– ఆర్నెల్లయినా ఏబీకి పదవి ఇవ్వరేం?
– కమ్మకులమే అడ్డమైతే ఆ మాటే చెప్పండి
– అప్పుడు ఏం చేయాలో మేమూ అదే చేస్తాం
– ఓట్ల శాతం లెక్కించి కమ్మ కులానికి అన్యాయం చేయొద్దు
– ఏబీ వెంకటేశ్వరరావు ఆత్మీయ సమ్మేళనంలో కమ్మ సేవా సమితి నేత గుమ్మడి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
విజయవాడ: రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు కు గత ప్రభుత్వ హయాంలో తీవ్ర అన్యాయం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి 6 నెలలు పూర్తి అయినా ఆయనకు న్యాయం జరగక పోవడం బాధాకరం. వైసిపి దుర్మార్గాలను ఎదుర్కోవాలంటే ఏబీ లాంటి వ్యక్తుల అవసరం ప్రభుత్వానికి ఉంది. ఒక వేళ కమ్మ అనే కులం అడ్డం వస్తే ఆయనకు సముచిత స్థానం ఇవ్వలేము అని చెప్పేయండి బాబు గారు! ఎన్నికల ముందు బాబు గారు నేను మారాను, మారాను అని చెప్పారు. మార్పు కనపడట్లేదు. ఓట్ల శాతం లెక్కించి కమ్మ కులానికి అన్యాయం చేయొద్దు. ఏబీ కి న్యాయం జరగక పోతే కమ్మ సంఘాలుగా మేము రోడ్డు ఎక్కుతాము.