Home » ఎయిడెడ్ వ్యవస్థ సర్వనాశనం

ఎయిడెడ్ వ్యవస్థ సర్వనాశనం

– ఎయిడెడ్ విద్యావ్యవస్థను నాశనం చేసే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది?
– తల్లిదండ్రులను సంప్రదించకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడమేంటి?
– ఎయిడెడ్ విద్యావ్యవస్థ స్థానంలో తిరిగి ప్రభుత్వ విద్యావ్యవస్థను ఏర్పాటుచేయగల సత్తా, సామర్థ్యం పాలకులకు ఉన్నాయా?
– శాసనమండలి మాజీ సభ్యులు ఏ.ఎస్.రామకృష్ణ
వైసీపీప్రభుత్వం ఎయిడెడ్ వ్యవస్థను సర్వనాశనంచేయడానికి పూనుకుందని, సదరు విద్యాసంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయు లు, విద్యార్థులు, వారితల్లిదండ్రులు గమనించాలని టీడీపీనేత, మాజీఎమ్మెల్సీ ఏ.ఎస్.రామకృష్ణ సూచించారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం… ఎప్పుడో 1854లో ఒకకమిటీ, భారతదేశంలో విద్యాసేవలు అందించగల, విద్యాసంస్థలను నడపగల శక్తియుక్తులు ఉన్నవారు ఉన్నారని గుర్తించడం జరిగింది. అలాంటి వారికిఆర్థికంగా చేయూత అందిస్తే, దేశంలోని పేద, మధ్యతరగతి వర్గాలు విద్య అందుబాటులోకి వస్తుందని సదరుకమిటీ ఆలోచనచేసింది. ఆ ఆలోచన నుంచే ఎయిడెడ్ విద్యావ్యవస్థ భారతసమాజంలోప్రవేశ పెట్టడం జరిగింది.
అంతటి సుదీర్థమైన ఎయిడెడ్ విద్యావ్యవస్థను కూలదోయడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమవడం దుర్మార్గం. ప్రభు త్వం ఎందుకు ఈ పనిచేస్తోందో తెలియడంలేదు. ప్రభుత్వచర్యతో ఎయిడెడ్ విద్యాసంస్థల అధ్యాపకులకు, వాటిలోచదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎలాంటిప్రయోజనం లభించడం లేదు. అలాంటప్పుడు ఈప్రభుత్వం ఎందుకీ పిచ్చిపని చేస్తోంది? ఎక్కడో సరిగా నడవని ఒకటీ అరాపాఠశాలలు, కళాశాలలను సాకుగాచూపి, ఎన్నోఏళ్లనుంచి లక్షలాది పేద, మధ్యతరగతి విద్యా ర్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఎయిడెడ్ విద్యాసంస్థల ను కాలరాయాలని ఈప్రభుత్వం చూడటం సరికాదు.
ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల్లో ఉండే సిబ్బందికంటే, ఎయిడెడ్ పాఠశాల లు, కళాశాలల్లో పనిచేసే దాదాపు 16వేలమంది సిబ్బంది బాగా పనిచేస్తారని చెబుతూ, ప్రభుత్వం వారందరినీ ప్రభుత్వవిద్యాసంస్థ ల్లోకి బదిలీచేయడం జరిగింది. ప్రభుత్వం నియమించిన రత్న కుమారి కమిటీ ఎన్ని ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారితల్లిదండ్రులతో చర్చలుజరిపిం దనే ప్రశ్నకు సమాధానంలేదు. కానీ సదరు కమిటీ ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇవ్వడం, తరువాత జీవోనెం 41, 50, 51 జీవోలివ్వడం అంతాకుట్రపూరితమే.
ఆ వ్యవహారమంతా ఎయిడెడ్ విద్యావ్యవస్థను పతనంచేయడానికి జరిగిన తంతుగానే తమకు అనిపిస్తోంది. ప్రభుత్వం ఎందుకిలా ప్రవర్తిస్తోందని స్వయంగా విద్యార్థులు, వారితల్లిదండ్రులు, ఉపాధ్యాయులే అంటున్నారు. ముందస్తు ప్రణాళికలేకుండా, ఎటువంటి సమాచారంలేకుండా ఉన్నపళంగా ఎయిడెడ్ విద్యావ్యవస్థల్లోపనిచేసే సిబ్బందిని ఆర్జేడీ కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలను వారు గౌరవించారు. అలా రిపోర్ట్ చేసిన సిబ్బందిలో ఇప్పటికీ చాలామందికి ఎక్కడో పోస్టింగ్ ఇచ్చారోకూడా తెలియడం లేదు. ఆ విధంగా ఎయిడెడ్ విద్యావ్యవస్థల సిబ్బందిని నడిరోడ్డు పై నిలుచోబెట్టారు. ఇప్పుడు వారికి ఎక్కడ పోస్టింగ్ లు ఇస్తారో, బదిలీలుఎలా ఉంటాయో, ఏ బేసిస్ మీద జీతభత్యాలు, ప్రమోషన్లు నిర్ణయిస్తారో వారికే అంతు చిక్కడం లేదు.
