కేసిఆర్ సర్కార్ పథకాలు, మంత్రి వేముల పనితీరు పట్ల 100 ఏళ్ల వృద్ధుడి ప్రశంసలు

1

“బాల్కొండ మండలం వన్నెల్ బి గ్రామానికి చెందిన దేవన్న అనే 100 ఏళ్లు నిండిన వృద్దుడు కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ది పట్ల ప్రశంసల జల్లు కురిపించారు. తన జీవితంలో ఎంతోమంది రాజకీయ నాయకులను చూసిన, వాల్లు ఓట్లు అడిగేటప్పుడు కనిపించే వారు. అభివృద్ది పనుల గురించి అడిగితే కాళ్ళు అరిగేలా తిప్పించుకునే వాళ్లు. కేసిఆర్ లెక్క రైతులకు కరెంట్ ఇచ్చి,రైతు కోసం ఇంత చేసిన మొనగాడు ఎవరు లేరని,ప్రశాంత్ రెడ్డి లాగా ఇంతకు ముందు ఎవరు బాల్కొండ లో ఎవరు అభివృద్ది చేయలేదని,మన కోసం పనిచేసే ప్రశాంత్ రెడ్డికే ఓటు వేసి గెలిపించుకోవాలి.” అని ఆయన సభలో అన్నారు.