చుక్కా రామ‌య్య‌ను స‌త్క‌రించిన మంత్రి ఎర్ర‌బెల్లి

-తెలంగాణ సాయుధ పోరాట యోధుడు చుక్కా రామ‌య్య‌ను స‌త్క‌రించిన మంత్రి ఎర్ర‌బెల్లి
-ఆయ‌న ఆరోగ్యంపై ఆరా! ఆయు ఆరోగ్యాల‌తో ఉండాల‌ని ఆకాంక్ష‌
-రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న తెలంగాణ జాతీయ స‌మైక్య‌త‌ వ‌జ్రోత్స‌వాల వేడుల‌ను రామ‌య్య‌కు వివ‌రించిన మంత్రి
-ఆయ‌న‌కు పాదాభివంద‌నం చేసి, ఆశీస్సులు తీసుకున్న ద‌యాక‌ర్ రావు
-తెలంగాణ ప్ర‌భుత్వాన్ని, సిఎం కెసిఆర్ ని, మంత్రి ఎర్ర‌బెల్లిని అభినందించిన చుక్కా రామ‌య్య‌

హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 17ః నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్సీ, ఐఐటి (చుక్కా) రామ‌య్య‌ను రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డితోపాటు శ‌నివారం హైద‌రాబాద్ లోని ఆయ‌న ఇంట్లో క‌లిశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి, ఎమ్మెల్యేలు ఆయ‌న‌కు పాదాభివంద‌నం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయ‌న ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయ‌న ఆయు ఆరోగ్యాల‌తో ఉండాల‌ని కోరుకున్నారు. ఆనాటి పోరాట స్మృతుల‌ను నెమ‌రు వేసుకుంటూ, ఆనాటి అమ‌రుల త్యాగాల‌ను కీర్తిస్తూ, విలీన దినోత్స‌వాన్ని తెలంగాణ జాతీయ స‌మైక్య‌త‌ వ‌జ్రోత్స‌వాల వేడులుగా రాష్ట్ర‌ ప్ర‌భుత్వం త‌ర‌పున సీఎం కెసిఆర్ నిర్వ‌హిస్తున్న మూడు రోజుల వేడుక‌లు, ఏడాదంతా నిర్వ‌హిస్తున్న ఇత‌ర కార్య‌క్ర‌మాల‌ను మంత్రి రామ‌య్య‌కు వివ‌రించారు.

తెలంగాణ ప్ర‌భుత్వాన్ని, సిఎం కెసిఆర్ ని, మంత్రి ఎర్ర‌బెల్లిని చుక్కా రామ‌య్య అభినందించారు. గొప్ప కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నార‌ని కొనియాడారు. వ‌యో భారంతో కూడిన ఆనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న రామ‌య్య‌ను జాతీయ స‌మైక్య‌త‌ వ‌జ్రోత్స‌వాల వేడుల సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి స‌న్మానించారు.