ఇలాంటి అనేకప్రశ్నలకు సమాధానంచెప్పకుండా ఎయిడెడ్ సిబ్బందిని విధులనుంచి దూరంచేసిన ప్రభుత్వం, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న దాదాపు 5లక్షలమంది విద్యార్థులజీవితాలను చీకట్లపాలు చేసింది. ఎయిడెడ్ విద్యాసంస్థలను సమర్థంగా నిర్వ హిస్తున్న అనేక యాజమాన్యాలు, ప్రైవేట్ వ్యక్తులు కూడా మాకెం దుకులే అనేపరిస్థితిని ప్రభుత్వమే కల్పించింది. ప్రజావేదిక కూల్చివేతతో పతనావ్యవస్థకు అంకురార్పణచేసిన ప్రభుత్వం నిన్నటివరకు అనేకవ్యవస్థలనుకూల్చేసి, ఇప్పుడు ఎయిడెడ్ విద్యావ్యవస్థను నేలకూల్చింది.
ఎయిడెడ్ అధ్యాపకులను ప్రభుత్వ డిగ్రీకళాశాలలకు బదిలీచేయా లని నిర్ణయించిన తరువాత, అంతకుముందు అక్కడపనిచేసే దాదాపు 750మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను అకస్మాత్తుగా తొలగిం చారు. అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మినెంట్ చేస్తాన ని చెప్పినహామీని నిలబెట్టుకోని ముఖ్యమంత్రి, ఇప్పుడు ఏకంగా వారిని ఉద్యోగాలనుంచే తొలగించాడు. టీడీపీప్రభుత్వం కాంట్రాక్ట్ అధ్యాపకులు జీతాన్ని రూ.18,700 నుంచి రూ.37,100కు పెంచడం జరిగింది. అదివరకు 12నెలలనుంచీ పెండింగ్ లో ఉన్న జీతాలను ఒకేసారి టీడీపీప్రభుత్వం వారికి చెల్లించింది. అలానే మహిళా ఉద్యోగినులకు 180రోజుల ప్రసూతిసెలవులను మంజూరు చేయడంజరిగింది. కాంట్రాక్ట్ అధ్యాపకులకోసం చంద్రబాబునాయు డు అనేక మంచి పనులు చేశారు.
ఎయిడెడ్ సిబ్బందిని తమ స్థానాల్లో నియమిస్తూ, తమను తొలగించడంతో కాంట్రాక్ట్ అధ్యాపకులు ఇప్పటికే ధర్నాలకు దిగారు. కాంట్రాక్ట్ అధ్యాపకులను తొలగించిన ప్రభుత్వం ఎయిడెడ్ సిబ్బందికి కూడా న్యాయంచేయలేదు. ఎయి డెడ్ సిబ్బంది అనేకమంది కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు దిగుతు న్నారు. సిబ్బందితో పెట్టుకున్న ప్రభుత్వం, మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీల విద్యాసంస్థలను కూడా మూసేయించడానికి సిద్ధమైంది. లయోలా కళాశాల, ముస్లిం మైనారిటీ కళాశాలలతో ప్రభుత్వానికి ఏం పని? వాటిజోలికి వెళ్లాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఏమొచ్చింది? అక్కడపనిచేసే వారిని తీసేసే అధికారం ఎవరిచ్చా రు?
పాలకులు ఎందుకిలా పిచ్చిపిచ్చి పనులుచేస్తున్నారు. సమాజంపై ఆధారపడే కొన్నివ్యవస్థల్లోని లోపాలను సరిదిద్ది, వాటిని గాడినపెట్టాల్సిన ప్రభుత్వమే, వాటిని లేకుండా చేయాలని చూడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాం. ఎయిడెడ్ సిబ్బంది ఇప్పటికే ప్రభుత్వతీరుపై హైకోర్టునిఆశ్రయించారు. ఎయిడెడ్ సిబ్బంది, విద్యాసంస్థలవిషయంలో ఒకటిచేస్తున్న ప్రభుత్వం, కోర్టుకి మరోలా చెప్పింది. అనేకవిద్యాసంస్థలు ప్రభుత్వానికి భయపడే ఎయిడెడ్ సిబ్బందిని సరెండర్ చేశాయి.
మాటతప్పను, మడమతిప్పను అని చెప్పుకునేవారే, సీపీఎస్ రద్దు విషయంలో మాటతప్పారు. దాని గురించి చెప్పి ఉద్యోగుల ఓట్లను గుంజుకున్నవారు,ఇప్పుడు అదే ఉద్యోగులసమస్యలను పట్టించుకోవడం మానేశారు. ఎయిడెడ్ విద్యావ్యవస్థ పతనం కావడానికి ప్రభుత్వమే కారణమవుతోంది. అందుకు తగిన మూల్యం సర్కారు చెల్లించుకుంటుంది. తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఇదివరకు ఉన్న ఎయిడెడ్ విద్యావ్యవస్థ ను తిరిగి కొనసాగిస్తుందని స్పష్టంచేస్తున్నాం. ఎయిడెడ్ విద్యా వ్యవస్థలో ఉన్న సిబ్బందిని అడాప్ట్ చేసుకునే సామర్థ్యం, సత్తా రెండూ ప్రభుత్వానికిలేవు.
