రూ.40కోట్ల సుపారీ ఇచ్చినవారెవరనే ప్రశ్నలకు సమాధానం మీకు తెలియదా?

-హత్యజరిగినతర్వాత సీబీఐ విచారణ కావాలని హైకోర్ట్ లో పిటిషన్ వేసిన వ్యక్తి, ముఖ్యమంత్రి కాగానే దాన్నెందుకు ఉపసంహరించుకున్నాడో గుండెలపై చేయివేసి నిజం చెప్పాలి
• తన మనిషిని కాపాడుకోవడానికే ఆయన సీబీఐని తప్పుదారి పట్టించి, రాంగ్ రూట్ లో వెళ్లేలాచేస్తున్నారు.
• వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కావాలని హైకోర్ట్ లో పిటిషన్ వేసిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని ఎందుకు వెనక్కు తీసుకున్నారో గుండెలపై చేయివేసుకొని నిజం చెప్పగలరా?
• దస్తగిరి సీబీఐకి ఇచ్చిన 164స్టేట్ మెంట్, జగన్మోహన్ రెడ్డి కాపాడాలనుకుంటున్న ముద్దాయికి అత్యంతఅనుంగు అనుచరుడైన దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి అరెస్ట్, రిమాండ్ తర్వాత ముఖ్యమంత్రికి వణుకుమొదలైంది
• గౌరవ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ వారు వివేకాహత్యకేసుదర్యాప్తుపై సమీక్షిస్తే, సీబీఐ అప్రమత్తమవ్వడంతోపాటు, నిందితులను రక్షించుకోవాలనుకుంటున్నపెద్దలు, రెండుఅడుగులు వెనక్కువేస్తారు
• ప్రతికొడుకు మెడలో డీఎన్ఏ సర్టిఫికెట్ వేసుకొని తిరగాలని ఈ శాసనసభ కోరుకుంటోందా? అదొకశాసనసభా..ఛీఛీ
• ఆనాటి ధృతరాష్ట్ర్రుడి కంటే అధ్వాన్నంగా ఈనాటి శాసనసభలోని సభాపతి తీరుంది. ఏమిటండీ ఈ దుర్మార్గం.. ఏమిటీ తప్పుడువిధానం?
• ఎవరిని ఏమైనా అనగల, ఎంతకైనా తెగించగల దుర్మార్గులు వీరు. అలాంటి వారు ఆ సభలో ఉండటానికి కారణం ప్రజలేకదా!
-టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య 
వివేకానందరెడ్డి హత్యజరిగిన నాటినుంచీ గౌరవముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, హంత కులనుకాపాడేపనిలో చాలాసమయాన్ని వెచ్చిస్తున్నారని, హూ కిల్డ్ బాబాయ్ అంటూరాష్ట్ర వ్యాప్తంగా విస్త్రతంగాప్రచారంపొందిన హత్యకేసులో అసలు ముద్దాయిలు బయటకు రాకుండా, తనశక్తియుక్తులు, తన అధికారాన్ని దానిపైనే కేంద్రీకరిస్తున్నారని, టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య తెలిపారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …!
ఇదేమీ ఆషామాషీగా ఉబుసుపోక తానుచెప్పడం లేదు. హత్యజరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో, తరువాత ముఖ్యమంత్రిగా ఏంచేశారో అందరికీ తెలుసు. సీబీఐ విచారణ కావాలని ప్రతిపక్షనేత హోదాలో జగన్మోహన్ రెడ్డే హైకోర్ట్ లో పిటిషన్ వేశారు. తరువాత ఆయన పిన్నిగారైన సౌభాగ్యమ్య, చెల్లి సునీత కూడా హైకోర్ట్ లో సీబీఐ విచారణకోరుతూ పిటిషన్లు వేశారు. అసలు ముద్దాయిలెవరో ఆనాటికే ముఖ్యమంత్రికి తెలుసు. తనబాబాయిని చంపినవారెవరో తెలిశాకనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత హైకోర్టులో వేసిన పిటిషన్ వెనక్కుతీసుకున్నారు.
