వదిలేయండని ఎస్సీకి డీజీపీ ఏమైనా సూచనలు చేశారా?

– ప్రమోషన్ ఇస్తానని ముఖ్యమంత్రి మీకు ఏమైనా చెప్పారా?
– ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇండియా ల్యాబ్స్ కు మీరు ఎందుకు పంపరో సమాధానం చెప్పాలి
– ఎస్పీని ఎస్పీ, ఐపీఎస్ ఆఫీసర్ అనడానికి సిగ్గుగా ఉంది
– ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇండియా ల్యాబ్స్ కు మీరు ఎందుకు పంపరో సమాధానం చెప్పాలి
– ఇండియన్ పీనల్ కోడ్, సీఆర్పీసీ,ఇండియన్ ఈవిడెన్స్ యాక్టు ఎందుకు? క్లోజ్ చేయండి
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

ఎక్లిప్స్ ఫోరెన్సిక్ జిమ్స్ స్టెఫర్డ్ రిపోర్టు చూశాక అనంతపురం ఎస్పీ ఎంపీ మాధవ్ ను ఎందుకు అరెస్టు చేయలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జిమ్ స్టెఫర్డ్ ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తరువాత అనంతపూరం ఎస్పీ ఎంపీ మాధవ్ పై ఎందుకు ఇంకా కేసు రిజిష్టర్ చేయలేదు? ముఖ్యమంత్రి జిమ్స్ స్టెఫర్డ్ ఫోరెన్సిక్ రిపోర్టు చూసిన తరువాత ఎంపీ మాధవ్ తో ఎందుకు రాజీనామా చేయించలేదు? డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్లిప్స్ ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చాక కూడా ఎంపీ మాధవ్ నగ్న ప్రదర్శన కేసులో మౌనం వహించడంలో అర్థమేమిటి?
ఓవైపు దేశమంతా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ దేశ వ్యాప్తంగా జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఎంపీ మాధవ్ నగ్న వీడియో వెంటాడుతోంది. మహిళలందరూ సిగ్గుతో తలదించుకునే రీతిలో వ్యవహరించిన ఎంపీ మాధవ్ కు రేపు స్వాతంత్య వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనే అర్హత లేదు. ఎంపీ మాధవ్ నగ్న వీడియో కాల్ ఎలాంటి మార్ఫింగ్ గానీ, ఎడిటింగ్ కానీ చేయలేదు, అది అథంటిక్ మరియు అన్ ఎడిటెడ్ అని జిమ్ స్టెఫర్డ్ రిపోర్టు చెబితే పోలీసులు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఎంపీ మాధవ్ నగ్న వీడియోపై ఫోరెన్సిక్ రిపోర్టు బయటపడిన తరువాత ముఖ్యమంత్రి దగ్గర నుండి వైసీపీ మంత్రులు, నాయకుల నోళ్లు మూతబడ్డాయి. ముఖ్యమంత్రి , మంత్రులు చాలామంది వైసీపీ నాయకులు బరితెగించి మాధవ్ ను రక్షించడం కోసం పడిన తపన హాస్యాస్పదం, బాధాకరం.

తప్పు చేసినవారికి శిక్షపడాలని మన భారతదేశ శిక్షాస్మృతి చెబుతుండగా ముఖ్యమంత్రి తప్పు చేసిన బూతు ఎంపీని ఎందుకు రక్షిస్తున్నారు? ఎంపీ బూతు వీడియో కాల్ ను వెంటనే రాష్ట్రంలోని ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి పంపి రిపోర్టు వెంటనే తెప్పించాలి. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చి 24 గంటలు దాటినా ఎందుకు పోలీసులు మాధవ్ బూతు భాగోతంపై ముందడుగు వేయటంలేదు? అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప నిద్రలేచి ఈ కేసు దర్యాప్తు చేపట్టి ఎంపీ మాధవ్ ను కష్టడీలోకి తీసుకోవాలి. ఐపీసీ ప్రకారం ఎంపీ మాధవ్ శిక్షార్హుడు, అతడిని రక్షించాలని చూస్తున్న పోలీసులు కూడా శిక్షార్హులే. ముఖ్యమంత్రి కూడా బూతు ఎంపీని రక్షించాలన్న తపన వీడి, ఎంపీని అరెస్టు చేయించి చట్టాన్ని గౌరవించాలి. ఎంపీ గోరంట్ల మాధవ్ బూతు భాగోతం రాష్ట్రం మొత్తానికి సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది.

