– టీడీపీ ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి
వైసీపీ ప్రభుత్వానికి డైవర్షన్ పాలిటిక్స్ పరిపాటిగా మారిందని టీడీపీ ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ…. అమరావతి అసైన్డ్ భూములకు సంబంధించి ఐదుగురిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరిని కోర్టుకు హాజరు పరచారు. కోర్టు వారికి రిమాండ్ విధించకుండా 41 ఎ నోటిసులు ఇవ్వమని తిప్పి పంపింది. ఈ తీరు చూస్తుంటే వైసీపీ ప్రభుత్వానికి డైవర్షన్ పాలిటిక్స్ పరిపాటి అని అర్థమవుతుంది.
రైతులు చేస్తున్న అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర విజయవంతం కానుంది. అమరావతి రాజధానికి, రైతులకు వస్తున్న ఆదరణని చూసి వైసీపీ నాయకులు ఓర్వ లేకపోతున్నారు. ప్రతిపక్ష టీడీపీ పార్టీ అసెంబ్లీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తి చూపిస్తుందనే ఆందోళనతో వైసీపీ నాయకులు డైవర్షన్ రాజకీయాలకు తెర లేపారు.
2020లో కేసు నమోదు చేసి రెండేళ్ల తరువాత అరెస్ట్ లు చేయడం డైవర్షన్ పాలిటెక్స్ లో భాగమే. ఆ కేసులో ఏ1 నిందుతుడిగా ఉన్న వ్యక్తిని నేటికీ అరెస్ట్ చేయలేదు. ప్రభుత్వం వైసీపీ నాయకుల అనుచరులతో టీడీపీ వాళ్ళ మీద కేసులు నమోదు చేయిస్తున్నారు. రాజకీయంగా ఇబ్బంది పరిచే వారి పేర్లను తీసుకొని వాళ్ళను అరెస్ట్ లు చేయిస్తున్నారు. ఉదాహరణకు వైసీపీ నాయకుడు బ్రహ్మానంద రెడ్డిని అరెస్ట్ చేయకుండా వదిలేశారు. రామాకృష్ణా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగస్థులని, మాజీ మంత్రి నారాయణను అమరావతి అసైన్డ్ భూముల కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులపై పెట్టే ప్రివెన్షెన్ ఆఫ్ కరెప్షన్ కేసులు రామాకృష్ణా హౌసింగ్ ఉద్యోగస్థులపై ఎలా పెడతారు? మాజీ మంత్రి నారాయణ దళితుల భూములను ఉద్ధేశ పూర్వకంగా కొట్టేశారనడం అన్యాయం. మాజీ మంత్రి నారాయణ రామాకృష్ణా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్లతో ఆర్థిక లావా దేవీలు జరిపారని చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. రామాకృష్ణా హౌసింగ్ వాళ్లతో నారాయణ తన బిజినెస్ కు సంబంధించిన లావా, దేవీలు మాత్రమే జరిపారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లని రిజిష్ట్రార్ ఆఫ్ కంపెనీలకు, ఇన్ కమ్ ట్యాక్స్ డిపారట్మెంటుకు సమర్పించారు.
దళితుల అసైన్డ్ భూమి ఏ ఒక్క ఎకరా కూడ రిజిష్ట్రేషన్ జరగలేదు. నాడు రిజిష్ట్రారు అమరావతి భూముల రిజిస్టేషన్లను పెండింగ్ పెట్టారు. ఆ రిజిష్ట్రేషన్లని రద్దు చేయడం జరిగింది. పిఓటి యాక్ట్ 1977 ప్రకారం అసైన్డ్ దారు నుంచి భూమి వేరే వ్యక్తికి రిజిష్ట్రర్ అయి ట్రాన్సఫర్ అయినప్పుడు మాత్రమే ఈ యాక్ట్ వర్తిస్తుంది. ఒక్క సెంటు భూమి కూడ రిజిష్ట్రర్ అయి వేరే వాళ్లకి ధారదత్తం చేయలేదు. రికార్డులను పరీశిలిస్తే ఆ భూములు రైతుల వద్దే ఉన్నాయని అర్ధమవుతుంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటన కూడా చేశారు. అసైన్డ్ భూములకు సంబంధించి సిఆర్డిఏ ఒక నివేదకను ఇచ్చింది.
8, డిసెంబర్, 2014కు ముందు ఎవరి పేరు మీద ఉన్నయో వాళ్లకు మాత్రమే ఆ భూములకు సంబంధించిన పెన్షన్లు, ల్యాండ్ పూలింగ్ కు అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఎటువంటి ట్రాన్స్ క్షన్లకి అనుమతులు ఇవ్వమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆ రిపోర్టులను విలేకరులకి చూపించడం జరిగింది. ఆ భూములకు సంబంధించిన ఏ ఒక్కరినుండి తమ భూములు లాక్కున్నారన్న అభియోగాలు లేవు.
జీవో నెం.41 తీసుకొచ్చి దానిలో ఈ ప్రాంతంలో ఉన్న దళితులకు మాత్రమే అని వాళ్ల భూములను పిఒటు యాక్ట్ నుంచి మినహాయింపు ఇస్తూ సవరణలు జరిపారు. ఈ ప్రాంతంలో ఇచ్చిన భూములలో వేరే వాళ్లు లబ్ధి చెందారు. ఆ చట్టం ప్రకారం ఆ ప్రాంత రైతులు సంతృప్తిని వ్యక్త పరిచారు. పిఓటి యాక్ట్ పక్కాగా అమలు జరగలేదు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు లబ్ధి చేకూర్చాలనే తాపత్రయంలో ప్రభుత్వం ఉంది. ఇడుపుల పాయలో వందల ఎకరాల అస్సైన్డ్ భూములని ఆక్రమించుకున్నారని వైయస్.రాజశేఖర్ రెడ్డిని అసెంబ్లీలో ప్రశ్నించడం జరిగింది. అసైన్డ్ భూములని తెలియక కొనుగోలు చేశామని రాజశేఖర్ రెడ్డి సమాధానం ఇచ్చారు. కొన్ని సంవత్సరాలపాటు అసైన్డ్ భూములని జగన్ రెడ్డి అనుభవించారు.
గతంలో జగన్ రెడ్డి తండ్రి వైయస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారుల పై ఒత్తిడి తెచ్చి తప్పుడు పనులు చేయించారు. వాళ్లను కోర్టుల పాలు చేశారు. నేడు జగన్ రెడ్డి అదే తీరులో అధికారుల పై ఒత్తిడి తెస్తున్నారు. అమరావతి రైతులను అక్రమంగా అరెస్ట్ చేసే కుట్రలు చేస్తున్నారు. వైసీపీ నాయకులు ఆధారాలు లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు. రికార్డ్ చేయకుండా జీవోలను జారీ చేసిన అధికారులను శిక్షించాలి.
టీడీపీ నాయకులకు న్యాయం స్ధానం పై అపారమైన గౌరవం, నమ్మకం ఉంది. నేడు టీడీపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. న్యాయస్ధానాలలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతోంది. వైసీపీ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులను ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయస్థానంలో ఎదుర్కొంటామని టీడీపీ ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి నొక్కి వక్కాణించారు.
పాదయాత్ర చేస్తున్న రైతులను దూషిస్తున్నారు: ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి
రాజధాని రైతులు దాదాపు వెయ్యి రోజులకు పైగా ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వంలో చలనంలేదు. పరిస్ధితులు కళ్ల ముందు కనిపిస్తున్నా దాని గురించి తెలుసుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కక్ష, కుట్రే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంది. తెల్లారితే చాలు వైసీపీ నాయకులు అనేక మంది పదే పదే మీడియా సమావేశాలు పెట్టి పాదయాత్ర చేస్తున్న రైతులను దూషిస్తున్నారు.
ఒకేరోజు 11 మందితో ప్రెస్ మీట్ లు పెట్టించారు. పాదయాత్ర విజయవంతం అయితే ప్రజలలో వ్యతిరేకత ఎక్కువ అవుతుందనే భయం జగన్ రెడ్డికి పట్టుకుంది. వైసీపీ నాయకులు పాదయాత్రని దండయాత్ర అని మాట్లాడటం బాధాకరం. వెయ్యి రోజులైన న్యాయం జరగలేదని పాదయాత్ర చేస్తుంటే దాన్ని దండయాత్ర అనడం భావ్యమా? నోటికొచ్చినట్లు దూషించడం తగదు.
జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి అమరావతి పై కుట్రలు, అక్రమ కేసులు, అధికార దుర్వినియోగం చేస్తోంది. ఇది దిన దినాభివృద్ధి చెంది నేడు పరాకాష్టకు చేరింది. లేని తప్పులను చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు.
అసెంబ్లీలో అసైన్డ్ భూముల గురించి చర్చించే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి, వైసీపీ నాయకులకు ఉందా అని సవాల్ విసురుతున్నాం. లేదా చర్చకు ఎక్కడకు రమ్మన్నా వస్తాం, రుజువులతో సహా నిరూపిస్తాం.వాన్ పిక్, వైసీపీ కుంభకోణాలు, లేపాక్షి కుంభకోణం, హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుకు సంబంధించి ఎనైల్మెంట్ ని ఏ విధంగా మార్చారో, ఇడుపులపాయలో 700 ఎకరాల భూములు అసైన్డ్ భూముల కొనుగోలు, హౌసింగ్ కోసం అసైన్డ్ భూములను లాక్కోవడం, ఇలాంటివి ఎన్నో ఆధారాలతో సహా నిరూపించగలం. జగన్ రెడ్డి, వైసీపీ నాయకులు లాక్కొన్న అసైన్డ్ భూముల గురించి కాల్ సెంటర్ ని ఏర్పాటు చేస్తే వరద ప్రవాహంలా కేసులు వస్తుంటాయి. ఒక్క దళితుడు కూడ అమరావతి అసైన్డ్ భూముల లాక్కొన్నారని కేసులు పెట్టడం జరగలేదు.
ప్రతిపక్ష పార్టీగా జగన్ రెడ్డి ఉన్నప్పుడు క్యాపిటల్ ఎక్కడైనా పెట్టండి. కాని 30వేల ఎకరాల భూమి ఉన్న చోట పెట్టమని పేర్కొన్నారు. దానికి చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా పేర్కొనడం జరిగింది. జగన్ రెడ్డి మూడు ప్రాంతాలలో చిచ్చు పెట్ట దలచారు. అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా అంగీకరిస్తున్నాం అని అని మాట మార్చారు. అప్పుడు అమరావతిని రాజధానిగా అన్ని పార్టీలు ఆమోదించాయి. నేడు జగన్ రెడ్డి మాట తప్పి, మడమ తిప్పి మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చారు. అమరావతిని రాజధానిగా అధికారంలోకి వచ్చినా కొనసాగిస్తాం అని చెప్పడం వాస్తవం కాదా. అది నిజమని నమ్మించడానికి జగన్ రెడ్డి ఇక్కడే ఇంటిని నిర్మించుకున్నారు. దీన్ని ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు ప్రచారం చేశారు.
జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే అమరావతి పనులను నిలిపి వేయడం జరిగింది. ప్రధాన ప్రతిపక్ష టీడీపీ ప్రశ్నిస్తే జగన్ రెడ్డి రాజధానిని తీసేస్తున్నాం అని చెప్పలేదని అసెంబ్లీలో పేర్కొన్నారు. స్వయాన రాజధాని గురించి ప్రశ్నిస్తే రాజధానిని మార్చడం లేదని వైసీపీ మంత్రి సమాధానమివ్వడం వాస్తవం కాదా? సెలక్ట్ కమిటీకి పంపించడానికి ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తుంటే భయపడి అడ్డుకుంటున్నారు.
వైసీపీ అనేక కుట్రలకు పాల్పడుతుంది. అమరావతికి అన్యాయం చేయాలని చూస్తుంది. ప్రజలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తుంది. టీడీపీ 90శాతం భవనాలను పూర్తి చేస్తే జగన్ రెడ్డి మూడున్నరేళ్లలో 10శాతం కూడ పూర్తి చేయలేదు. నేడు జగన్ రెడ్డి మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలు ఆట ఆడుతున్నారు. ఈ ఆట బెడిసి కొట్టి కేంద్రం నుంచి నిధులు తేలేని పరిస్ధితికి చేరారు. రాష్ట్ర రోడ్ల మీద వైసీపీ వాళ్లు ప్రయాణించాలి.
వాళ్లు అధికారంలోకి వచ్చాక రోడ్ల పరిస్థితి ఎలా మారిందో తెలుసుకోవాలి. అధికారం కోసం ప్రజల భవిష్యత్తును అంధకారం చేస్తున్నారు. జగన్ రెడ్డి తీరును మార్చుకోకపోతే ప్రజలే సమయం వచ్చినప్పుడు సరైన సమాధానం చెబుతారు. ప్రజలు అధికారాన్ని కట్టబెట్టింది రాష్ట్రాన్ని, ప్రజల భవిష్యత్తుని బాగుచేయడానికి అని గుర్తించాలి. ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సూచించారు