం యొక్క మూడింట ఒక వంతు నేలలు క్షీణించాయి, ఇది ప్రపంచ నేల సేంద్రియ కార్బన్ నిల్వలలో అపారమైన తగ్గుదలకు దారితీస్తుంది మరియు వాతావరణంలోకి 100 గిగాటన్నుల వరకు విడుదలైంది.
పేలవమైన నేల నిర్వహణ ద్వారా నేల కార్బన్ నిల్వలకు మరింత నష్టం జరగడం ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను పరిమితం చేసే ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తుంది పెరిగిన ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, కరువులు ఇతర వాతావరణ మార్పు ప్రభావాలను నివారించవచ్చు, సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ది హిడెన్ పొటెన్షియల్ హెచ్చరించింది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు విపరీతమైన వాతావరణ సంఘటనల పౌనఃపున్యం మట్టి సేంద్రీయ కార్బన్ యొక్క అదనపు నష్టాలకు దారి తీస్తుంది, మెరుగుదల నిర్వహణను మరింత అత్యవసరంగా చేస్తుంది.
పర్యావరణ వ్యవస్థ అనగా భౌతిక వ్యవస్థలు లేదా జీవ క్రియలకు అస్థిరత, అసమానత, హాని లేదా అసౌకర్యం కలిగించే విధంగా కలుషితాలని పర్యావరణంలోకి విడుదల చెయ్యటాన్ని కాలుష్యం అంటారు.
జాతీయ మట్టి సర్వే–భూ వినియోగ ప్రణాళిక సంస్థ వారు స్థానిక సాగు భూముల తీరుతెన్నులు, వాతావరణ పరిస్థితులను బట్టి ఏయే పంటలను సాగు చేసుకుంటే ఫలితం బాగుంటుందో సూచనలు ఇస్తున్నారు.ఈ మధ్య వారు ప్రచురించిన నివేదికలో తెలుగు రాష్ట్రాల్లోని భూముల్లో సేంద్రియ కర్బనం అడుగంటిందని, ఇప్పటికైనా ప్రభుత్వాలు, రైతులు జాగ్రత్తపడి సేంద్రియ కర్బనాన్ని కనీసం 0.7కైనా పెంచుకోకపోతే భూములు సాగు యోగ్యం కాకుండా పోతాయని హెచ్చరించారు.
భూమిని నమ్ముకోవడం అంటే, పంట భూములు ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం చేస్తూ సేంద్రియ కర్బనాన్ని పెంపొందించుకోవడం. భూమి ఆరోగ్యానికి సేంద్రియ కర్బనం ఒక ముఖ్య సూచిక. మన భూముల్లో 0.5 % కన్నా సేంద్రియ కర్బనాన్ని పెంపొందించడం కష్టసాధ్యమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అయితే, రసాయనిక ఎరువులకు పూర్తిగా స్వస్తి పలికి ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తున్న కొందరు రైతులు మాత్రం 2.0% వరకు పెంచుకోవడం సాధ్యమేనని నిరూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో, స్వల్పకాలంలోనే సేంద్రియ కర్బనాన్ని పెంచుకునే అనేక మార్గాలున్నాయని సూచిస్తున్నారు.
శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఉండాలని రైతులు భయంకరమైన గడ్డి మందుల వినియోగం చేపడుతున్నారు. కలుపు మొక్కల నివారణకు కూలీలు దొరకడం కష్టసాధ్యం అలాగే దొరికిన ఎక్కువ కూలీ అడగడం తో గిట్టుబాటు కాక సంవత్సరం వరకు కలుపు రాకుండా ఉండడానికి గడ్డి, తుంగ, పార్థీనియం, పూల గడ్డి, గారభ తదితర నివారణకు ప్రత్యామ్న్యాయం లేక భూమి నిస్సారమైన పర్వాలేదు బాగు పడతానేమో అనే మూర్ఖపు పట్టుదలతో రైతులు ఉన్నారు.
మన దేశ వ్యవసాయ చరిత్ర చాలా పురాతనమైనది. దాదాపు 9 వేల సంవత్సరాలకు ముందు నుంచే మనకు వ్యవసాయం తెలుసు. ఇన్ని వేల సంవత్సరాలు భూమి నమ్ముకొని పంటలు సాగు చేశారు మన పూర్వీకులు. భూసారం తగ్గకుండా చాలా పద్ధతులు అవలంభించారు. అయితే, మన రైతులు, శాస్త్రజ్ఞులు భూమిని మరచిపోయి 50 సంవత్సరాలు దాటింది.