దేశంలోని అన్ని రాష్ట్రాలు ఎవడు ఈ ఎంపీ, దగుల్బాజీ, ఈ వికృత చేష్టలు చేసింది ఏపార్టీవాడు? అని ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి మొదలు కిందిస్థాయి నాయకుడి వరకు ఎంపి మాధవ్ ను రక్షించడానికి పడిన తపన, చూపిన ఆతృత, ఆసక్తి హాస్యాస్పదం, బాధాకరం. నిన్నటి వరకు నిద్రపోయిన వైసీపీ నాయకులు రిపోర్టు చూసి ఇప్పుడైనా మేల్కొనాలి. నగ్న శరీరాన్ని మహిళలకు చూపించిన భ్రష్టుడికి శిక్ష పడాలి. రిపోర్టు వచ్చి అనేక గంటలు అయినా చర్యలు లేవు. కేసు దర్యాప్తు చేయొద్దు, వదిలేయండని ఎస్సీకి డీజీపీ ఏమైనా సూచనలు చేశారా? ప్రమోషన్ ఇస్తానని ముఖ్యమంత్రి మీకు ఏమైనా చెప్పారా? ఎక్లిప్స్ జిమ్ స్టఫర్డ్ ఇచ్చిన రిపోర్టును జతచేసి ఎందుకు పంపరు? ఇక్కడి అభిప్రాయం తీసుకోవాలికదా?
ఎస్పీని ఎస్పీ, ఐపీఎస్ ఆఫీసర్ అనడానికి సిగ్గుగా ఉంది. ఇప్పడైనా కేసు రిజిష్టర్ చేయండి. జిమ్ స్టఫర్డ్ ఇచ్చిన రిపోర్టును ఇక్కడి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపండి. భారత శిక్షాస్మృతి ప్రకారం ఎంపీ శిక్షార్హుడు. చేయరాని నేరం చేశాడు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఆ భ్రష్టుణ్ణ కష్టడీలోకి తీసుకోవాలి. గోరంట్ల నగ్న ఫొటో తీసి వీడియోతోపాటు ఇండియాలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలి. ఇప్పటికీ పోలీసుశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అన్యాయం. డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డికి ప్రెసిడెంట్ మెడల్ వచ్చింది. ఒక ప్రక్క ప్రెసిడెంట్ మెడల్, ఇంకో పక్క అప్రతిష్ట. ఆ భ్రష్టుడిని కష్టడీలోకి తీసుకొమ్మని మీరు ఎందుకు చెప్పరు?

ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇండియా ల్యాబ్స్ కు మీరు ఎందుకు పంపరో సమాధానం చెప్పాలి. మీకు ఎవరి డైరెక్షన్ కావాలి? సీఎం చెప్పాలా? రిపోర్టు వచ్చాక సీఎం నోరు కూడా మూగబోయింది. హోంమంత్రి నిమిత్తమాత్రురాలు. ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఎప్పుడో పంపామన్నారు. పంపలేదని తేలింది. తేరుకొని ఇప్పుడైనా పంపండి. కేసు ఎందుకు దర్యాప్తు చేయడంలేదో ఎందుకు కిమ్మనకుండా ఉన్నారు. చట్టాలు లేవా? చట్టాలు అమలుకావా? గోరంట్ల చేసింది నేరం కాదా? కత్తితో పడిచినా నో కేసా? రేప్ కేసు, మర్డర్ కేసులు కూడా గోరంట్లపై ఉన్నాయి. కేసును మాఫీ చేయాలని ప్రయత్నిస్తే రాష్ట్రంలో చట్టాలెందుకు?, ఇండియన్ పీనల్ కోడ్, సీఆర్పీసీ,ఇండియన్ ఈవిడెన్స్ యాక్టు ఎందుకు? క్లోజ్ చేయండి. సీఎం, సజ్జల ఏం చెబితే అదే చట్టమా? రాష్ట్రంలో చట్టాలు వర్తించవా? సీఎం చెప్పిందే వేదమని చెప్పగలరా?
ప్రభుత్వం నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, అవగాహన రాహిత్యంతో, వ్యవహరిస్తోంది. చట్టాలను, రాజ్యాంగాన్ని జగన్ ప్రభుత్వం అవహేళన చేస్తోంది. జగన్ కు భజన చేసే టీవీలో ఫిమెల్ యాంకర్ వీడియోపై విశ్లేషణ చేస్తూ ఇది ఎంపీ మాధవ్ వీడియో అని చెప్పింది. కంటిన్యూటీ ఉంది అని అన్నది. ఆమెను అభినందించాల్సివుంది. దీంతో వైసీపీ అభాగ్యులు ఆ యాంకర్ ను సభ్య సమాజం సిగ్గుపడేలా ట్రోల్ చేశారు. నిజం చెప్పినందుకు ఆమెను మానసికంగా హింసించారు. ప్రస్తుతం జిమ్ స్టఫర్డ్ చెప్పిందీ అదే. ఫక్కీరప్పను ఈ కేసును అణగదొక్కితే మీకు ప్రమోషన్ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారా? ఫక్కీరప్ప చేసిన తప్పు జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. గోరంట్ల ప్రదర్శన పై ఎస్పీ ఇంతవరకు కేసు నమోదు చేయలేదు? ఇప్పుడైనా చేయాలి. చేయకపోతే పోలీసు వ్యవస్థపై గౌరవం పోతుంది. పోలీసు వ్యవస్థ వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? ఇప్పుడైనా మేల్కొండి. ఫక్కీరప్పను తొలగించాలి, ఆయన అక్కడ ఎస్పీగా ఉంటే ఆ జిల్లాలోని మహిళలకు న్యాయం జరగదు. మాధవ్ లాంటివారే రైట్, వారే మాకు ఆదర్శం అని ఎస్పీ అంటాడు. ఇంతటి అన్యాయం ఎక్కడా చూడలేదు. మా కార్యాలయానికి వచ్చి జిమ్ స్టఫర్డ్ ఇచ్చిన రిపోర్టు పొందవచ్చు. దీనిమీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎంపీని కష్టడీలోకి తీసుకొండి. అన్నీ మేం చెప్పాలా? మీరు జీతాలు మెక్కుతుంటారా? మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. సీఎం తప్పించుకోలేరు. గోరంట్ల మాధవ్ ని మీ పార్టీ నుంచి బహిష్కరించాలి. నగ్న ప్రదర్శన చేస్తుంటే తప్పు అని అనరే? ఎంపీని రాజీనామా చేయిస్తారా? మీరు పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తారా? వెంటనే నిర్ణయం తీసుకోవాలి. గోరంట్లను అరెస్టు చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

 

Leave a Reply