ప్రభుత్వచర్యలతో ఎందరో అధ్యాపకు లు, విద్యార్థులకు బాధేమిగిలింది. తక్కువఖర్చుతో తమకు లభి స్తున్న విద్యఅందడంలేదని విద్యార్థులు, తమఉద్యోగాలపరిస్థితి ఏమిటని సిబ్బంది తీవ్రమైనఆందోళనలో ఉన్నారు. ఎయిడెడ్ సం స్థల యాజమాన్యాలుకూడా ప్రభుత్వతీరుపై ఆగ్రహంతోఉన్నాయి. ఎయిడెడ్ వ్యవస్థనునాశనంచేయడానికి సిద్ధమైన ప్రభుత్వం దాని స్థానంలో సొంతంగా ప్రభుత్వఆధ్వర్యంలో సరికొత్త విద్యావ్యవస్థను ఏర్పాటుచేయగలదా? అంతటి సామర్థ్యం, ఆర్థికబలం ప్రభుత్వానికి ఉన్నాయా? నిజంగా ప్రభుత్వం ఆపనిచేస్తే టీడీపీ దాన్ని స్వాగ తిస్తుంది. ఎక్కడైతే ఎయిడెడ్ విద్యాసంస్థలు లేకుండా చేస్తున్నా రో, అక్కడతిరిగి ప్రభుత్వ విద్యాసంస్థలను ఏర్పాటుచేయాలి. ఆ పనిచేయలేని ప్రభుత్వానికి ఎయిడెడ్ విద్యావ్యవస్థను నాశనంచే సే హక్కులేదు.
ముఖ్యంగా మైనారిటీలు వారిస్వయంప్రతిపత్తి కోసం ఏర్పాటుచేసిన విద్యాసంస్థలను కూడాప్రభుత్వం వదలడం లేదు. ఎవరి ఓట్లతో అయితే అధికారంలోకి వచ్చారో, అదే మైనారి టీల విద్యాసంస్థలజోలికి ఈ ప్రభుత్వం వెళుతోంది. వాటినే లేకుం డా చేయాలని చూస్తోంది. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులే ప్రధాన స్టేక్ హోల్డర్లు, ఉపాధ్యాయసంఘాల నేతలు, అధ్యాపకసిబ్బంది స్టేక్ హోల్డర్లు. కానీ ఈ ప్రభుత్వంవారితో సంప్రదించకుండానే ఎయిడెడ్ విద్యాసంస్థలను లేకుండా చేయాల ని ఒంటెద్దుపోకడలతో ముందుకెళుతోంది. ఎయిడెడ్ విధ్యాసంస్థ లనుంచి తొలగించినసిబ్బందికి ఎక్కడ పోస్టింగ్స్ఇస్తారో తెలియక, ఎలాంటిజీతభత్యాలు ఇస్తారో అర్థంకాక తీవ్రంగాఆందోళన చెందుతు న్నారు.
ప్రజలు అధికారమిచ్చింది ఇష్టానుసారం ప్రవర్తించడానికి కాదనే వాస్తవాన్ని గ్రహించండి. పేదలు, మధ్యతరగతి వారికి విద్య ను అందించే వ్యవస్థను కాలరాసి, వారిపొట్టకొట్టే అధికారం ఈప్రభు త్వానికి ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నాం. ఎయిడెడ్ విద్యావ్యవస్థ పతనం అంతిమంగా వ్యవస్థకు మంచిదికాదని ముఖ్యమంత్రి గారు గుర్తించాలి. విద్యావ్యవస్థను పరిరక్షించే నిర్ణయాలు తీసుకోవాల్సి న ప్రభుత్వమే ఒకవ్యవస్థను నాశనంచేసి, మరో వ్యవస్థను బాగు చేస్తున్నామని చెబుతూ, రెండువ్యవస్థలను నాశనంచేస్తోంది. టీచర్లంతా ఏకీకృతసర్వీసులపై ప్రశ్నిస్తున్నారు. దానిపై ఈ ప్రభుత్వంగానీ, ప్రభుత్వపెద్దలు గానీ మాట్లాడటంలేదు. ఎయిడెడ్ విద్యావ్యవస్థకు సంబంధించి ప్రభుత్వంచేసింది ముమ్మాటికీ తప్పే. ప్రభుత్వం వ్యవహరిస్తున్నతీరుని, దుందుడుకు చర్యలను ప్రజలే నిరోధించాలి. వారుగళమెత్తితేనే పాలకులు ఆత్మరక్షణలో పడతారు.

Leave a Reply