Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు పల్నాడు పర్యటనలో శాంతిభద్రతల వైఫల్యం తలెత్తితే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డే బాధ్యుడవుతాడు

-టీడీపీ అధినేత పర్యటనలో చిన్న అపశ్రుతి తలెత్తినా, డీజీపీపై హైకోర్ట్ లో రిట్ ఆఫ్ మాండమస్ పిటిషన్ వేస్తాం. ఆయన విధినిర్వహణ ఆయనకు తెలిసొచ్చేలా చేస్తాం.
• జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా విఫలమయ్యాయి. కొందరు పోలీస్ అధికారులు అధికారపార్టీకి ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తూ, వైసీపీవారి సేవలో తరిస్తున్నారు.
• యర్రగొండపాలెంలో శాంతిభద్రతల నిర్వహణలో విఫలమైన పోలీస్, నేటి చంద్రబాబుగారి పల్నాడు పర్యటనలో కూడా విఫలమైతే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డే బాధ్యుడవుతాడు.
• ఇదే డీజీపీకి ఆఖరి అవకాశం. ఎలాంటి ఇబ్బంది లేకుండా చంద్రబాబు పల్నాడు పర్యటన సజావుగా, సక్రమంగా జరిపించాల్సిన బాధ్యత రాజేంద్రనాథ్ రెడ్డిదే.
• చంద్రబాబు పల్నాడు పర్యటనను నిరసిస్తూ అధికారపార్టీ ఎమ్మెల్యే అవినీతిసొమ్ముతో అడ్డగోలుగా బ్యానర్లు, ప్లెక్సీలు కడుతుంటే అక్కడి పోలీసులేం చేస్తున్నారు?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

రాష్ట్రంలో శాంతిభద్రతలుపూర్తిగా క్షీణించాయని, జగన్, ఆయన ప్రభుత్వం వాటినిర్వహణలో విఫలమయ్యారని, వాటిని ఎలా కాపాడాలో వారికి తెలియడంలేదని టీడీపీ పొలిట్ బ్యూరోస భ్యులు వర్ల రామయ్య తెలిపారు. ఇష్టమున్నవాళ్లను దగ్గరకు తీస్తా..ఇష్టంలేనివారిని తొక్కి అవతల పడేస్తానన్న ముఖ్యమంత్రి విధానం పాలెగాళ్ల పాలనకే పరిమితమని, ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రజాస్వామ్యబద్ధంగానే నడవాలన్న ఆలోచనను విస్మరించి, చట్టానికి వ్యతిరేకంగా నడవడానికి వీల్లేదన్న వాస్తవం ముఖ్యమంత్రికి తెలియకపోవడమే శాంతిభద్రతల లేమికి ప్రధాన కారణమని ఆయన తేల్చిచెప్పారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“రాష్ట్రంలో కొందరు పోలీస్ అధికారులు వారిబాధ్యతల్ని విస్మరించారు. చట్టపరంగా, న్యాయ బద్ధంగా ఏపీ పోలీస్ మాన్యువల్ ప్రకారం పనిచేయడం మర్చిపోవడం చాలాబాధాకరం. వారి తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. ముఖ్యమంత్రి నాఇష్టమంటుంటే, మంత్రులు, ఆయనకు, సజ్జలకు భయపడి వారేంచెబితే అదే కరెక్టే అనే స్థితికి వచ్చారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం తెలియని సజ్జలలాంటి వ్యక్తి రాష్ట్రాన్నిశాసిస్తున్నాడు…పరిపాలిస్తున్నాడు కాబట్టే రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా గాడితప్పాయి. రాష్ట్రంలోని పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో తెలియని సంకట స్థితిలో పోలీస్ శాఖ ఉంది.

యర్రగొండపాలెంలో చంద్రబాబుగారిని అడ్డుకోవడానికి మంత్రిసురేశ్ చేసిన విచిత్ర విన్యాసా లు పోలీసులకు కనిపించలేదా? మంత్రిపై ఫిర్యాదుచేస్తే ఎఫ్.ఐ.ఆర్ లోఆయన పేరు తీసేస్తారా ?

