Suryaa.co.in

Andhra Pradesh

ఇష్టానుసారం ఓట్లు తొలగించడమంటే ప్రజల తీర్పుని అపహాస్యం చేయడమే

• రాష్ట్రంలో దొంగఓట్ల సృష్టి, టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్ల తొలగింపుకోసం సజ్జల నేత్రత్వంలో ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తోంది
• సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడనో, జగన్ రెడ్డి కరుణిస్తాడనో ఓటర్ల జాబితాలో తప్పిదాలకు పాల్పడే అధికారులు ముమ్మాటికీ శిక్షార్హులే
• ఇప్పటికే ఉరవకొండ నియోజకవర్గంలో తప్పుచేసిన అధికారులుసస్పెండ్ అయ్యారు
• ఫామ్-6, ఫామ్-7లో అవకతవకలకు పాల్పడటం, ఫామ్-8లో మార్పుచేర్పులు చేయడం అంతా కేంద్రఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే జరగాలి
• అధికారంలో ఉన్నవాళ్లను నమ్ముకొని, తప్పుచేసిన అధికారులంతా జైలుకెళ్లక తప్పదని హెచ్చరిస్తున్నాం
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

వచ్చేసార్వత్రికఎన్నికల్లో దొంగఓట్లతో గెలవాలన్న కుట్రతో వైసీపీ ప్రభుత్వం, జగన్ రెడ్డి పనిచేస్తున్నారని, గతంలో తిరుపతి ఉపఎన్నికలో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీ దొంగఓటర్లనే నమ్ముకుందని, అదే పంథాలో ఇప్పుడు వాలంటీర్లద్వారా సేకరించిన సమాచారంతో పెద్దఎత్తున నకిలీఓటర్లను సృష్టిస్తోందని, మరోపక్క టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలతో పాటు, మొత్తం అన్ని నియోజక వర్గాల్లో అధికారపార్టీ దొంగఓట్ల సృష్టిపై దృష్టిపెట్టింది. ఉరవకొండ నియోజకవర్గంలో ప్రభుత్వ అండతో అధికారులు 6వేల ఓట్లు తొలగించారని, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై స్పందించి, క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు నివ్వెరపోయారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా వాలంటీర్ల సాయంతో టీడీపీ, ఆ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని వారు కనుగొన్నారు.

ఉరవకొండ నియోజకవర్గంలో జరిగిన తప్పిదాలకు బాధ్యుల్ని చేస్తూ ఒక ఎమ్మార్వో, ఐదుగురు బీఎల్వోలను సస్పెండ్ చేశారు. అనంతపురం జడ్పీసీఈవోగా ఉన్న భాస్కర్ రెడ్డిని నిన్న సస్పెండ్ చేశారు. నేడు శోభాస్వరూప అనే అధికారిణిని సస్పెండ్ చేశారు. బంగారు పాళ్యంలో ఒక ఎమ్మార్వో, వీఆర్వోను సస్పెండ్ చేశారు. అనేక చోట తప్పు చేసిన బీఎల్వోల పై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది.

దొంగఓట్ల సృష్టి, టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్ల తొలగింపుకోసం సజ్జల నేత్రత్వంలో ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తోంది
రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు ఓట్లు తొలగించడాని కి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వ్యవస్థ ఏర్పాటుచేసి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. సజ్జల నేత్రత్వంలో ప్రభుత్వ అండదండలతో 400 మంది సిబ్బందితో పనిచేస్తున్న సదరువ్యవస్థ, క్షేత్రస్థాయిలో పనిచేసే కొందరు ప్రభుత్వాధికారులు బరితెగించి పనిచేస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో 40వేల ఓట్లు తొలగించారు.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇష్టానుసారం ఒకే డోర్ నెంబర్ పేరుతో 400, 500 దొంగఓట్లు చేర్పించారు. ఆ వ్యవహా రంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదుచేసినా ఎలాంటి చర్యలు లేవు. గుంటూరు పశ్చిమంలో ఒకే డోర్ నెంబర్ తో 800ఓట్లు ఉన్నాయని పత్రికల్లో వచ్చినా ఏపీ ఎన్ని కల సంఘం స్పందించలేదు. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యంతోనే ఉరవకొండ నియో జకవర్గంలో జరిగిన తప్పిదాలకు బాధ్యుల్నిచేస్తూ కొందరు అధికారుల్ని సస్పెండ్ చేశారు.

దేశవ్యాప్తంగా పకడ్బందీగా ఓటరుజాబితా పరిశీలన, ఓటర్ల వెరిఫికేషన్ జరు గుతుంటే, రాష్ట్రంలో మాత్రం సజ్జల నేత్రత్వంలో ఆ ప్రక్రియ మొత్తం అపహాస్యంగా మా రింది. జూలై 21 నుంచి ఆగస్ట్ 21వరకు దేశవ్యాప్తంగా కట్టుదిట్టంగా, కచ్చితంగా ఓటర్ల జాబితా పరిశీలన, ఓటర్ల వెరిఫికేషన్ జరుగుతోంది. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి, ప్రతి ఇంటిలో ఉన్న ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు విరుద్ధంగా జరుగుతోంది. ఓటర్ల వెరిఫికేషన్, ఓటర్ జాబితా పరిశీ లన అనేది నత్తనడకన సాగుతోంది.

