కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్

Spread the love

– జగన్‌కు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ జాతీయ కార్యాలయం ఇంఛార్జి అరుణ్ సింగ్ హెచ్చరిక

కర్నూలు : బీజేపీ కార్యకర్తల జోలికి వస్తే వారికి అండగా 17 కోట్ల మంది బిజెపి కార్యకర్తలు అండగా ఉంటాం. ఉత్తర ప్రదేశ్ లో ములాయం ఇదే విధమైన పాలన చేస్తే అక్కడ ప్రజలు ఏ తీర్పు ఇచ్చారో తెలుసుకుని జగన్ గుణపాఠం నేర్చుకోవాలి. బిజెపి కార్యకర్తలు జోలికి వచ్చిన ఎమ్మెల్యే చక్రపాణి ని భగవంతుడు శిక్షిస్తాడు. ఆత్మకూరు సంఘటన లో బిజెపి నేత బుడ్డా శ్రీ కాంత్ రెడ్డి పై పెట్టిన కేసు ఉపసంహరించాలి.

ఏ రాష్ట్రంలో నైనా పేరివిజన్ జరిగితే జీతాలు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ అందుకు విరుద్దమా? రాష్ట్రంలో ఇసుక, మట్టి మాఫియా రాజ్యమేలుతోందన్నారు.రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందన్నారు.
ఆన్లైన్ లో స్వామి పరిపూర్ణానంద మాట్లాడుతూ అవసరమైతే శ్రీ కాంత్ రెడ్డి కోసం జైల్ భరో పిలుపు ఇవ్వాలన్నారు.

బీజేపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర కో ఇన్ ఛార్జ్ సునీల్ దేవధర్:
బిజెపి అవసరమైతే ఫయర్ అవుతుంది బిజెపి కార్యకర్తల జోలికొస్తే ఊ‌రుకొనేది లేదు. హిందువులు కు ఒక న్యాయం మిగిలిన వారికి ఒక న్యాయ మా? ఆత్మకూరు సంఘటన లో ప్రభుత్వం సంఘ విద్రోహుల పక్షాన ఉంది. రాజ్యాంగ ప్రకారం ప్రభుత్వం నడుచుకోలేదు. ఆత్మకూరు, గూడూరు. లలో బిజెపి కా‌ర్యకర్తలపై పెట్టి న కేసు లు ఎత్తి వేయాలి.

ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ , హిందువులకు సహనం ఉంది కదా అని పరీక్షించవద్దు. ఓబీసీ జాతీయ కా‌ర్యద‌ర్శి పార్థ సారధి మాట్లాడుతూ కార్యకర్తలు లో ధైర్యాన్ని నింపిన బిజెపి అధ్యక్షుడు సోమువీర్రాజు కు ధన్యవాదాలు చెప్పారు.

Leave a Reply