అక్షరాస్యతతోనే అభివృద్ధి

– యం.యల్.సి డొక్కా మాణిక్య వరప్రసాద్……
అక్షరాస్యతా శాతం తక్కువగా ఉన్న దేశాలలోనే అభివృద్ధి తక్కువగా ఉంటుందని యం.యల్.సి డొక్కా మాణిక్యవరప్రసాద్, అభిప్రాయపడ్డారు. బుధవారం అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో మారుతి నగర్ లోని మదరసా భాతీజా కుబ్ర నిస్వాన్ ఉర్దూ సేవా సంఘం నందు వేడుకలను నిర్వహించారు.యం.యల్.సి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి దేశానికి, సమాజానికి అక్షరాస్యత ఎంతో ముఖ్యమని, విద్యా విజ్ఞానం ఉన్న చోట మాత్రమె అభివృద్ధి అనేది సాధ్యమౌతుందని తెలియచేశారు. అదేవిధంగా విద్యనూ ఎవరూ దొంగిలించాలేరని, విద్యార్ధులకు చిన్న వయస్సులోనే విద్య పై మక్కువ కలిగించాలని తెలియచేశారు.
ముఖ్యంగా 10 సంవత్సరాలలోపు పిల్లలకు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంటుందని, ఈ వయస్సులోనే విద్యార్ధులకు మర్యాద, భయ భక్తులు నేర్పించాలన్నారు. అలాగే స్థిరమైన అభివృద్దికి చదువు ఎంతో ముఖ్యమని, ముఖ్యంగా మహిళల విద్య అనేది సమాజ అభివృద్దికి ఎంతో దోహదం చేస్తుందని తెలియచేశారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో విద్యాభివృద్దికి ఎంతగానో కృషి చేస్తున్నారని, విద్యార్ధుల చదువుకోసం ఎన్నో సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో మధ్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ పల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ, దేశాభివ్రుద్దికి మహిళా అక్షరాస్యత ఎంతో ముఖ్యమని, కేరళ రాష్ట్రంలో మహిళల లిటరసీ 96 శాతం ఉంటుందని, అలాగే పురుషుల లిటరసీ 98 శాతం ఉంటుందని తెలియచేశారు. దేశం మొత్తంలో 77 శాతం అక్షరాస్యతా శాతం ఉండగా, మన రాష్ట్రంలో మాత్రం 67 శాతం మాత్రమె అక్షరాస్యత శాతం ఉన్నదని తెలియచేశారు. వీటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విద్యారంగం అభివృద్దికి రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పు చేస్తున్నారని, ఈ విధంగా చేయుట వలన ప్రభుత్వ పాటశాలల్లో విద్యార్ధుల హాజరు శాతం గణనీయంగా పెరిగిందని తెలియచేశారు. అక్షరాస్యతా శాతం అధికంగా ఉన్న దేశాలలో అభివృద్ధి బాగా ఉంటుందని, అక్కడి ప్రజల జీవన విధానం కూడా చాలా బాగుంటుందని తెలియచేశారు.
కార్యక్రమంలో మేయర్ కావేటి శివనాగ మనోహర్ నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యాభివృద్దికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతగానో కృషి చేస్తున్నారని, దేశంలో ఎక్కడాలేని విధంగా పధకాలను ప్రవేశ పెట్టి, విద్యార్ధులు ప్రభుత్వ పాతశాలల్లో చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా ప్రస్తుతం ప్రభుత్వ పాటశాలల్లో విద్యార్ధుల శాతం గణనీయంగా పెరిగాయన్నారు. ప్రభుత్వ పాటశాలల్లో విద్యనభ్యశించే విద్యార్ధులకు “అమ్మవడి”, “జగనన్న విద్యా కానుక”, “గోరుముద్ద” వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టి విద్యార్ధులకు మంచి రుచికరమైన, పౌస్టికరమైన ఆహారాన్ని అందిస్తున్నారని తెలియచేశారు.
అలాగే రాష్ట్రంలో మహిళా అక్షరాస్యత ఎంతో ముఖ్యమని, ఒక మహిళా విద్యనభ్యసిస్తే, ఆమె ద్వారా వారి ఆ ఇల్లు విజ్ఞాన వంతంగా తయారవుతుందని, విద్య ఉంటేనే సమాజంలో గౌరవం మరియు గుర్తింపు ఉంటుందని తెలియచేశారు. అదేవిధంగా చదువుకున్న వారికి మంచి ఉద్యోగాలు వచ్చి, ఆర్ధికంగా కూడా ఎంతో అభివృద్ధి సాధిస్తారని తెలియచేశారు. సదరు కార్యక్రమంలో పోతురాజు, దేవరపల్లి పేరి రెడ్డి, శ్రీమతి మీరాబి, చక్రపాణి, విద్యార్ధులు వారి తల్లిదండులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply