Suryaa.co.in

Andhra Pradesh

సీఎం పేషీ ధనుంజయ రెడ్డి ,మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి

-దసపల్లా కథ నడిపిన సీఎం పేషీ ధనుంజయ రెడ్డి ,మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి ల పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి
-లీగల్ నోటీసులు ఇవ్వడం కాదు.. దసపల్లా భూముల కుంభకోణం నుంచి విజయసాయిరెడ్డి తప్పుకోవాలి
-మూడు వేల కోట్ల రూపాయల దసపల్లా కుంభకోణం ఆపిన హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు
-నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల లబ్ధికి ప్రయత్నించిన జీవీఎంసీ కమీషనర్ సాయి కాంత్ వర్మ ను సస్పెండ్ చేయాలి
-ఆమోదం లేని రహదారికి 5 కోట్లు కేటాయించిన జీవీఎంసీ మేయర్ హరి వెంకట కుమారి తక్షణం పదవి నుంచి వైదొలగాలి
-హైకోర్టు తీర్పును గౌరవించి నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన దసపల్లా రహదారి విస్తరణను శాశ్వతంగా నిలిపివేయాలి
-దసపల్లా రహదారి పేరిట ఇవ్వటానికి ప్రయత్నం చేసిన 2000 కోట్ల రూపాయల టి డి ఆర్ ప్రతిపాదనలను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలి
-జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్

వైయస్సార్ కాంగ్రెస్ లోని కొందరు పెద్దల ప్రయోజనాల కోసం అవసరం లేకుండా, నగర ప్రజలు కోరుకోకుండా దసపల్లా హిల్స్ లో ప్రతిపాదించిన 100 అడుగుల రహదారి విస్తరణను రాష్ట్ర హైకోర్టు నిలిపివేసింది. కేవలం కొందరు ప్రైవేటు వ్యక్తుల బహుళ అంతస్తుల నిర్మాణాల అనుమతుల కోసం జీవీఎంసీ ఆఘమేఘాల మీద రోడ్డు ప్రతిపాదన నోటిఫికేషన్ ను ప్రకటించింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల కోసం దశాబ్దాలుగా ఉన్న ఇళ్లను కూల్చివేయడానికి జీవీఎంసీ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు.

40 అడుగుల దసపల్లా రహదారిని ప్రభుత్వ పెద్దల ప్రయోజనం కోసం 100 అడుగులకు విస్తరించి విస్తరణ ప్రైవేటు వ్యక్తుల భూముల్లో విస్తరణ జరిగిందంటూ 2000 కోట్ల రూపాయల విలువైన టిడిఆర్ బాండ్ లు ఇచ్చేందుకు సీఎం పేషీ ప్రత్యేక అధికారి ధనుంజయ రెడ్డి ఒత్తిడితో పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వై శ్రీలక్ష్మి, జీవీఎంసీ కమిషనర్ సాయి శ్రీకాంత్ వర్మలు హడావుడిగా ఫైళ్లు కదిపారు. నిబంధనలకు విరుద్ధమని తెలిసికూడా మేయర్ గొలగాని హరి వెంకట కుమారి జీవీఎంసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనం కోసం నిర్మించాలనుకున్న రోడ్డుకు జీవీఎంసీ నుంచి 4 కోట్ల 64 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయించారు.

రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ( ఆర్ డీ పీ) కు అభ్యంతరాలు పరిష్కారం చేయకుండ జీవీఎంసీ రోడ్డు నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయల తో టెండర్లు పిలవటం నిబంధనలకు విరుద్ధం. గౌరవ హైకోర్టు ఆ విషయాన్ని గుర్తించి నోటిఫికేషన్ ను, జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానాన్ని స్టే విధించింది. హైకోర్టు తుది తీర్పు వచ్చేవరకు దసపల్లా 100 అడుగుల రహదారి విస్తరణ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. టెండర్ పనులను నిలిపివేయమని ఆదేశించింది.

ఈ హైకోర్టు ఉత్తర్వులు నగర ప్రజల సంక్షేమానికి కాకుండా కేవలం అవినీతిపరులైన కొందరు అధికార పార్టీ నాయకుల లాభం కోసం పనిచేస్తున్న జీవీఎంసీ కమీషనర్ సాయి కాంత్ వర్మ కు చెంపపెట్టు. టైకూన్ వద్ద రహదారిని మూసేసి, సిరిపురంలో సుందరీకరణ పేరిట రెండు కోట్ల రూపాయలతో గందరగోళాన్ని సృష్టించి సాయి కాంత్ వర్మ విశాఖ ప్రజలకు తీరని ద్రోహం చేశారు. వందల కోట్ల టీడిఆర్ లు వ్యవహారంలో అనుమానాస్పదంగా వ్యవహరించారు. నగర ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు పట్టించుకోకుండా మూర్ఖత్వంతో నిర్ణయాలు తీసుకుంటూ , మొండి గా అమలు జరుపుతున్న సాయి కాంత్ వర్మ కు హైకోర్టు గట్టిగా బుద్ధి చెప్పింది.

ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు మేల్కొని ఎన్నికల సమయంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ప్రభుత్వానికి దూరం చేస్తున్న సాయి కాంత్ వర్మపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. సాయి కాంత్ వర్మ తో ఈ పనులు చేయించిన ధనుంజయ రెడ్డి, శ్రీలక్ష్మి తదితరులపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఆశీల్ మెట్ట జంక్షన్ లో పెట్రోల్ బంక్ పక్కన ఇరుకుగా ఉన్న ప్రధాన రహదారి విస్తరణ పై పిసరంత కూడా దృష్టి పెట్టని ఈ సీనియర్ ఐఏఎస్ లు అంతా ఏ మాత్రం ట్రాఫిక్ లేని దసపల్లా విస్తరణ పై అంతులేని అభిమానం చూపటం వెనుక వందల కోట్ల కుంభకోణాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఉద్దేశపూర్వకంగా నిబంధనలు ఉల్లంఘించిన వీరందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

ఉన్నతాధికారుల తప్పుడు నిర్ణయాలను ప్రశ్నించడానికి, సరిదిద్దేందుకు నగరపాలక సంస్థ పాలకవర్గం ఉంటుంది. మేయర్ హరి వెంకట్ కుమారి ఆ పాలకవర్గాన్ని అవినీతి అధికారులు , రాష్ట్ర పాలక పెద్దల జేబు సంస్థగా మార్చారు. ప్రజల, ప్రతి పక్షాల అభ్యంతరాల్ని కౌన్సిల్లో చర్చకు పెట్టకుండా కీలకమైన నిర్ణయాలను ముందస్తు పేరుతో మంజూరు చేస్తున్నారు. జీవీఎంసీ కి సంబంధించి మేయర్ 300 కి పైగా ఈ రకమైన ‘ఇన్ ఎంటిసిపేషన్ ‘ అనుమతులు ఇచ్చారు. వాటి విలువ వందల కోట్ల రూపాయల్లో ఉంటుంది.

ఎన్నికైన 98 మంది కార్పొరేటర్లు, ఎంపీలు ,ఎమ్మెల్యేలు వంటి ప్రజాప్రతినిధులకు కాదని మేయర్ అవినీతికి పాల్పడుతూ ఇలా ముందస్తు అనుమతులు ఇవ్వటం నిబంధనలకు విరుద్ధం. వందల కోట్ల అవినీతికి అవకాశం ఇస్తూ,ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న మేయర్ హరి వెంకట కుమార్ తక్షణమే ఆ పదవి నుంచి తప్పించాలి.

విశాఖ నగరపాలక సంస్థను ఎన్నికైన కార్పొరేటర్ల అభిప్రాయం మేరకు నడిపే స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. దసపల్లా సంఘటనను ఉదాహరణగా తీసుకొని జీవీఎంసీ న తక్షణం టీ డి ఆర్ ల మంజూరు ను నిలిపివేయాలి. ఇప్పటివరకు మంజూరు చేసిన టీ డీ ఆర్ లపై విచారణకు ఒక కమిటీని నియమించాలి. దసపల్లా భూములపై ప్రభుత్వపరంగా ఎటువంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఉత్తర్వులను గౌరవించి స్టేటస్ కో ను కొనసాగింప చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.

దసపల్లా భూముల వ్యవహారంలో ఉత్తరాంధ్ర జిల్లా ఇన్చార్జిగా వ్యవహరించిన రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి ప్రమేయం సుస్పష్టం. విశాఖ లోక్ సభ సభ్యుడు ఎం వి వి సత్యనారాయణ దసపల్లా భూములను సాయి రెడ్డి కొట్టేసారంటూ బహిరంగంగానే ఆరోపించారు. ఎం వి వి సత్యనారాయణ కూర్మన్నపాలెం భూములను 99 శాతం వాటాతో తీసుకోగా లేని తప్పు తన కుటుంబీకులు 89 శాతంతో దసపల్లా భూములు తీసుకుంటే తప్పేమిటని విజయసాయిరెడ్డి స్వయంగా విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు.

దసపల్లా భూముల అభివృద్ధికి, ఆర్థిక వ్యవహారాలకు విజయ్ సాయి అల్లుడు శరత్ చంద్రా రెడ్డికి చెందిన అవ్యాన్ రియాల్టర్స్ నుంచి నిధులు మళ్లించినట్లు దసపల్లా ప్రమోటర్లు ఒకరైన ఉమేష్ స్వయంగా వెల్లడించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో దసపల్లా భూముల కుంభకోణానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు హోదాలో ఉద్యమం చేసిన గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో కుంభకోణంగా కనిపించిన దసపల్లా భూములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయ్ సాయి రెడ్డి కుటుంబీకుల పరమయ్యాయి అంటే ఎటువంటి మతలబు జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న దృశ్య మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను అనుసరించి అధికారులు ఎవ్వరూ దసపల్లా ఎటువంటి నిర్ణయాలు ఉత్తర్వులు వెల్లడించకూడదని డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గం ఇంచార్జ్ పి వి ఎస్ ఎన్ రాజు, శ్రీనివాస్ పట్నాయక్, రూప పాల్గొన్నారు.

LEAVE A RESPONSE