1966 నుంచి అధిక దిగుబడి వంగడాలు, రసాయనిక ఎరువులపై, వీలుంటే నీటి పారుదల మీద అత్యంత శ్రద్ధ కనబరుస్తూ వస్తున్నారు. ఈ 50 ఏళ్లలో భూసారం కాలక్రమేణా తగ్గింది. అది ప్రస్తుతం ఏ స్థాయికి చేరిందంటే అసలు భూమి పంటలు పండించే శక్తిని పూర్తిగా కోల్పోయే స్థితికి చేరింది.95% భూముల్లో అతి తక్కువ సేంద్రియ కర్బనం ఉంది. నేల నమూనాలలో 95 శాతం పైగా సేంద్రియ కర్బనం 0.5% కంటే తక్కువని తేలింది. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని కొన్ని ప్రాంతాలు వర్షాధారపు భూముల్లో 0.1 శాతం వరకు పడిపోయినట్లు నమోదయింది.
వ్యవసాయ విశ్వవిద్యాలయం క్షేత్రాలలో కూడా 0.1 నుంచి 0.5 % వరకు ఉన్నట్లు నేల పరీక్షా ఫలితాలు నిరూపించాయి. పశువుల ఎరువులు, ఇతర సేంద్రియ ఎరువులు వాడకపోవడం, కేవలం రసాయనిక ఎరువుల కే పరిమితం కావడం ఈ దుస్థితికి కారణం.
సేంద్రియ కర్బనం 0.5 % కంటే తక్కువ ఉంటే పంటల ఎదుగుదల, దిగుబడులు ఆశించినంతగా ఉండవు. అలాంటి నేలల్లో పంట దిగుబడులు పెంచాలంటే రైతులకు రసాయనిక ఎరువుల సహాయం తప్పనిసరి. రైతులు చేసే మొదటి పని నత్రజని ఎరువుల వాడకం పెంచడం. దీనివల్ల పురుగులు మరియు తెగుళ్లు అధికమవుతాయి. రసాయనిక పురుగు మందుల వాడకం తప్పదు.
వీటి కల్తీ పెరుగుతున్నది. రైతులు రసాయన ఎరువులు, పురుగు మందుల దుకాణదారుల సలహాల మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. మోసాలు ఎక్కువ సాగుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. వాతావరణ వ్యత్యాసాల వల్ల పంట దిగుబడులు ఆశించినంతగా ఉండటం లేదు. ఉన్నా గిట్టుబాటు ధరలు లేక నష్టాలే మిగులుతున్నాయి. ప్రకృతి వ్యవసాయం ద్వారా సేంద్రియ కర్బనాన్ని పెంచుకుంటే గట్టెక్కవచ్చు. రసాయనిక ఎరువులు మరీ ఎక్కువగా వాడుతున్నారు.
పశువుల ఎరువు, పచ్చి రొట్ట ఎరువులను చాలా మంది రైతులు వాడటం లేదు. ఒకే పంట వేస్తున్నారు. ప్రతి ఏటా అదే సాగు చేస్తున్నారు. ఏయే పంటల్లో ఎక్కువ వాడుతున్నారు? వరి, పత్తి, మిర్చి పంటలకు రసాయనిక ఎరువులు ఎక్కువ వేస్తున్నారు. ఎంత అవసరమో గమనించకుండా పక్క రైతులు చూసి వేస్తున్నారు. పురుగు మందుల పిచికారీలో కూడా అంతే.
అందుకే సేంద్రియ కర్బనం తగ్గిపోతోంది. రసాయనిక ఎరువులతో భూమిలో వానపాములు నశించాయి. పురుగుమందులు, కలుపు మందులతో భూమిలో సూక్ష్మజీవరాశి వంద శాతం నశిస్తోంది. రైజోబియం బ్యాక్టీరియా, ఆక్టినోమైసెట్స్, మైకోరైజ వంటి మేలు చేసే సూక్ష్మజీవ రాశి పూర్తిగా అంతరించిపోతోంది. రైతుల పంట దిగుబడులు ఆశించినంతగా లేకపోయినా బాగానే ఉంటాయి. పంట మొక్కల పటుత్వం, ధృఢత్వం పెరుగుతుంది. వర్షాలు, గాలులు ఎక్కువయినా కొన్ని పంటలు పడిపోకుండా తట్టుకోగలవు.
