– పీవీఎన్ మాధవ్
మచిలీపట్నం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మీడియాతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. మచిలీపట్నంలో గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు కు నిధులు మంజూరు చేసిన, ఎక్కడ పనులు అక్కడే వదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు అవ్వడంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయని, రాష్ట్రంలో చిన్న పోర్టుల నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయ అంగీకారాన్ని తెలిపిందని వెల్లడించారు.
రైల్వే లైన్ల అభివృద్ధికి కేంద్రం నిధులను మంజూరు చేసి డంబ్లింగ్ పనులను పూర్తి చేశాం.. ప్రయాణికుల అవసరతను బట్టి కేంద్రం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉంది. మచిలీపట్నం నుండి తిరుపతి వెళ్లేందుకు వారంలో నాలుగు రోజులు రైలు నడుస్తోంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకువెళ్లి ప్రతిరోజు నడిచే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. రైల్వే స్టేషన్ అభివృద్ధికి కావాల్సిన నిధులను ఇప్పటికే మంజూరు చేశామని, పనులు వేగవంతంగా జరిగేలా లిఫ్ట్లు ఏర్పాటు, వెయిటింగ్ హాల్లో ఆధునికీకరణ పనులు వేగవంతంగా జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్ర బ్యాంకు స్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి కావలసిన అనుమతులు నిధులు కేంద్రం నుంచి త్వరితగతిన వచ్చేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.