– బీసీలకు ఏ అన్యాయం జరిగిందో యనమల చెప్పాలి
– శెట్టిబలిజలకు సరైన పదవి రాకపోవటానికి యనమలే కారణం
– యనమల కులాల పేర్లు పెట్టి బహిరంగ లేఖ రాయడం ఎంతవరకు సబబు ?
– టీడీపీ సీనియర్ నేత, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు
రెడ్డి సుబ్రహ్మణ్యం ఫైర్
రాజమహేంద్రవరం : 40 ఏళ్లుగా రాజకీయంలో ఉన్న యనమల ఏనాడైనా బీసీల గురించి మాట్లాడారా? బీసీ సమస్యలపై పోరాడారా? కాకినాడ సెజ్ లో బీసీ రైతులకు అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రితో కూర్చొని మాట్లాడొచ్చు కదా ? యనమల కులాల పేర్లు పెట్టి బహిరంగ లేఖ రాయడం ఎంతవరకు సబబు ?
యనమల తనకు పదవి రాలేదని ఇలా లేఖ రాశారని భావిస్తున్నాను. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక సంఖ్యలో కాపులు, శెట్టిబలిజలు ఉన్నారు.. ఈ వర్గాలకు మంత్రి పదవి కోరుకోవడం సమంజసం.
ఇప్పటివరకు శెట్టిబలిజలకు సరైన పదవి రాకపోవటానికి యనమలే కారణమని భావించాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించి, ఇప్పుడు అధికారంలో ఉండి ఇలా బహిరంగ లేఖ రాయడం ఏమాత్రం సరికాదు. టిడిపిలో యనమల క్రమశిక్షణ గీత దాటారా లేదా అన్నది మా అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మా యువనేత లోకేష్ బాబు చూసుకుంటారు.
బీసీలకు ఏ అన్యాయం జరిగిందో ఏ వ్యక్తులు ద్వారా జరిగిందో వివరంగా యనమల సమాధానం చెప్పాలి. ఏ వ్యక్తులు అన్యాయం చేస్తే ఆ వ్యక్తులు పేర్లు చెప్పాలి కానీ, ఆ పేర్లు చివర ఆ కులాలను చేర్చి వారి మనోభావాలు దెబ్బతీయకూడదు.వ్యక్తి చేస్తే ఆ కులానికి ఏమి సంబంధం సమాధానం చెప్పాలి. వారి కోసం పోరాటానికి మీరు సిద్ధంగా ఉన్నారా?