Home » ద్వారంపూడిపై పోటీచేసి గెలిచే దమ్ముందా..పవన్‌..?

ద్వారంపూడిపై పోటీచేసి గెలిచే దమ్ముందా..పవన్‌..?

– గోదావరి జిల్లాల్లో కుల చిచ్చు రగులుస్తున్న పవన్ కళ్యాణ్
– పవన్ కి ఒక సొంత విధానం, ఆలోచనలే లేవు
– చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ ఆరాటం
– కాపు, శెట్టిబలిజల ఐక్యతపై పవన్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదం
– కులం లేదంటూనే.. 75 సార్లు కుల ప్రస్తావన ెందుకు..?
– మహిళల భద్రత, సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హతే లేదు
– ప్రాణహాని అంటూ సానుభూతి కబుర్లను జనం నమ్మరు
– దేశానికే దిక్సూచీగా జగన్‌ నాయకత్వం
– మ్యానిఫెస్టోను పవిత్రంగా అమలుచేసిన ఏకైక ప్రభుత్వం మాది
– 2024లో 175 స్థానాలకు 175 స్థానాల్ని కైవసం చేసుకుంటాం
– మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ధీమా

పవన్‌ సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో జీరో
ప్రజాజీవితంలో ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకునే నాయకులు చరిత్రలో నిలబడతారు. ఆమేరకు వారు ప్రజల సేవలో తరిస్తూ ముందుకెళ్తుంటారు. మరోవైపు ప్రజామోదం లభించకపోవడంతో తీవ్రమైన ఫ్రస్టేషన్‌కు గురై ప్రగల్భాల ద్వారా ప్రజల్లో ఆకర్షణ పొందుదామని తాపత్రయం పడేవారు మరికొందరుంటారు. వీరిలో రెండోవర్గానికి చెందిన నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అని చెప్పుకోవచ్చు.

ఆయన సినిమాల్లో హీరోనేమో గానీ రాజకీయాల్లో మాత్రం జీరోగా మిగిలిపోయాడు. నిన్న కాకినాడలో పవన్‌కళ్యాణ్‌ అనేక ప్రగల్భాలు పలికాడు. నిజ జీవితాన్నే ఆయన సినిమా అనుకుంటు న్నాడు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ ప్రజల ఆకాంక్షలు తగినట్లు ప్రభుత్వాన్ని నడిపిస్తూ చరిత్రలో ముందెన్నడూ లేని పాలనను చూపిస్తున్నారు. ఇలాంటి మనుసున్న ముఖ్యమంత్రిని పట్టుకుని నిన్న పవన్‌కళ్యాణ్‌ నోటికొచ్చినట్లు ధూషించాడు. ఆయనకెందుకు అంత ఫ్రస్టేషన్‌ వస్తుందో.. ఎవరికీ అర్థంకావట్లేదు.

ప్రగల్భాలకే ప్రాధాన్యమిచ్చే పవన్‌ను నమ్మేదెవరు..?
పార్టీని పదేళ్లుగా పోషిస్తున్నానంటూ పదేపదే పవన్‌కళ్యాణ్‌ చెబుతున్నాడు కదా.. నిజానికి, ఆ పార్టీని ఇన్నాళ్లూ పోషించిన వారంతా నాశనమయ్యారు. ఆ పార్టీలో ఇన్నాళ్లూ మొదటి ్రÔó ణిలో పనిచేసిన వారంతా కూడా ఈరోజు పార్టీని వదిలిపెట్టి Ðð ళ్లారు. ఇందుకు కారణం కేవలం పవన్‌కళ్యాణ్‌ ప్రవర్తన మాత్రమే. ఈ విషయంపై ఆత్మపరిశీలన చేసుకుని ఆయన ఎప్పుడైనా ఆలోచించారా..? అని అడుగుతున్నాను.

నిన్ను నమ్మి రాజకీయ ప్రయాణంలో గమ్యానికి చేరాలని వచ్చిన సీనియర్‌ మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, పారిశ్రామికవేత్తలు వచ్చి పార్టీలో చేరి పనిచేస్తే.. నీ మీద నమ్మకం లేక, నీ ప్రవర్తన నచ్చకపోవడంతోనే కదా..వారంతా పార్టీని విడిచి వెళ్లింది..? దీన్నిబట్టి చూస్తే .. వారంతా పార్టీని విడిచిపెట్టి వెళ్లడంలో అర్థముందని.. నిన్న మీ కాకినాడ సభ చూస్తే తెలిసింది. మీవన్నీ ప్రగల్భాలేనని.. మిమ్మల్ని నమ్మి మీతో ప్రయాణం చేస్తే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని ముందుగానే మేల్కొన్న వారంతా మీకు దూరమయ్యారు. ఈ విషయం పవన్‌కళ్యాణ్‌కు ఎప్పుడైనా బోధపడిందా..? ప్రశ్నిస్తున్నాను.

కులం లేదంటూనే.. 75సార్లు కులప్రస్తావనెందుకు..?
కాకానాడ సభలో నిన్న పవన్‌కళ్యాణ్‌ తనకు కులంతో సంబంధం లేదంటూనే సుమారు 75 సార్లు కుల ప్రస్తావన తెచ్చారు. నిజంగా, సమ సమాజాన్ని కోరుకునే వ్యక్తులే అయితే మీనోట కులం గురించి అన్ని మాటలు వచ్చేవి కావు. ఉభయ గోదావరి జిల్లాల్లోనే నివాసం ఉంటాను. ఈ గోదావరిని విడిచిపెట్టి వెళ్లనంటూ ఆయన పలుకుతున్నాడు. మరి, ఇన్నాళ్లూ ఏ ఒక్కరోజైనా ఇక్కడ నివాసం గడపలేదు కదా పవన్‌కళ్యాణ్‌..? ఇప్పటికే మీ మాటల వలన ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో కులచిచ్చు పెరిగి అశాంతి పెరిగే వాతావరణం కనిపిస్తుంది.