అసలుముద్దాయిలు ఎవరో తేలాలనే కదా జగన్మోహన్ రెడ్డి  హైకోర్ట్ లో పిటిషన్ వేసింది…. తన పిటిషన్ ఎందుకు వెనక్కుతీసుకున్నారో జగన్మోహన్ రెడ్డి  ఇప్పటికీప్రజలకు చెప్పలేదు. సీబీఐ విచారణ వద్దు, అసలు ముద్దాయిలు బయటకురాకూడదన్నదే కదా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అదికాదని గుండెలపైచేయివేసుకొని సమాధానంచెప్పగలధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా?
మా ముఖ్యమంత్రి సీబీఐ దర్యాప్తుకావాలని పట్టుబట్టారని, సీబీఐ విచారణకు తమనాయకుడు తీవ్రంగా కృషిచేశారని, దానివల్లే వివేకాహత్యకేసుపై సీబీఐ విచారణ మొదలైందని గడికోట శ్రీకాంత్ రెడ్డి సిగ్గూ, ఎగ్గూ లేకుండా నిర్లజ్జగా మాట్లాడారు. హైకోర్ట్ లో వేసిన పిటిషన్ వెనక్కు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి సీబీఐ విచారణ జరగాలని తీవ్రంగా పట్టుబట్టారా? మీది నోరా..తాటిమట్టా.. శ్రీకాంత్ రెడ్డి? అంత నిర్లజ్జగా అబద్ధాలుచెప్పే వ్యక్తి చీఫ్ విప్పా? ఆయన తనవ్యాఖ్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచిస్తున్నా.
మొట్టమొదటి నుంచీ గౌరవ ముఖ్యమంత్రి  తనబాబాయ్ ని చంపినహంతకులను కాపాడటానికి దీక్షగా ఒకలక్ష్యంతో పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి చర్యలన్నీ అలానే ఉన్నాయి. మా బాబాయ్ హత్యకేసు విచారణ ఎంతవరకు వచ్చిందని ఏనాడైనా ముఖ్యమంత్రి సీబీఐ అధికారులను అడిగారా? సీబీఐదర్యాప్తు ఒకకొలిక్కివస్తున్న ప్రస్తుతనేపథ్యం లో, తాను కాపాడాలనుకుంటున్న ముద్దాయిలను సీబీఐ అదుపులోకి తీసుకుంటుందేమో నన్న అనుమానం ఆయనలో మొదలైంది. దస్తగిరి సీబీఐకి ఇచ్చిన 164స్టేట్ మెంట్, జగన్మోహన్ రెడ్డి కాపాడాలనుకుంటున్న ముద్దాయికి అత్యంతఅనుంగు అనుచరుడైన దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి అరెస్ట్, రిమాండ్ తర్వాత ముఖ్యమంత్రికి వణుకుమొదలైంది. ఈ క్రమంలో నే ఆయన కొత్తడ్రామాకు తెరలేపారు.
ఎవరా భరత్..ఏమిటా స్టేట్ మెంట్లు? ఎవరో మహిళతో క్లోజ్ గాఉన్నారనే వ్యాఖ్యలేమిటి? సదరుమహిళ వివేకానందరెడ్డి చనిపోయిన రోజునే అక్కడికి వచ్చింది. ముఖ్యమంత్రి సీబీఐని కన్ ఫ్యూజ్ చేసి, తప్పుదారిపట్టించి రాంగ్ రూట్ లో పంపించాలనుకుంటున్నారా? తనవాళ్లపై నుంచి సీబీఐ దృష్టిని వేరేరూట్ లోకి మరల్చాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశమా? ఇంకోనాలుగునెలలు సీబీఐ విచారణజరగాలని చూస్తున్నారా? ఇటువంటి డిలే టాక్ టిక్స్ లో ముఖ్యమంత్రి దిట్ట. అసలు ముద్దాయిలను దాచాలని, వారికి ముసుగేసి పక్కన పెట్టాలని, తప్పుడు ముద్దాయిలను తెచ్చి సీబీఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి తాపత్రయ పడుతున్నారు. కాకపోతే ఏమిటండీ..ఏనాడైనా ముఖ్యమంత్రిహోదాలో ఆయన సీబీఐ విచా రణతీరుపై సమీక్షించారా? పదేపదే ముఖ్యమంత్రి ఢిల్లీపర్యటనల అసలు ఉద్దేశం.. తనబాబాయ్ హత్య కేసులో అసలుముద్దాయిలను కాపాడాటానికేనని ప్రజలంతా అనుకుంటున్నారు…నేనూ అనుకుంటున్నాను.. కాదనిచెప్పే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా?
