కేసిఆర్ వల్లే తెలంగాణ అభివృద్ది

-ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి దుంకుతున్నయి
-కేసిఆర్ అమలు చేస్తున్న పథకాలు,అభివృద్ది దేశంలో ఎక్కడా లేదు
-కేవలం 8ఏళ్లలోనే ప్రజల జీవన శైలిలో మార్పు వచ్చింది
-జూటా మాటల బీజేపీ దేశాన్ని సర్వ నాశనం చేస్తోంది
-రైతులను మోసం చేసిన అర్వింద్ కు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నరు
-రైతుబంధును కాపీ కొట్టిన ప్రధానికిసాన్ సమ్మాన్ యోజన పథకం నిజామాబాద్ జిల్లాలోఎంత మందికి ఇస్తున్నారు..?
-మోడీ పాలన వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు అరిగోస పడుతున్నారు
-పేదలను,రైతులను పీడిస్తూ…తన కార్పొరేట్ మిత్రులకు దేశ సంపదను దోచి పెడుతున్న మోడీని కేసిఆర్ ప్రశ్నిస్తున్నడు
-కేసిఆర్ ను కట్టడి చేయాలని ఆయన బిడ్డ కవితమ్మను కేసుల పేరుతో వేధిస్తున్నరు
-లక్షల కోట్లు దోచుకున్న మోడీ దోస్త్ అదానీ మీద విచారణ చేయాలి
-ఎల్ఐసి,ఎస్బిఐ లో ప్రజల డబ్బులు మాయం చేసిన అదానీ మీద విచారణ చేయరు -కానీ…సంబంధం లేని కేసులో కవితమ్మను విచారణ చేస్తున్నరు
-రైతులు,పేద ప్రజల పక్షాన నిలబడ్డ కేసిఆర్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు
-బిఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్,బీజేపీ అసత్య ప్రచారాలు తిప్పికొట్టాలి
– బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

బాల్కొండ:బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం నాడు బాల్కొండ మండల కేంద్రంలో జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి – నీరజారెడ్డి దంపతులు సతీసమేతంగా పాల్గొన్నారు. పార్టీ జిల్లా ఇంఛార్జి మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్, డా.మధు శేఖర్, కోటపాటి నర్సింహ నాయుడు, బాల్కొండ మండల బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సతీ సమేతంగా పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులను ఇక్కడ ఓ పండుగ వాతావరణంలో ఇంటిల్లిపాదితో అందర్నీ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్,వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ల ఆదేశాల మేరకు బి ఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తన తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి మూడు విలువైన మాటలు చెప్పారని రాజకీయాల్లో ఇవి కచ్చితంగా ఉండాలని సూచించారని గుర్తు చేసుకున్నారు. 1.పార్టీ పట్ల విధేయత 2.నాయకుని మాట జవదాటకుండా పూర్తి విశ్వాసంగా ఉండడం.3.ఎన్నుకున్న ప్రజలకు,నమ్ముకున్న కార్యకర్తలకు, పార్టీలకు అతీతంగా సేవ చేయాలి అని చెప్పారన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. 60వేల మందికి పెన్షన్ ఇస్తున్నామని,అందులో 24వేల మంది బీడీ కార్మికులు ఉన్నారన్నారు. నవాబ్ లిఫ్ట్,చిట్టాపూర్,లక్ష్మి లిఫ్ట్, చౌట్పల్లి హన్మంత్ రెడ్డి లిఫ్ట్,రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువలో పుష్కలంగా నీరు ఉంటుందన్నారు. వీటి ద్వారా చెరువులు నింపుకుంటున్నమని తెలిపారు. కేసిఆర్ వచ్చిన తర్వాతేరైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు.రైతుల కోసం కేసిఆర్ ప్రభుత్వం 4.5లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.