ఒక ఇంట్లో ఉండే ఓటర్లంతా ఒకే పోలింగ్ బూత్ లో ఓటు వేయాలనే నిబంధనను ఏపీ ప్రభుత్వం పూర్తిగా పక్కనపెట్టేసింది. ఓట్ల తొలిగింపు లో ఫామ్ 6 నిబంధనలు అనుసరించడంలేదు. ఒక ఓటర్ కి రెండు ఓట్లుంటే, వాటిలో ఒకఓట్ తొలగించాలి. కానీ సదరు ఓటర్ కు తెలియకుండా, అతన్ని సంప్రదించ కుండానే ఓటు తీసేస్తున్నారు. బీఎల్వోలు, రాజకీయపార్టీల పర్యవేక్షణలో జరగాల్సిన పనుల్ని వాలంటీర్లు, అధికారపార్టీనేతలే చేసేస్తున్నారు.

ఒకరోజులో ఎన్ని ఇళ్లు పరిశీలించి, ఎన్ని ఓట్లు చేర్చారు..ఎన్ని తొలగించారనే సమాచారం గ్రామ, మండల స్థాయి అధికారులకు తెలియకుండానే చేసేస్తున్నారు. కొన్నిచోట్ల వీఆర్వోలు, ఎమ్మార్వోలు ప్రభుత్వంచేసేది తెలిసినా ఏమీతెలియదనే చెబుతున్నారు. కేంద్ర ఎన్ని కల సంఘం మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్రం లో ఓటర్ జాబితా పరిశీలన సక్రమంగా జరగక పోవడానికి సజ్జల అతని నేత్రత్వంలోని అనధికార వ్యవస్థే కారణం. కేంద్ర ఎన్ని కల సంఘం ఓటర్ల జాబితా పరిశీలన, బీఎల్వోల వెరిఫికేషన్ కార్యక్రమ గడువుని కొంతకాలం పొడిగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

తప్పుచేసే అధికారులు శిక్షార్హులే…
సజ్జల రామకృష్ణారెడ్డి అండతో అడ్డగోలుగా వ్యవహరించిన భాస్కర్ రెడ్డి, శోభా స్వరూప ఏమయ్యారో అధికారులు తెలుసుకోవాలి. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లు జాబితాలో అవకతవకలకు పాల్పడటం, ఫామ్- 6, ఫామ్- 7 లో అవకతవకలకు పాల్పడటం, ఫామ్-8లో ఇష్టానుసారం మార్పులు చేయడంచేస్తే ఎవరైనా సరే శిక్షార్హులే అవుతారు.

అధికారులు ఎవరైనా అధికారపార్టీ చెప్పిందని అడ్డ గోలుగా వ్యవహరించవద్దని సూచిస్తున్నాం. ఓటర్ల జాబితా పరిశీలించకుండా, ఓట్ల తొలగింపు, మార్పుచేర్పులకు సంబంధించి ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండా, నోటీసు ఇవ్వకుండా ఇష్టమొచ్చినట్టు పనిచేస్తే భాస్కర్ రెడ్డి, శోభాస్వరూపకు పట్టిన గతే అందరికీ పడుతుంది.

అధికార పార్టీ కనుసన్నల్లో బరితెగించి తప్పుచేసే అధికారుల్ని టీడీపీ వదిలిపెట్టదు
ఎవరేంచెప్పినా ఖాతరుచేయకుండా, బరి తెగించి అధికారపార్టీ అడుగులకు మడుగు లొత్తి పనిచేస్తే, వారు చేసిన తప్పులన్నీ అక్టోబర్ 7న కేంద్ర ఎన్నికలసంఘం వదిలే కొత్త ఓటర్ జాబితాలో బయటపడతాయి. ఇప్పటికే టీడీపీ గ్రామస్థాయిలో ఓటర్ల జాబి తాపై దృష్టి పెట్టింది. కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక విభాగం పనిచేస్తోంది. సజ్జల ఆదేశించాడనో, జగన్ రెడ్డి కరుణిస్తాడనో నిబంధనలకు విరుద్ధంగా పనిచేసే వారందరూ కచ్చితంగా శిక్షింపబడతారు. ఏపీలో తొలగిస్తున్న ఓట్లు…. ఓటర్ల జాబితాలో ఇష్టాను సారం జరుగుతున్న మార్పు, చేర్పులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.

త్వరలోనే ఈ వ్యవహారంపై మాట్లాడటానికి ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. అధికారపార్టీ కనుసన్నల్లో జరుగుతున్న దొంగఓట్ల తంతు సంగతి తేల్చి, తప్పుచేసిన వారందరినీ జైలుకు పంపేవరకు టీడీపీ వదిలిపెట్టదు. ఓటు తొలగించడం అంటే ప్రజల తీర్పుని అపహాస్యం చేయడమేనని అధికారులు గుర్తుంచుకోవాలి. జగన్, సజ్జల చెప్పాడని, తప్పుడు ఆలోచనలతో ఉన్న అధికారులు వాళ్ల విలువైన జీవితాల్ని, వాళ్ల కుటుంబాల్ని రోడ్లపాలు చేసుకోవద్దు అని” అని బొండా ఉమా హెచ్చరించారు.

LEAVE A RESPONSE