ఎంపీ, అవినాశ్ రెడ్డి  శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు కోర్టువద్ద ఎందుకంత డ్రామా ఆడారు. సీబీఐని పక్కదారి పట్టించడానికి ఆపనిచేశారా? కోర్టువద్ద ఎందుకంత హాడా వుడిచేశారు? సీబీఐని తప్పుదారి పట్టించడానికా? ఇప్పటికీ మించిపోయింది లేదు… ముఖ్యమంత్రి హూకిల్డ్ బాబాయ్ వ్యవహారంలో అసలుదోషులను అరెస్ట్ చేయించాలి. తనపిన్ని, చెల్లిడాక్టర్ సునీతకు, తనతల్లికి ఒకప్రశాంతతను కలుగచేయండి. వివేకా నందరెడ్డి ఆత్మకు శాంతి కలిగించండి. దేవుడే చూస్తాడు… వాళ్లుచూస్తారు అనడంకాదు.
కడపలో ఎవరిని అడిగినా మీరు ముద్దాయిలను రక్షిస్తున్నారని చెబుతారు. మీ పిన్ని.. మీచెల్లి ఎవరిని అడిగినా అదేచెబుతారు. ముఖ్యమంత్రి పుట్టుకతోనే పెద్దనటుడు. ఆయన ఆడే డ్రామాలు పట్టించుకోకుండా.. సీబీఐ వారు చట్టప్రకారం, ఆధారాలప్రకారం ముందుకెళ్లాలి. ఆయన అధికారానికి సీబీఐ తలొగ్గకూడదని నేను కోరుతున్నా. హూ కిల్డ్ బాబాయ్ ప్రశ్నకు సమాధానంతెలుసుకోవడానికి ముఖ్యమంత్రి తప్ప, ప్రజలంతా తెలు సుకోవడానికి ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. చిన్నప్పటినుంచి మిమ్మల్నిఎత్తుకొని ఆడించిన మీబాబాయ్ ని చంపితే, మీకు అసలు సెంటిమెంట్ లేదేంటి ముఖ్యమంత్రి?
ఎందుకు ఇన్ని డ్రామాలు.. కేవలం అతన్ని రక్షించడానికేగా! దొడ్డిదారిన కొత్తడ్రామాలు ఆడవద్దని, సీబీఐదర్యాప్తుని పక్కదారి పట్టించవద్దని ముఖ్యమంత్రిని కోరుతున్నా. సీబీఐ వారు కూడా ఎలాంటిఒత్తిళ్లకు లొంగకుండా, చట్టప్రకారం ముందుకెళ్లాలని కోరుతున్నాం.
పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానంగా ….
శాసనసభలో కొంతమంది దుర్మార్గపు ఆలోచనలున్న వ్యక్తులు వ్యవహరించిన తీరుతోనే, అధికారంలోకి వచ్చాకే సభలో అడుగుపెడతానని చంద్రబాబు శపథంచేశారు. ఆయన ఎలాంటిపరిస్థితుల్లో, ఎందుకలాచేశారో ప్రజలంతా ఆలోచించాలి. అసలు ఇప్పుడు నడుస్తున్నది గౌరవసభా..లేకఆనాటి కౌరవసభా? ఆనాడు కౌరవసభలో ఒకమహిళను వివస్త్రను చేస్తుంటే దుర్యోధనుడు పకపకా వికటాట్టహాసం చేశాడు. ఈనాటి శాసనసభలో స్వర్గీయ ఎన్టీఆర్ కూతురి శీలాన్ని శంకిస్తుంటే, ఈ అపర సుయోధనుడు వెకిలిగా నవ్వాడు. శాసనసభలో జరిగినదానిపై ఏమని స్పందించాలి. ప్రతికొడుకు మెడలో డీఎన్ఏ సర్టిఫికెట్ వేసుకొని తిరగాలని ఈ శాసనసభ కోరుకుంటోందా?
