అడిగాడా దేవుడు ఇదంతా…ఇంత తంటా!?

గున్న గున్న మామిడి
గున్న మామిడి తోటకి..
ఇది అడిగాడా వినాయకుడు..

ఓపెన్..గంధం స్టార్..
గణపతి మెడలో ఒక దండ..
ఆయన పేరిట పెద్ద దందా..
ఇంటింటా చందా..!
అలా చేస్తూ పోతే
ఎమ్మల్యే పదవీ రాదా..
అదేగా కొందరి ఇరాదా..!?

ఈ ఏడాదైతే మరీ జోషు..
రెండేళ్ల కరోనా బెడద
తొలిగి జనాలు
పుల్ ఖుష్..
ఈలోగా కొత్త పాటలు..
ఊ..అంటావా..వినాయకా
ఉహు అంటావా..
హోరెత్తించే సంగీతం
పార్వతీ సుతునకేనా అంకితం..!?

ఇదేనా
మన సంప్రదాయమిదేనా..
అసలు ఎప్పటి నుంచో
వినాయకుడు జోకర్..
ప్రమధ గణాధిపతి
కామెడీకేనా అధిపతి..!

వినాయకుడే శంకర్ దాదా..
ఆయనే మేజర్ చంద్రకాంత్
మరి అతగాడే భారతీయుడు
ఇప్పుడేమో లేటెస్ట్..
ఎలా ఉంటుంది ట్రెండు..
గణపతిరాజ్..తగ్గేదేలే..
ఆధునిక వినాయక్
భీమ్లానాయక్
ఎవుడు చెప్పిన గోల..
మంటపంలో డీజే..
అది లేకపోతే అందదా
శూర్పకర్ణుడికి భక్తుల జేజే!

వద్దయ్యా ఈ గోల
వినాయకుని మ్రోల..
ఇది పూజ…
అల్లాని కొలిచే ముసల్మాన్
భక్తి శ్రద్ధలు చూడు..
చర్చికి పోయి
క్రైస్తవుని నిరతి గమనించు..
సిక్కుపైనా ఒక లుక్కు వెయ్యి
ఎవరి దేవుడు వారికి గొప్ప..
మూతికి గుడ్డ కట్టడమే
జైను సూత్ర..
మౌనంగా సాగేదే
అతడి యాత్ర..
నీ గణపతి మాత్రం జోకరా..
ఇది దేవుడు కోరని హంగామా..
నువ్వు నీకుగా
ఆడే డ్రామా!

– ఈఎస్కే

Leave a Reply