జగన్‌ పాలనలో గల్లీకో సైకో తయారవుతున్నాడు

– మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం పైడూరుపాడు గ్రామంలో బాదుడే
– బాదుడు కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

ఆడబిడ్డలు బలైపోతుంటే జగన్ రెడ్డి మహిళల్ని అవహేళన చేసే విధంగా మాట్లాడటం విచారకరం. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న సీఎంలో చలనం లేదు.  తిరుపతి సభలో జగన్ రెడ్డి మాటలు “యాగీ ఏమిటో… ఆ యాగీ వినిపించడమేమిటో !” ‘ఏదో… ఏదేదో…’ అనేస్తున్నారు. ఒక యువతిని ప్రభుత్వ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారం చేస్తే పత్రికలు, ప్రతిపక్షాలు యాగీ చేస్తున్నాయి అనడం సబబేనా?

అంబులెన్స్ మాఫియా వేధింపులు తట్టుకోలేక ఒక తండ్రి బిడ్డ మృత దేహాన్ని బైక్ పై తీసుకెళ్తే టీడీపీ యాగీ చేస్తుంది అనడం కరెక్టేనా?ఏపీలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోంది. ప్రభుత్వం దిశ చట్టం పేరుతో ప్రచారాలు తప్ప చేసిందేమీ లేదు. ఆడబిడ్డ తల్లుల పెంపకం సరిగాలేదంటూ..మహిళా హోంమంత్రి వ్యాఖ్యానించడం బాధాకరం. జగన్‌ పాలనలో గల్లీకో సైకో తయారవుతున్నాడు… ఏపీలో గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టడంతో ప్రభుత్వం విఫలం.

గ్రామాల్లో అభివృద్ధి గాలికి వదిలేసి ఎమ్మెల్యే తన బామ్మర్ది, నవగ్రహాలు, అనుచరులతో దోచుకోండి… దాచుకోండి అని చెప్పి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ అమెరికా వెళ్లాడు. వైసీపీ నేతల దోపిడీకి రాయపాడు గ్రామం లో చెరువు ఉంటుందో లేదో అని గ్రామస్తులు భయపడుతున్నారు.