ఆ దేశాల బోర్డర్లు దాటితే ఏమవుతుందో తెలుసా?

( మార్తి సుబ్రహ్మణ్యం)
మన ప్రజాస్వామ్యం విశాలమైనది. మన సెక్యులర్ వాసన అమోఘం. సమున్నతం. మన పార్లమెంటుపై దాడి చేసినా.. మన విమానాలను హైజాక్ చేసినా.. మన నేతలను కిడ్నాపు చేసినా.. కిడ్నాపర్లను జైల్లో పెట్టి పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. కడుపు పగిలేలా బిర్యానీలు పెట్టి మరీ మర్యాదచేస్తాం.
సరే.. ఈ మర్యాద, గట్రాలూ పక్కనపెడితే.. మన సరిహద్దులు శత్రుదేశాలకు స్వాగతం పలుకుతుంటాయి. రోహింగ్యాలు అత్తారింటికి వచ్చివెళుతున్నట్లు.. పశ్చిమ బెంగాల్ టు బంగ్లాదేశ్ యమా ఈజీగా వచ్చి వెళుతుంటారు. వారికి మమతాదీదీ సర్కారు రేషన్‌కార్డులు కూడా ఇచ్చి గౌరవిస్తుందండోయ్! ఆమాటకొస్తే.. మన హైదరాబాద్‌లో కూడా రోహింగ్యాలు పాతబస్తీలో రేషన్‌కార్డులతో దర్జాగా బతుకుతున్నారనుకోండి అది వేరే విషయం.
అటు కశ్మీర్‌లో పాకిస్తానీలు, జీహాదీ మూకలు కూడా, రోడ్డు దాటినంత అవలీలలగా, కంచెలు దాటి వచ్చేస్తుంటారు. అక్కడి మన పోలీసులపై రాళ్లేసేందుకు పైసలిచ్చి మరీ, పోరగాళ్లను ఉస్కాయిస్తుంటారు. అలాంటి ముష్కరులపై పోలీసులు లాఠీ విదిలిస్తే.. మన ఫరూఖ్ అండ్ ప్యామిలీ అండ్ అదర్స్ ఇంతెంత్తున లేస్తుంటారు. అంతేగానీ.. మన సరిహద్దుల్లోకి ఆ పుండాకోర్లు ఎలా వస్తారని గానీ, వచ్చిన వారిని శిక్షించాలని గానీ అటు మమతా దీదీ గానీ, ఇటు ఫరూఖ్ కాకా గానీ ప్రశ్నించరు. అదీ మనదేశంలో ఉన్న స్వేచ్ఛ. మరి అదేపని విదేశాల్లో ఎవరైనా చేస్తే ఆయా దేశాలు ఏం చేస్తాయో తెలుసా? ఎలాంటి శిక్షలు విధిస్తాయో మీకు తెలుసా? ఏంటీ.. తెలియదా?.. అయితే తెలుసుకోండి.
మీరు “ఉత్తర కొరియా” సరిహద్దును దాటితే చట్టవిరుద్ధంగా, మీరు చీకటి గదిలోని జైలులో 12 సంవత్సరాల కఠిన కూలీ పనిచేసే శిక్ష వేస్తారు. మీరు చట్టవిరుద్ధంగా “ఆఫ్ఘన్” సరిహద్దును దాటితే, అక్కడికి అక్కడే కాల్చి వేయబడతారు. మీరు “సౌదీ అరేబియా” సరిహద్దును చట్టవిరుద్ధంగా దాటితే, జైలు పాలవుతారు.
మీరు చట్టవిరుద్ధంగా “చైనీస్” సరిహద్దును దాటితే, కిడ్నాప్ అవుతారు. మళ్లీ నువ్వు ఉన్నది లేనిది ఎవ్వరికీ తెలియకుండ పోతావు. మీరు “క్యూబన్” సరిహద్దును చట్టవిరుద్ధంగా దాటితే, కుళ్ళి చచ్చిపోయెంత వరకు, రాజకీయ జైలులో పెడతారు. మీరు “బ్రిటిష్” సరిహద్దును చట్టవిరుద్ధంగా దాటితే, అరెస్టు చేయబడతారు, విచారణ చేయబడతారు. జైలుకు పంపబడతారు. మీ శిక్ష అనుభవించిన తరువాత, నీ దేశానికి నిన్ను పంపిస్తారు.
ఇప్పుడు..
మీరు “భారతీయ” సరిహద్దును చట్టవిరుద్ధంగా దాటితే, రేషన్ కార్డు.. పాస్‌పోర్ట్, ఒకటి కంటే ఎక్కువ కొంచెం స్మార్ట్.. డ్రైవింగ్ లైసెన్స్.. ఓటరు గుర్తింపు కార్డు.. క్రెడిట్ కార్డు..సబ్సిడీ అద్దెకు ప్రభుత్వ హౌసింగ్.. ఇల్లు కొనడానికి రుణం.. ఉచిత విద్య..ఉచిత ఆరోగ్య సంరక్షణ పొందుతారు. బంగ్లాదేశ్-పాక్ దేశాల సరిహద్దు రాష్ట్రాలయిన పశ్చిమబెంగాల్, కశ్మీర్ రాష్ట్రాల్లోనే, ఈ దొంగదారి కనిపిస్తుంటుంది. బంగ్లాదేశ్‌లోని రోహింగ్యాలు పశ్చిమబెంగాల్‌లోకి చొరబడి.. చిన్నగా మన హైదరాబాద్‌కూ వచ్చేశారు. పాలకుల సంతుష్ట రాజకీయాలకు దేశభద్రతే ప్రమాదంలో పడుతోంది. కారణం మనకున్న స్వేచ్ఛ.
కొసమెరుపు ఏమిటంటే: అవినీతి రాజకీయ నాయకులను ఎన్నుకోవటానికి ఓటు హక్కు పొందుతారు .
భారత్ ఏమైనా ధర్మ సత్రం నడుపుతుందా.? … అని అడిగే దమ్ము ఎవరికుంది? ఈ సెక్యులర్ గొంతులకు ఈ చొరబాటును నిలదీసే దమ్ముందా?ఓట్ల కోసం వారిని ప్రోత్సహిస్తున్న పార్టీలను నిలబెట్టి నిలదీసే ధైర్యం ఉందా?

Leave a Reply