Suryaa.co.in

Andhra Pradesh

గ్రామాల అభివృద్ధి ఎన్డీఏ కూటమి లక్ష్యం

ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట పట్టణంలోని తాతయ్య నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ… నియోజకవర్గంలోని 4 మండలాలకు రూ. 17 కోట్ల రూపాయలు నిధులు ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైనట్లు తెలిపారు. నాలుగు మండలాల్లో 40 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 10 కిలోమీటర్లు డ్రైన్ ల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జనవరి కల్లా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

అదేవిధంగా ఈనెల 26 నుంచి తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు ముఖ్యంగా సహజ మరణానికి కూడా 5 లక్షలు వర్తించే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సభ్యత్వం నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కృష్ణ గుంటూరు జిల్లాల పట్టబధ్రులు ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను ఎన్డీఏ కూటమి ప్రకటించినట్లు తెలిపారు. కావున గ్రాడ్యుయేట్ లందరూ తమ ఓటును నమోదు చేసుకొని ఆయన గెలుపు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

త్వరలోనే నీటి సంఘాల ఎలక్షన్లు జరగబోతున్నట్లు తెలిపారు. త్వరలోనే సొసైటీ ఎలక్షన్ కూడా ఉన్నట్లు చెప్పారు. 2014 నుంచి 2019 వరకు అప్పటి తె.దే.పా గవర్నమెంట్ లో గ్రామాల అభివృద్ధి పూర్తి స్థాయిలో జరిగినట్లు తెలిపారు. అనంతరం వచ్చిన వైకాపా ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించినట్లు తెలిపారు. కావున మరల ఎన్డీఏ కూటమిలో అభివృద్ధి బాటల పెద్ద పీట వేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కట్టా వెంకట నరసింహారావు, వడ్లమూడి రాంబాబు, యానాల గోపీచంద్, కానూరి కిషోర్, పొట్టపొంగు బాబురావు, చిట్టూరి సుభాష్, నటుకుల బాబురావు మరియు కూటమీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE