Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు

– కోర్టును కోరిన సీబీఐ

హైద‌రాబాద్‌: బ్రిటన్‌ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న వైకాపా అధ్యక్షుడు, అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు జగన్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును సీబీఐ కోరింది. జగన్‌ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. కోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల 27కు వాయిదా వేసింది. యూకేలో చదువుతున్న కుమార్తె వద్దకు సెప్టెంబరు మొదటి వారంలో వెళ్లడానికి అనుమతించాలని పిటిషన్‌లో జగన్‌ కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ టి.రఘురాం సీబీఐ వివరణ కోరుతూ విచారణను బుధవారానికి వాయిదా వేశారు. దీంతో సీబీఐ నేడు వాదనలు వినిపిస్తూ జగన్‌ బ్రిటన్‌ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును కోరింది.

LEAVE A RESPONSE