గద్దర్ సమాధి వద్ద డిప్యూటీ సీఎం భట్టి నివాళులు

-ధైర్యంగా ఉండండి మీ కుటుంబానికి అండగా ఉన్నాం
-ప్రజా యుద్ధనౌక గద్దర్ భార్యకు డిప్యూటీ సీఎం భట్టి భరోసా
-డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి గద్దర్ నివాసానికి వెళ్లిన భట్టి విక్రమార్క

సికింద్రాబాద్ వెంకటాపురం లోని మహాబోధి విద్యాలయం ఆవరణలో ఉన్న ప్రజా యుద్ధ నౌక గద్దర్ సమాధి వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం నివాళులు అర్పించారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా భట్టి విక్రమార్క గద్దర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. భట్టి విక్రమార్కను చూసి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్న గద్దర్ భార్య గుమ్మడి విమల ను డిప్యూటీ సీఎం ఓదార్చారు.

మీరు ధైర్యంగా ఉండండి. మీ అందరికీ మేమున్నాం. గద్దర్ అన్న కుటుంబానికి మేమంతా అండగా ఉన్నాం. మీరు ఎందుకు అధైర్య పడుతున్నారని” ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. గద్దర్ కుమారుడు సూర్యం కుమార్తె వెన్నెల కోడలు సరిత లతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న తర్వాత మహా బోధి విద్యాలయంలో ఉన్న గద్దర్ సమాధిని సందర్శించారు.‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వెంట ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు , మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఉన్నారు.

Leave a Reply