అదొకశాసనసభా..ఛీ.ఛీ. ఆనాటి ధృతరాష్ట్ర్రుడి కంటే అధ్వాన్నంగా ఈనాటి శాసనసభలోని సభాపతి తీరుంది. ఏమిటండీ ఈ దుర్మార్గం.. ఏమిటీ తప్పుడువిధానం? బుద్ధిలేని, సిగ్గులేని, దొంగనాయకులారా, దుష్టనాయకులారా…. మీకంటే సెటిల్మెంట్ క్రిమినల్స్ చాలానయం. లోకేశ్ పుట్టింది జనవరి 23, 1983. మీరుచెప్పే మాధవరెడ్డి తెలుగుదేశంపార్టీలో చేరింది 1985 . లోకేశ్ పుట్టుక తర్వాతనే మాధవరెడ్డి పార్టీలోచేరాడు. సిగ్గులేనివాడా..లజ్జలేనివాడా.నీతిమాలిన వాడా.. దీనికి సమాధానంచెప్పు.
ఇంతకంటే వివరణ అనవసరం. దీనిపై దయచేసి నన్ను ప్రశ్నించకండి. మీరు నికృష్టులు, దుర్మార్గులు, క్రిమినల్స్ కనుకనే మనసుచంపుకొని బాధాతప్తహృదయంతో ఇంత వివరణఇవ్వాల్సి వచ్చింది. ప్రతి మహిళా ఈ దుర్మార్గుల తీరుపై ఆలోచించాలి. చట్టాలుచేసేనైతిక విలువ ఈ సభకు , సభలోని ఈ బ్యాచ్ కు ఉందా అని ప్రశ్నిస్తున్నా. 40సంవత్సరాల సుదీర్ఘరాజకీయ జీవితం కలిగి, ఎప్పుడూ గుండెనిబ్బరంతో వ్యవహరించే వ్యక్తి చంద్రబాబునాయుడు. అలాంటి వ్యక్తి పాత్రికేయ సమావేశంలో బోరుమని విలపిస్తే ఎగతాళిచేస్తారా? అసలు మీరు మనుషులా.. పశువులా? ఒక ముద్దఅన్నంపెడితే కుక్క చూపే విశ్వాసంకూడా మీరుచూపలేదే.
రెండుసార్లు, మూడుసార్లు మీకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి, గెలిపించి శాసన సభ్యులను చేస్తే, అన్నంపెట్టిన చేతినే కాటేస్తారా? మీరుమనుషులేనా? మీఇళ్లలోని భార్యాబిడ్డలను మీరు మనుషులో కాదో అడిగితే వారే మీ ముఖాన ఛీ అని ఉమ్మేస్తారు. చంద్రబాబు విలాపాన్ని కూడా అపహాస్యంచేసిన మిమ్మల్ని, ఈ శాసనసభను ఆ దేవుడుఎలా శిక్షిస్తాడోచూడాలి. ప్రజలారా మనం ఎటుపోతున్నామో ఆలోచించండి. మీరు ఓటేయకపోతే, శాసనసభలో ఈ బ్యాచ్ వచ్చేదికాదుగా! మనుషులకు సమాధానం చెబుతాం కానీ, మానవమృగాలకేం సమాధానం చెబుతాం? ఈ విధంగా ప్రవర్తిస్తున్నవారి నికృష్టపు, నీచపు బతుకులుఎలా ఉండబోతున్నా యో కాలమే సమాధానంచెబుతుంది.
మీ ఆవేదన, మనోవేదన నాకు అర్థమైంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులవారి భార్యంటే పార్టీలో ప్రతిఒక్కరికీ తల్లిలాంటిదే. మీరుపాత్రికేయులైనా కూడా మీరువ్యక్తంచేసిన బాధ నాకు అర్థమైంది. దేవుని శిక్షకు ఎవరూ అతీతులుకారు. ప్రపంచాన్ని జయించి, కోట్లాదిరూపాయల ను, మణుగులకొద్దీ బంగారాన్ని దోచిన అలెగ్జాండర్ కూడాఇలానే నాకేంటని విర్రవీగాడు. అంతటివాడే తానుచనిపోవడానికి ముందు, తనరెండు చేతులు పైకి కనిపించేలా ఉంచి సమాధిచేయమన్నాడు. రిక్తహస్తాలతో తాను పైకివెళుతున్నానని తెలియడానికే అలా చేయమన్నాడు. ఇప్పుడున్న పెద్దలుకూడా అదేవిధంగా పైకివెళతారు తప్ప… ఇప్పుడున్న అహంకారం, అధికారంసహా ఏవీ తీసుకెళ్ల లేరు. ఎవరిని ఏమైనా అనగల, ఎంతకైనా తెగించగల దుర్మార్గులు వీరు.