– సభ రద్దు చేసుకొని పారిపోయిన సన్నాసి రేవంత్ రెడ్డి
– ఐఐటి, త్రిబుల్ ఐటికి తేడా తెలువని సన్నాసి ముఖ్యమంత్రి అయ్యారు
– శ్రీధర్ బాబు, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ లాంటి వారిని తొక్కి వచ్చారు
మూసి మీద ఉన్న ప్రేమ పాలమూరు రంగారెడ్డి మీద ఎందుకు లేదు?
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా పాయింట్
హైదరాబాద్: రేవంత్ రెడ్డి ప్రసంగంలో సరుకు, సబ్జెక్టు లేదు. గ్యారంటీల ప్రస్తావన లేదు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి ప్రసంగం వాడుకున్నారు. ఆరు గ్యారెంటీలకు మంగళం పాడారు. Cure, Pure, Rare అని కొత్త మాటలు ఎత్తుకున్నారు. 420 హామీలు ఇచ్చిన చోర్ దేశంలో ఎక్కడా లేరు. ఆరు గ్యారెంటీల హామీ ఫైల్ FSL ల్యాబ్ లో కాలిపోయిందేమో అనుకున్నాం. కానీ ఓటుకు నోటు దొంగ ఎత్తుకు పోయారు.
మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిని ఇంకా రెండున్నర ఏళ్ళు తెలంగాణా ప్రజలు భరించాలి. మా మీద బూతులు వరద తప్ప ప్రసంగంలో ఏం లేదు! రైతు బంధు ఎవరి ఖాతాలో వేశారు? రాహుల్ గాంధీ ఖాతాలో వేశారా? 16 వేల కోట్ల రూపాయల ఖర్చు అయ్యే మూసీ ప్రక్షాళనకు లక్షన్నర కోట్లు ఎందుకు?11 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారు? అశోక్ నగర్ వస్తే బట్టలతో మీరు వచ్చే పరిస్థితి లేదు.
ఉద్యోగుల పీఆర్సీ ప్రస్తావన లేదు. గురుకులాల్లో విద్యార్థులు విషాహారం తిని చనిపోతున్నారు. గవర్నర్తో పచ్చి అబద్ధాలు చెప్పించారు. సభ రద్దు చేసుకొని పారిపోయిన సన్నాసి రేవంత్ రెడ్డి. రౌడీ దర్బార్ అనే స్థాయిలో మాట్లాడుతున్నారు. శ్రీధర్ బాబు, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ లాంటి వారిని తొక్కి వచ్చారు.వీధి రౌడీల మాట్లాడిన ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలి.
స్పీకర్ కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ముఖ్యంత్రి మాటలు రికార్డుల నుండి తొలగించాలి. ఇది బడ్జెట్ సెషనా, లేక కాంగ్రెస్ డబ్బానా అర్ధం కాలేదు. మహా లక్ష్మీకి మంగళం పాడారు. రైతన్నలకు 28 వేల కోట్లు బాకీ ఉన్నారు.ఐఐటి, త్రిబుల్ ఐటికి తేడా తెలువని సన్నాసి ముఖ్యమంత్రి అయ్యారు! కేరళ ఎన్నికల నిధుల కోసం ప్రణాళికకు తెరలేపారు. పేదల ఇండ్లు కూల్చారు తప్ప, ఒక్క ఇటుకపెట్టి ఒక్క ఇళ్ళు కట్టలేదు.
రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయితే కన్ను అంతా భూములపైనే ఉంటుంది. మేము మిషన్ కాకతీయలో 30 వేల చెరువులు అభివృద్ధి చేశాం. మీరు మూడు చెరువులు అభివృద్ధి చేసి డబ్బా కొట్టుకుంటున్నారు. కేసీఆర్ చేసిన అప్పు 2.80 లక్షల కోట్లు అని కేంద్రం చెపితే, 8 లక్షల కోట్లు అని అబద్ధాలు మాట్లాడుతున్నారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పు రేవంత్ రెడ్డి రెండు ఏళ్ళలో చేశారు. ఈ డబ్బులు అన్ని రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయి. రేవంత్ రెడ్డి దోపిడీని ఖచ్చితంగా అడ్డుకుంటాం.
సంస్కారంతో మాట్లాడితే మేము సంస్కారంగా మాట్లాడుతాం. ఆరు గ్యారెంటీల అంశం బడ్జెట్లో లేకపోతే ఎండగడతాం. అనుముల దండుపాళ్యం ముఠా దోపిడిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గరపెట్టుకో రేవంత్ రెడ్డి. గజ దొంగను నిరోధిస్తాం. ప్రజల తరపున కోట్లాడుతాం.
రేవంత్ రెడ్డి అనే పిచ్చోడు కొడంగల్లో ఓడిపోలేదా? 2029 లో అధికారంలోకి రావడం కాదు. ఇంకో రెండేళ్లు తెలంగాణ ప్రజలు నిన్ను భరించడమే ఎక్కువ. మూసి మీద ఉన్న ప్రేమ పాలమూరు రంగారెడ్డి మీద ఎందుకు లేదు?