కేవలం కేసిఆర్ వల్లే నేడు తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ది చెందిందన్నారు.ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి దుంకుతున్నయని పేర్కొన్నారు. కేసిఆర్ అమలు చేస్తున్న పథకాలు,అభివృద్ది దేశంలో ఎక్కడా లేదన్నారు. కేవలం 8ఏళ్లలోనే ప్రజల జీవన శైలిలో మార్పు వచ్చిందన్నారు.జూటా మాటల బీజేపీ దేశాన్ని సర్వ నాశనం చేస్తోందన్నారు. పసుపు బోర్డు పేరుతో రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేసి ఎంపి అయిన అరవింద్..బాండ్ పేపర్ కున్న వాల్యూ పోగొట్టాడని ఎద్దేవా చేశారు. రైతుబంధును కాపీ కొట్టి ప్రవేశపెట్టిన ప్రధానికిసాన్ సమ్మాన్ యోజన పథకం ప్రారంభంలో నిజామాబాద్ జిల్లాలోఎంత మందికి వచ్చింది..ఇప్పుడు ఎంత మందికి వస్తుందో..ఎంపి అర్వింద్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పసుపుకు మద్దతు ధర లేదు,ఎర్ర జొన్నలకు మద్దతు ధర లేదని ఎంపి అర్వింద్ కు రానున్న రోజుల్లో ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు.

మోడీ పాలన వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు అరిగోస పడుతున్నారని మండిపడ్డారు. తనకు అనుకూలమైన అదానీ లాంటి కార్పొరేట్ దోస్తులకు 12 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేశారనీ,ఆ మాఫీ చేసిన డబ్బులతో బీజేపీ ప్రత్యర్థి రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొంటూ అక్కడి ప్రభుత్వాలను కూలదోస్తున్నరని మండిపడ్డారు. అట్లా 12 రాష్ట్రాల ప్రభుత్వాలను కూలదోషారని తెలిపారు. అట్లాగే మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వం కూలదోయాలని కుట్రలు చేస్తే కేసిఆర్ అడ్డు పడ్డారని అన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్,ఎరువుల ధరలు రెట్టింపు చేశారని దీంతో సామాన్యులపై అదనపు భారం పడుతుందన్నారు. పేదలను,రైతులను పీడిస్తూ…తన కార్పొరేట్ మిత్రులకు దేశ సంపదను దోచి పెడుతున్న మోడీని కేసిఆర్ ప్రశ్నిస్తున్నడని అందుకే కేసిఆర్ ను కట్టడి చేయాలని ఆయన బిడ్డ కవితమ్మను కేసుల పేరుతో వేధిస్తున్నరన్నారు. కవితమ్మ కు మద్దతుగా నిలబడదాం అని మంత్రి ఇచ్చిన పిలుపుకు పార్టీ శ్రేణుల నుంచి అపూర్వ స్పందన వచ్చింది.

చేతులెత్తి తమ మద్దతు తెలిపారు. లక్షల కోట్లు దోచుకున్న మోడీ దోస్త్ అదానీ మీద సమగ్ర విచారణ చేయాలని మంత్రి వేముల డిమాండ్ చేశారు. ఎల్ఐసి,ఎస్బిఐ లో ప్రజల దాచుకున్న డబ్బులు మాయం చేసిన అదానీ మీద విచారణ చేయరు కానీ…సంబంధం లేని కేసులో కవితమ్మను విచారణ చేస్తున్నరని బీజేపీ మోడీ ప్రభుత్వ కక్ష్య పూరిత వైఖరిపై మంత్రి మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి గడపకు కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతున్నాయని ఎవరు మంచి చేస్తున్నారో..ఎవరు మాటలు చెప్తున్నారో విజ్ఞులైన ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. రైతులు,పేద ప్రజల పక్షాన నిలబడ్డ కేసిఆర్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న కేంద్ర బీజేపీపై ప్రజలు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ,కాంగ్రెస్ అసత్య ప్రచారాలను బిఆర్ఎస్ శ్రేణులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి అధినేత కేసీఆర్ పంపిన సందేశాన్ని మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్ ఆత్మీయ సమ్మేళనంలో చదివి వినిపించారు. కేసిఆర్ గారి సందేశం విన్న బిఆర్ఎస్ శ్రేణులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం పార్టీ శ్రేణులకు బోజనాలు వడ్డించి వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు,ఆయా గ్రామాల అద్యక్ష్యులు,మండల ప్రజా ప్రతినిధులు, సర్పంచ్ లు,పలువురు కార్యకర్తలు హాజరయ్యారు.

Leave a Reply