యర్రగొండపాలెంలో మాజీముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడి పర్యటనలో పోలీ సులు ఏంచేశారు? ప్రకాశంజిల్లా టూర్ కు వస్తున్నానని ఆయన ముందే చెప్పినప్పుడు డీజీపీ, పోలీసులు ఏంచేయాలి. ఆయనపర్యటనకు భగ్నం కలిగించేవారిని అదుపులోకి తీసు కోవాల్సిన బాధ్యత పోలీసులపై లేదా? మాజీముఖ్యమంత్రిని అడ్డుకునేవారిని అరెస్ట్ చేయా ల్సిన పనిలేదా? ఆపనికూడా సక్రమంగా చేయని పోలీసులు జీతాలు కట్ చేయాలి. చంద్రబాబు పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని ముందే, పోలీసులకు తెలియచేస్తే, స్థానిక ఎమ్మెల్యే రాష్ట్రమంత్రి చంద్రబాబుకి వ్యతిరేకంగా బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ, తన అనుచ రుల్ని పోగుచేసి, వారికి సారాయిపోస్తుంటే ప్రకాశంజిల్లా పోలీస్ యంత్రాంగం ఏంచేసింది?

మంత్రి నల్లటీషర్టులు పంచి, నల్లబెలూన్లకు గాలికొడుతున్న విషయం, ప్లకార్డులపై చంద్రబాబుకి వ్యతిరేకంగా నినాదాలురాస్తున్నారని పోలీసులకు తెలియదా? అలాంటి సంఘవ్యతిరేక చర్యలకుపాల్పడుతున్న మంత్రిని అదుపులోకి తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? నలుగురుపోలీసులు మంత్రిని అడ్డుకుంటే, అతను అతని అనుచరులు బయటకువచ్చేవారా. చంద్రబాబుపై రాళ్లదాడిజరిగేదా? యర్రగొండపాలెం ఘటన చూశాక రాజేంద్రనాథ్ రెడ్డి డీజీ గా పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి. రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ అయ్యాకే పోలీసులు అధికార పార్టీ సేవలో తరించిపోతున్నారని చెప్పడానికి నిజంగా బాధపడుతున్నాం.

ప్రకాశం జిల్లా పోలీస్ సక్రమంగా, కఠినంగా వ్యవహరించి ఉంటే మినిస్టర్ కల్లుతాగినకోతిలా చొక్కా విప్పి డాన్సులు వేస్తాడా? రోడ్లపై వీరంగంవేసిన మంత్రిని అరెస్ట్ చేయకుండా, టీడీపీవారిని అరెస్ట్ చేస్తారా? టీడీపీవాళ్లు మంత్రిపై సీ.ఆర్.పీ.సీ 154 కింద ఫిర్యాదుచేస్తే, ఎఫ్.ఐ.ఆర్ నుంచి మంత్రి పేరు తీసేసేహక్కు పోలీసులకు ఎవరిచ్చారు? మంత్రి పేరుతీసేసిన పోలీస్ అధికారిఅసమర్థుడు. అతన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.

మంత్రి నల్లచొక్కావేసుకోలేదు ..దాన్నివిప్పలేదు.. రోడ్లపై గెంతలేదు..ఆయనింటి నుంచి చంద్రబాబుని అడ్డుకోవడానికి ఎవరూ బయటకురాలేదు.. ఆయనింట్లో వారికి సారాయి అందించలేదు.. నల్లబెలూన్లు అందించలేదని మంత్రిపేరు ఎఫ్.ఐ.ఆర్ నుంచి తీసేసిన పోలీస్ అధికారి చెప్పగఃలడా? రేపు ఆ అధికారిపై మేంకోర్టుకు వెళ్తే, అతనేం సమాధానం చెబుతాడు?

