Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది

-మనం రాక్షసుడితో పోరాడుతున్నాం
-మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య

నందిగామ టౌన్ : మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య శనివారం ఉదయం తన కార్యాలయంలో నందిగామ మండల క్లస్టర్ ఇన్చార్జిలు, యూనిట్ ఇన్చార్జిలు, బూత్ కన్వీనర్లు మరియు ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ..

ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు చూస్తూనే ఉన్నాము.ప్రతిపక్ష నాయకులనే టార్గెట్ చేసుకొని బూతులు మాట్లాడటం దాడులు చేయడం రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూనే ఉంది.గుర్తుపెట్టుకుందాం మనల్ని మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారు.ప్రపంచ నేతలు గర్వించదగ్గ మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని సైతం కంటతడి పెట్టించారు ప్రతి ఒక్క దానికి లెక్క అప్ప చెప్తాం.

అరాచకాలకు, అక్రమాలకు, అన్యాయాలకు కేరాఫ్ ఈ వైసీపీ ప్రభుత్వం.ఓటరు జాబితాలు మరియు సవరణలపై గ్రామంలో బూత్ కన్వీనర్ మరియు సెక్షన్ ఇంచార్జ్లు సంయుక్తంగా సమన్వయంతో కలిసి పనిచేయాలి.బూత్ కన్వీనర్ల పైన యూనిట్ ఇన్చార్జిలు మరియు వారిపై క్లస్టర్ ఇంచార్జ్ పర్యవేక్షణ చేస్తూ వారితో అనుసంధానంగా పనిచేయాలి.

ప్రతి ఒక్కరి సమిష్టి కృషి రానున్న రోజుల గెలుపుకు నాంది కావాలి.అలసత్వం వీడి పని వేగవంతం చేయడానికి ప్రతి ఒక్కరం ఈ రోజు నుంచే సంసిద్ధమవుదాం.సమిష్టిగా కలిసి పని చేద్దాం.సమయం లేదు కుటుంబ సభ్యులారా పోరాటానికి సిద్ధం కావాలి ఓటరు జాబితాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం.ప్రతి బూతు కన్వీనర్, యూనిట్ ఇంచార్జ్, క్లస్టర్ ఇంచార్జ్ మరియు ముఖ్య నాయకులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తుంటాను. ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు సంసిద్ధంగా ఉండాలి.

LEAVE A RESPONSE