మద్యం మీద తెచ్చిన అప్పులను దాచేశారు…
ప్రభుత్వ భూములు, ఆస్తులు తాకట్టు లో మరియు ఇతర మార్గాల ద్వారా తెచ్చిన అప్పులను దాచేశారు…
రాష్ట్రాన్ని అప్పుల సుడిగుండంలో నెట్టేసిన మీరు గడచిన నాలుగున్నరేళ్ళలో ఏ ఒక్క నెలలోనైనా అప్పు చెయ్యని నెల ఒక్కటైనా ఉందా చెప్పండి జగన్ గారు..?
ట్విట్టర్ వేదికగా ‘గంటా శ్రీనివాసరావు’
రాష్ట్రంలో పరిమితికి మించి అడ్డదారుల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడి 10 లక్షల కోట్లు పైగా రుణాలు, బకాయిలు చేసి..
ఇప్పుడు 4 లక్షల కోట్లుగా మీ ప్రభుత్వం చూపిస్తుంది..
రాష్ట్రం ‘ఎఫ్‌ఆర్‌బీఎం’ లో చెప్పిన లెక్కలు
మరియు రిజర్వు బ్యాంకు రూపొందించిన రాష్ట్ర ‘జీఎస్‌డీపీ’ లో 32.95% రుణాలు మాత్రమే నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో తెలిపారు….
వాస్తవంగా ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట అమలును రాష్ట్ర శాసన వ్యవస్థ నే పర్యవేక్షిస్తుంది దీనిని తప్పులు తడకలు గా రూపొందించి కేంద్రానికి పంపింది ఈ గారడి ప్రభుత్వం….
కార్పొరేషన్ల ద్వారా, మద్యం ద్వారా, ప్రభుత్వ ఆస్తుల తాకట్టు ద్వారా తెచ్చిన అప్పులను లెక్కలు చెప్పడంలేదంటూ నాలుగేళ్లుగా ‘కాగ్’ మొత్తుకుంటూనే ఉంది..
అయినా ఈ అడ్డదారుల అప్పుల లెక్కలను రాష్ట్ర ప్రభుత్వం ‘కాగ్’ కు చూపించలేదు…
సామాన్యులకు సైతం అర్ధమయ్యేలా కనిపిస్తున్నాయి మీ అప్పుల తప్పుల తడకలు కానీ మీ బ్లూ మీడియా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పరిమితులకు లోబడే అప్పులు చేస్తున్నట్లు కేంద్రం సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా.. రెండు రోజులుగా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం మీకు మాత్రమే సాధ్యం జగన్మోహన్ రెడ్డి గారు..
మీకు నిజంగా నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే , కార్పొరేషన్ ద్వారా, మద్యం మీద, ప్రభుత్వ భూములు, ఆస్తులు తాకట్టు ద్వారా అప్పులు తీసుకు రాలేదని చెప్పగలరా….?
ఇవన్నీ వాస్తవాలు కాదని చెప్పగలరా…?
ఇవన్నీ అప్పులు కాకా మరేమంటారో మీరే చెప్పండి…?
ఎందుకు మీరు ప్రతి దానిని మసిపూసి మారేడికాయ చేస్తూ , అవాస్తవాలు చెప్తూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు…
మీరు చేస్తున్నా ప్రతి అవినీతి, చెబుతున్నా
అవాస్తవాలు ప్రజా కోర్ట్ లో నిరూపితమై దోషి గా నిలబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు..