-మాకు భూములు లేకుండా చేస్తోంది..
-మాకు న్యాయం కావాలి..
-మా భూములు మాక్కావాలి
-భట్టి విక్రమార్కతో జిల్లెల్ల ఐలయ్య
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఇప్పాలపల్లి చేరుకున్న భట్టి విక్రమార్కకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ధరణితో చాలా నష్టపొయామని.. మా గ్రామంలో పదినుంచి పదిహేను కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయని జిల్లెల్ల ఐలయ్య భట్టి విక్రమార్కతో కన్నీళ్లతో మొరపెట్టుకున్నారు.
నేను 2010లో కట్కూరి వీరారెడ్డా దగ్గర నుంచి సర్వే నెంబర్ 774లో 16 గుంటల భూమిని కొనుగోలు చేశాను. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ భూమికి పట్టాపాస్ బుక్ ను సైతం మంజూరు చేసింది. లోన్లు కూడా తీసుకున్నాను. తెలంగాణ వచ్చాక.. ఈ కేసీఆర్ తీసుకువచ్చిన ధరణి వల్ల.. నా భూమి నాక్కాకుండా పోయింది.
ధరణిలో నా భూమిని కట్కూరి వీరారెడ్డి పేరుమీదనే చూపిస్తున్నారు. ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులకు, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు. అంతా విన్న భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇలాంటి సమస్యలు ప్రతి గ్రామంలో ఉన్నాయని చెప్పారు. ఇలాంటి సమస్యలను తప్పకుండా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ఏర్పడగానే సరిదిద్దుతామని ఐలయ్యకు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.