చంద్రబాబుని అడ్డుకున్న సంఘటన రాత్రి 8గంటలసమయంలో జరిగింది. ఆరోజు మధ్యా హ్నం 3.45నిమిషాలకు నేను డీజీపీకి మెసేజ్ పెట్టాను.చంద్రబాబుకి వ్యతిరేకంగా కొన్ని అసాంఘిక శక్తులు అక్కడ మూగాయని, మంత్రి ఆధ్వర్యంలోనే అదంతా జరుగుతోందని మె సేజ్ పెట్టాను. అదిచూశాక డీజీపీ ఏంచేయాలి? స్థానిక ఎస్పీని,అక్కడి పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత డీజీకి లేదా? నేను పంపిన మెసేజ్ డీజీకి పంపామని కమాం డ్ కంట్రోల్ వారు నాతో చెప్పారు. కానీ డీజీ నా సమాచారంపై స్పందించలేదు. డీజీకి పంపిన ట్టే అక్కడున్న ఎస్పీకి కూడా మెసేజ్ పెట్టాను..కానీ ఆమెకూడా స్పందించలేదు. అందుకే అంటున్నాం.. కొందరు పోలీస్ అధికారులు అధికారపార్టీసేవలో తరిస్తున్నారని.

ఏపీ పోలీసుల తీరుపై రిటైరైన పోలీస్అధికారులు ఎగతాళిచేస్తున్నారు. చంద్రబాబుగారి పల్నాడు పర్యటనను నిరసిస్తూ, అధికారపార్టీ ఎమ్మెల్యే బ్యానర్లు, ప్లెక్సీలు కట్టిస్తుంటే అక్కడి పోలీసులేం చేస్తున్నారు?
చంద్రబాబునాయుడి పర్యటనలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని నేను అంటాను. కాదని చెప్పగల ధైర్యం డీజీపీకి ఉందా? మేం ఇచ్చినఫిర్యాదులో మంత్రిపేరు తీసేయడం ఏపీ పోలీసింగా..? లేక తాడేపల్లి, పులివెందుల పోలీసింగా? ఏపీపోలీసుల తీరుపై రిటైరైన పోలీస్ అధికారులు ఎగతాళిచేస్తున్నారు. పల్నాడుజిల్లాలో నేడు చంద్రబాబుగారి పర్యటన ఉంది. దానికి సంబంధించి డీజీగారికి నేడు మెసేజ్ పెట్టాను. ప్రతిపక్షనేత పర్యటన ప్రాంతానికి సంబంధించి అక్కడి ఎమ్మెల్యే నిన్నటి నుంచే చంద్రబాబుని స్వాగతిస్తూ టీడీపీవారు కట్టిన బ్యానర్లు తొలగించే పనిలో ఉన్నారని మాకుచెప్పారు. బ్యానర్లు తొలగించడం ఎమ్మెల్యే పనా? అతనికి ఎంత దోచుకున్న సొమ్ము ఉంటే మాత్రం చంద్రబాబుకి వ్యతిరేకంగా నల్లబ్యాన ర్లు కట్టిస్తాడా? వైసీపీ ఎమ్మెల్యే అతని మనుషులు మాజీముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుం టూ బ్యానర్లు, ప్లెక్సీలు కడుతుంటే పోలీసులు చోద్యంచూస్తారా?

చంద్రబాబు పల్నాడుపర్యటనలో శాంతిభద్రతలకు సంబంధించి చిన్న అపశ్రుతి తలెత్తినా, డీజీపా హైకోర్టుకు సమాధానం చెప్పాల్సి వస్తుంది
నేటినుంచి మూడ్రోజులపాటు జరగబోయే చంద్రబాబుగారి పల్నాడు పర్యటనలో శాంతిభద్రత లకు సంబంధించి చిన్న సమస్య తలెత్తినా, ఆయన పర్యటనకు చిన్నఆటంకం కలిగినా డీజీపై హైకోర్ట్ లో రిట్ వేస్తాం. డీజీపై హైకోర్ట్ లో రిట్ ఆఫ్ మాండమస్ వేసి, మొదటినుంచీ శాంతిభధ్రతల నిర్వహణలో ఘోరంగా విఫలమైన ఆయన పనితీరుని కోర్టు ముందు ఉంచు తాం. చంద్రబాబుగారిని వైజాగ్ విమానాశ్రయంలో ఎలా అడ్డుకున్నారో.. అనపర్తిలో 7కిలోమీ టర్లు ఎందుకు నడిపించారో, యర్రగొండపాలెంలో ఎలా ఫెయిల్ అయ్యారో అన్నింటినీ ఆధారా లతో సహా కోర్టుముందు ఉంచుతాం.

