Suryaa.co.in

Telangana

రేవంత్ సీఎం అయ్యాక ఒక్క ఎకరాకు అయినా నీళ్లు ఇచ్చారా?

– ప్రజలకు ఈ తిట్లతో ఏమైనా మేలు జరుగుతుందా ?
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: పదేపదే వక్రీకరిస్తే చరిత్ర మారిపోదు. వాస్తవం వాస్తవం లాగానే ఉంటుంది. వాస్తవానికి విరుద్ధంగా సీఎం మాట్లాడుతున్నారు .ప్రజలు రేవంత్ ను అసహ్యించుకుంటున్నారు. సీఎం కేసీఆర్ హయం లో పూర్తయిన భవనాలను రేవంత్ ప్రారంభించారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చేయాల్సిన ప్రారంభాలను సీఎం చేస్తున్నారు. పది నెలలుగా పని చేస్తున్న పోలీస్ స్టేషన్ ను సీఎం ప్రారంభించారు.

ఇలాంటి అభివృద్ధి మోడల్ తో వెళ్తున్న సీఎం రేవంత్ మమ్మల్ని చర్చకు రమ్మంటున్నారు. ఇలాంటీ సీఎం తో ఏం చర్చచేస్తారు ? అంతా కేసీఆర్ విద్వంసం చేశారని తప్పుడు మాటలు అన్నారు. లక్షల ఎకరాల పంట కళ్ల ముందు ఉంది. కేసీఆర్ నీళ్లు ఇవ్వలేదంటున్నారు. రేవంత్ సీఎం అయ్యాక ఒక్క ఎకరాకు అయినా నీళ్లు ఇచ్చారా?

పాలమూరు బిడ్డను కనుక తనను కాపాడుకోవాలని రేవంత్ అంటున్నారు. ఎందుకు కాపాడుకోవాలి రేవంత్ ను? పాలమూరు బిడ్డలకు రైతు బంధు ,రైతు భరోసా ఇవ్వనందుకా ? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను అడ్డంకులమధ్య కేసీఆర్ రాష్ట్ర సొంత నిధులతో దాదాపుగా పూర్తి చేశారు. పన్నెండు వందల కోట్ల రూపాయల తో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయొచ్చు. ..అయినా పది నెలలుగా రేవంత్ ఏం చేస్తున్నారు? పన్నెండు లక్షల ఎకరాల కు నీళ్లిచ్చే ప్రాజెక్టు ను రేవంత్ నిర్లక్ష్యం చేశారు.

ఉద్దండ పూర్ ద్వారా గ్రావిటీ కాలువ ద్వారా కొడంగల్ కు నీళ్లు ఇవ్వొచ్చు ..అయినా కొడంగల్ నారాయణ్ పేట లిఫ్ట్ తెచ్చారు. కళ్ళ ముందు ప్రాజెక్టులు కనిపిస్తుంటే కేసీఆర్ ఏం చేయలేదంటే ఎట్లా ? అరుపులు పెడ బొబ్బలతో కేసీఆర్ చేసిన అభివృద్ధి ని రూపుమాపుతావా ? ఎక్కడికి వెళ్లినా సీఎం అని మరచి రేవంత్ కేసీఆర్ పై ఇష్టానుసారంగా తిట్ల పురాణం అందుకుంటున్నారు. ప్రజలకు ఈ తిట్లతో ఏమైనా మేలు జరుగుతుందా ? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి రేవంత్ కు ఎందుకు కడుపు నొప్పి ?

కేసీఆర్ కు నీ మీద కక్ష ఎందుకు ఉంటుంది? కేసీఆర్ ది విలక్షణ మనస్తత్వం. తన మీద పోటీ చేసిన ప్రత్యర్థులను అక్కున చేర్చుకున్న మనస్తత్వం కేసీఆర్ ది. కేసీఆర్ ను ఎందరో తిట్టారు. వారి మీద కక్ష కట్టారు. కేసీఆర్ పదేళ్ల పాలన పై విమర్శలు చేస్తే ఏం లాభం ఉండదు. కేసీఆర్ కట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి పాలన చేస్తూ కేసీఆర్ ను విమర్శిస్తున్నారు. .ప్రజలు నవ్వుకుంటున్నారు. కేసీఆర్ కట్టిన వాటిని ప్రారంభం చేస్తూ కేసీఆర్ ను తిడితే ఎలా ?రేవంత్ నీ పాలనలో చేసిందేమిటో చెప్పు ?

కులగణన బ్రిటిష్ హయం లో 1931 లో చేశారు తర్వాత చేయలేదని తానే చేశాను అన్నట్టుగా రేవంత్ మాట్లాడుతున్నారు. 1952 నుంచి చాలా యేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి వేరే రాష్ట్రాలు కూడా కులగణన చేశాయి. వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ వ్యాఖ్యలు మరీ విడ్డూరంగా ఉన్నాయి. పంటలకు నీళ్లివ్వలేమని చెప్పేందుకేనా కోదండరెడ్డికి కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చింది ? ఆ పదవి వదులుకుని కోదండరెడ్డి కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి తీసుకుంటే మంచిది.

LEAVE A RESPONSE