– అమరావతిని సింగపూర్ చేస్తానని ప్రకటనలు చేసి మోసం చేసింది బాబే
– జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడితే.. నాలుక కట్ అయిపోద్ది
– రాష్ట్రానికి మేలు చేస్తోన్న జగన్ గారిపై ఈగ వాలనివ్వం
– వేర్వేరు ప్రదేశాల్లో మీడియాతో మాట్లాడిన నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్
వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ… ఏమన్నారంటే..
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి, మంత్రి పదవి పోయేసరికి మందుకు, గంజాయికి బానిసై, మతిభ్రమించి, ఓ శాడిస్ట్ లా అయ్యన్నపాత్రుడు తయారయ్యాడు. జగన్ సంక్షేమ పరిపాలన చూశాక, మరో 30 ఏళ్ళ పాటు రాష్ట్రంలో వైయస్ఆర్ సీపీనే అధికారంలో ఉంటుందనే దుగ్ధతో, జగన్ ముఖ్యమంత్రిగా ఉంటారనే ఆందోళనతో అయ్యన్నపాత్రుడు నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు.
తేడా అయ్యన్నపాత్రుడులోనే ఉంది. ఆయన హావభావాలు చూసినా, ఆయన మాట్లాడే బూతు మాటలు చూసినా ఆయనలోనే ఏదో తేడా ఉందని రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. అయ్యన్నపాత్రుడులో శాడిజం ఏ స్థాయిలో పెరిగిపోయిందనే విషయం ఆయన భార్యగా పద్మావతికి తెలిసే ఉంటుంది.
అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి .. తక్షణమే వైజాగ్ పిచ్చి ఆస్పత్రిలో గానీ, హైదరాబాద్ ఎర్రగడ్డ పిచ్చి ఆస్పత్రిలో గానీ, చేర్చి వైద్యం చేయించాలి, లేకుంటే, ఆ శాడిజం రోజురోజుకీ పెరిగిపోతుంది.
జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తుంటే… స్వాగతించాల్సిందిపోయి, మతి లేకుండా, బుద్ధి, జ్ఞానం లేకుండా అయ్యన్నపాత్రుడు మాటలు ఉన్నాయి. ఆయన పక్కనే పాడేరు వెళ్లి చూస్తే పిల్లర్స్ దశలో ఉన్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో కనిపిస్తాయి. ఎంతసేపటికీ రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయాలి, ఏదో రకంగా బురదజల్లాలనే ఉద్దేశంతోనే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు టిడ్కో ఇళ్ళు పూర్తి చేయలేకపోయారు. ఎందుకు లబ్ధిదారులకు ఇవ్వలేకపోయారు. ఓటీఎస్ ను వ్యతిరేకిస్తున్న మీరు.. మీ హయాంలో కనీసం ఆ ఇళ్ళ మీద ఉన్న వడ్డీలు కూడా ఎందుకు మాఫీ చేయలేకపోయారు..? ముఖ్యమంత్రి జగన్ , టీడీపీ హయాంలో మంజూరు చేసిన ఇళ్ళను కూడా పూర్తి చేసి, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఇస్తుంటే… శాడిస్ట్ అయ్యన్నపాత్రుడు వాస్తవాలను తెలుసుకోకుండా నోరు ఉంది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు.
జిల్లాకో ఎయిర్ పోర్టు కట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశిస్తే.. ఎందుకు చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు భుజాలు తడుముకుంటున్నారు.? ఎయిర్ పోర్టులు నిర్మిస్తే.. మీకు ఏంటి నష్టం..? ప్రజలు బాగుంటే, ఆనందంగా చూసి ఓర్వలేరా..?
ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల్లోకి సానుకూలంగా వెళ్లకూడదనే దుర్బుద్ధితో, మీ అనుకూల మీడియా ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడమే టీడీపీ శాడిస్టుల పని.
14 ఏళ్ళు చంద్రబాబే ముఖ్యమంత్రిగా వెలగబెట్టి, టీడీపీనే అత్యధికంగా రాష్ట్రంలో అధికారంలో ఉండి, చంద్రబాబు కేబినెట్ లో మీరు మంత్రిగా వెలగబెట్టి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించడానికి సిగ్గు లేదా…?
టీడీపీ హయాంలో గాలిలో మేడలు కట్టి, గ్రాఫిక్స్ ను ప్రజలకు చూపించి, చేసిన ప్రకటనలు, తీసుకున్న నిర్ణయాలు చూస్తే ఎవరు పిచ్చివాళ్ళు అన్నది అర్థమవుతుంది. అమరావతిని మరో సింగపూర్ చేస్తానని, మరో జపాన్ చేస్తానని అరచేతిలో వైకుంఠం చూపించి, రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వ్యక్తులు మీరే.
వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ఏమన్నారంటే..
గౌరవ ముఖ్యమంత్రి జగన్ ని ఉద్ధేశించి అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలను, ఆయన వాడిన పదజాలాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అయ్యన్నపాత్రుడు రాజకీయాల్లో ఉండదగనివాడు అని రాష్ట్ర ప్రజలంతా అనుకుంటున్నారు. పెగ్గు వేయకపోతే.. మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేని వ్యక్తి, మహిళల్ని అగౌరవపరిచి, అవమానించే అయ్యన్నపాత్రుడుకి మున్ముందు మరింతగా ప్రజలు బుద్ధి చెబుతారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎయిర్ పోర్టు పేరుతో ఎంతోమంది జీవితాలను నాశనం చేసి, అక్రమ ఆస్తులు సంపాదించిన అయ్యన్నపాత్రుడి చరిత్ర ఎవరికి తెలియదు. అయ్యన్నపాత్రుడి లాంటి శాజిస్టును ఎలా భరించారు తల్లీ.. ఎందుకు ఆస్పత్రికి తీసుకు వెళ్ళి చికిత్స చేయించలేదు అని ఆయన భార్యను అడుగుతున్నాం. అయ్యన్నపాత్రుడు ప్రవర్తన, వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా, మహిళలను అవమానపరిచే విధంగా ఉన్నాయి. ఇప్పటికైనా అయ్యన్నపాత్రుడు ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి, లేకుంటే నాలుక కట్ అయిపోద్ది.. అని హెచ్చరిస్తున్నాం.
మీకు దమ్ముంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశారో చెప్పండి.. జగన్ ఈ 30 నెలల పరిపాలనలో ఏం చేశారో మేం చెప్తాం.. అవి వదిలేసి ఇంట్లో ఉన్న ఆడపచులు గురించి మాట్లాడతారా? రాష్ట్రానికి, ప్రజలకు ఇంత మేలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్ మీద ఈగ వాలనివ్వం.. అవాకులు చెవాకులు మాట్లాడితే.. తాట తీస్తామని హెచ్చరిస్తున్నాము