RRR సినిమా నటులు ప్రదర్శన ఆస్కార్ కు వెళ్లినట్టు, డీజీ పనితీరు హైకోర్టు ముందు ఉంటుంది. గౌరవ హైకోర్ట్ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆదేశించాకైనా ఆయన తనపనితీరు మార్చుకుంటారా? ఇదే డీజే కి ఆఖరి అవకాశమని చెబుతున్నాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా చంద్రబాబుగారి పర్యటన సజావుగా, సక్రమంగా జరిపించాల్సిన బాధ్యత డీజీదే. పరిస్థితి హైకోర్టు వరకు తెచ్చుకోవద్దని కూడా డీజీపీకి హితవు పలుకుతున్నాం. ఏకపక్షంగా వెళ్లమని చెబుతున్న ముఖ్యమంత్రికి కూడా డీజీపీ తన బాధ్య తలు, విధినిర్వహణ ఏమిటో చెబితే ఆయనకే మంచిది.

డీజీపీ ఇలాంటి ముఖ్యమంత్రికి కాకుండా చట్టానికి, ప్రజలకు సేవచేస్తే బాగుంటుంది
ఇలాంటి ముఖ్యమంత్రికి కాకుండా డీజీపీ చట్టానికి, ప్రజలకు సేవచేస్తే బాగుంటుంది. కొంతమంది పోలీస్ అధికారులు ముఖ్యమంత్రికి, అధికారపార్టీకి ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తు న్నారు. ఈరోజునుంచి వారుకూడా పద్ధతిమార్చుకోవాలని, లేకపోతే వారిపై కూడా రిట్ ఆఫ్ మాండమస్ వేసి వారిపనితీరుని గాడిలోపెట్టాల్సి వస్తుందని తెలియచేస్తున్నాం. డీజీపీతో పాటు, పల్నాడుజిల్లా ఎస్పీకి కూడా చంద్రబాబుగారి పర్యటనకు సంబంధించి సమాచారం ఇస్తున్నాం. యర్రగొండపాలెంలో జరిగిన దానిపై గవర్నర్ కుఫిర్యాదు చేయబోతున్నాం. మంత్రిని కాపాడాలనుకుంటున్నపోలీస్ అధికారులు, గవర్నర్ కు ఏం సమాధానం చెబుతారో చూస్తాం.

పోలీసులు దగ్గరుండి కొందరు అధికారపార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు అనేది సుస్పష్టం. అందుకే అంటున్నాం.. దాసోహంచేస్తున్నారు.. ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తు న్నార ని. యర్రగొండపాలెంలో కూడా పోలీసులు ప్రతిపక్షనేతకు రక్షణగా ఉన్న టీడీపీవారిని కంట్రోల్ చేస్తున్నారు కానీ, చొక్కావిప్పిన మంత్రిని, చంద్రబాబుగారిని అడ్డుకోవడానికి వచ్చి న అల్లరిమూకల్ని కట్టడిచేయలేదు. చంద్రబాబుగారికి రక్షణగా ఉన్న భధ్రతాధికారి తల పగిలిం దని ఢిల్లీలోచెబితే, ఏపీ డీజీపీకి తలవంపులుకాదా?.” అని రామయ్య ఎద్దేవా చేశారు.

LEAVE A RESPONSE