ఈ పైర్లలో రసాయనిక ఎరువులతో పెరిగిన మొక్కల కున్న మృదుత్వం ఉండదు. కొన్ని రకాల కీటకాలు (పిండి పురుగు) తెగుళ్లు (ఆకుమచ్చ) ఆశించవు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకున్నా కొంత దిగుబడులు తప్పకుండా వస్తాయి. ఇలాంటి నేలలోని పైరును కీటకాలు తెగుళ్ల బారి నుంచి రక్షించడం తేలిక. జీవామృతం పిచికారి తో కూడా వాటిని నివారించవచ్చు.
అన్ని ప్రాంతాల్లో దొరికే ఆకులతో (కీటక నివారిణి) తయారు చేసిన ద్రావణంతో చీడపీడలను నివారించవచ్చు. అంటే పంట దిగుబడి కయ్యే ఖర్చు గణనీయంగా తగ్గించగలరు. ఇలాంటి నేలల్లో వ్యవసాయం తప్పకుండా లాభసాటిగా ఉంటుంది. రైతుల ఆత్మహత్యలకు పాల్పడే ఆస్కారం ఉండదు. సేంద్రియ కర్బనం 2.0% గానీ లేదా అంతకు మించి గాని పెంచగలిగిన నేలలు పంటలు సాగు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నామని, రెండంకెల వృద్ధిరేటు సాధిస్తామన్న వార్తలు తరచూ వింటూ ఉంటాం. దేశం మారిపోతోందని మనసులో సంబరపడుతూంటాం. ఇందులో వాస్తవమెంత? అన్న ప్రశ్న వేసుకుంటే భిన్నమైన జవాబులు వస్తాయి. ఆర్థిక వృద్ధి మాటేమోగానీ, పర్యావరణపరంగా మాత్రం భారత్ ఏటికేడాదీ క్షీణిస్తోందని, వెనుకబడిపోతోందని హెచ్చరిస్తోంది సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్.
అటవీ విస్తీర్ణం తగ్గిపోవడంతో పాటు ఎడారి భూములు ఎక్కువవుతున్న వైనాన్ని విడమరిచింది.భూసార కార్డులు అందలేదు : కేంద్రం చేపట్టిన భూసార కార్డుల జారీ విజయవంతం అయినట్లు దేశ వ్యవసాయ పోర్టల్ లో దేశంలో ని 23 కోట్ల మంది రైతులకు రెండు పర్యాయాలు ఇచ్చినట్లు ఉంది. దేశంలో 90 శాతం మంది రైతులకు ఈ కార్యక్రమం గురించి తెలియదు.
మట్టి మూనాలు ఎప్పుడు సేకరించారో తెలియదు. యాంత్రికంగా కొన్ని ప్రాంతాలలో రైతు పేరుతో కొన్ని చోట్ల సాయిల్ హెల్త్ కార్డ్స్ జారీచేశారు. చాల రాష్ట్రాలలో సాయిల్ టెస్టింగ్ ప్రయోగశాలలు లేవు. ఉన్న వాటిలో పరీక్షలు నిర్వహించడం లేదు. గత మూడు సంవత్సరాలుగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న కేంద్రాలు పట్టుమని వెయ్యి పరీక్షలు జరిపిన పాపాన పోలేదు. రసాయన ఎరువులు, కీటకనాశినుల విచ్చలవిడి వాడకానికి కళ్లెం వేసేందుకు, సూక్ష్మ పోషకాల సరఫరా ద్వారా దిగుబడులను పెంచేందుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని 2015లో ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా సారవంతమైన భూమి విస్తీర్ణం ఏటికేడాది తగ్గిపోతోంది. దేశంలో మొత్తం 32.87 కోట్ల చదరపు హెక్టార్ల భూమి ఉండగా ఇందులో దాదాపు 10.51 కోట్ల చదరపు హెక్టార్ల భూమి సారం క్షీణించింది. 2030 నాటికల్లా ఈ భూసార క్షీణతకు అడ్డుకట్ట వేస్తామని భారత్ ఐక్యరాజ్య సమితికి హామీ ఇచ్చినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు సరికదా. ఎడారిలా మారుతున్న ప్రాంతాలు ఎక్కువ అవుతున్నాయి. 2003–05, 2011–13, 2017-2019 మధ్యకాలంలోనే 48 లక్షల చదరపు హెక్టార్ల భూమి ఎడారిగా మారిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.