కాపులు, శెట్టిబలిజల్ని కలిపాననడం హాస్యాస్పదం
మీరొచ్చి ఇక్కడ కాపుల్ని, శెట్టి బలిజల్ని కలిపారా..? అంటే, ఇన్నాళ్లూ వారు కలిసిలేరనుకుంటు నారా..? బ్రహ్మాండంగా వారిరువురు కలిసే ఉన్నారు. రాజకీయ ఎత్తుగడ కోసం ఎవరికి వారు తాము ఎంచుకున్న రాజకీయపార్టీలకు పనిచేసి ఉండొచ్చు. అవకాశాలొచ్చినప్పుడు అమలాపురంలో కాపులు ప్రాతినిధ్యం వహించారు. శెట్టి బలిజలు కూడా ప్రాతినిధ్యం వహించారు.

మీరేదో నేనే కాపుల్ని, శెట్టి బలజల్ని ఐక్యం చేశానని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. పైగా, ఈ వపన్‌కళ్యాణ్‌ సోషల్‌ ఇంజినీరింగ్‌ చేశానని చెప్పుకుంటున్నాడు. ఆయన మాట్లాడే ప్రతీ మాట కులాల మధ్య అంతరాల్ని రెచ్చగొట్టే విధంగానే ఉన్నాయి. పవన్‌ ప్రసంగం అనేది కులప్రస్తావన లేకుండా వినిపించడం లేదుకదా..? ఎందుకు మీరు పదేపదే కులాల పేర్లు ఎత్తి మాట్లాడుతూ రెచ్చగొట్టే వాతావరణం సృష్టిస్తున్నారు. మీ రాజకీయ ఎత్తుగడ ఆంతర్యమేంటి..? అనేది ప్రజలకు వివరించాలని మేం డిమాండ్‌ చేస్తున్నాము.

పూటకోమాటతో రాజకీయ కలల్లో పవన్
రోజుకోమాట, పూటకోమాటతో పవన్‌కళ్యాణ్‌ రాజకీయ కలలు కంటున్నాడు. కులం పేరుతో ఒకరోజు, సానుభూతి సంపాదనకు మరొక రోజును వాడుకుంటున్న పవన్‌కళ్యాణ్‌ గతంలో మాట్లాడుతూ ఏమన్నాడు..? సీఎంగా ఉండాలంటే కనీసం 30 సీట్లల్లో కూడా గెలవకుండా నేనేం అడగగలను అన్నాడు కదా..? మరి, ఆరోజు ఆ మాటన్నప్పుడే మీ వెంట తిరిగిన జనసేన నాయకుల్ని, కార్యకర్తల్ని మూకుమ్మడి రాజకీయ ఆత్మహత్యలకు పురిగొల్పారు.

దానిపై మళ్లీ వపన్‌కళ్యాణ్‌ తేరుకున్నాడు. ఇస్తే ముఖ్యమంత్రి పదవిని తీసుకుంటాను అని ఇప్పుడంటున్నాడు. మరి, ఆ పదవి ఎవరిస్తారు..? ప్రజలే కదా ఇవ్వాల్సింది. 2019 ఎన్నికల్లో ప్రజలే నిన్ను తిరస్కరించారు కదా.. నీకు ప్రజామోదం లభించలేదుకదా పవన్‌కళ్యాణ్‌..? జనసేన తరఫున మా జిల్లాలో రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక ఒక్కరు గెలిస్తే.. కనీసం ఆయన్ను మీ పక్కన కూర్చోబెట్టుకోవడానికి ఇబ్బంది పడ్డావు. సొంత పార్టీ ఎమ్మెల్యే మీదనే నువ్వు చేసిన కామెంట్స్‌కు మనస్థాపం చెంది ఆయన పార్టీ నుంచి బయటకొచ్చాడు. ఎందుకిలా జరుగుతుంది..? మీ పార్టీలో ఉన్నవారంతా మిమ్మల్ని నమ్మలేక ఎందుకు దూరమవుతున్నారో పవన్‌కళ్యాణ్‌ ఒక్కసారి ఆలోచించుకోవాలి.

‘ద్వారంపూడి’ ఫోబియాతో పవన్‌యాత్ర
నాడు గెలవలేని మీరు.. రేపు ఓడిస్తారా..? 2019 ఎన్నికల్లో ప్రజామోదం ద్వారా గెలవలేని పవన్‌కళ్యాణ్‌ 2024లో వైఎస్‌ఆర్‌సీపీని ఓడిస్తారా..? ఇదెంత హాస్యాస్పదమైన మాట. గడచిన నాలుగు రోజులుగా మీ వారాహీ యాత్రను చూసినట్లయితే, మా పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ ఫోబియాతోనే నడుస్తున్నట్లు అర్థమౌతుంది.

మొన్న అన్నవరం నుంచి యాత్ర మొదలుపెట్టినదగ్గర్నుంచి రోజూ పవన్‌కళ్యాణ్‌ మాత్రం ద్వారంపూడి చంద్రశేఖర్‌ ఫోబియా పట్టుకుని పదేపదే అబద్ధాలు చెబుతున్నాడు. ఆయన ఆరోపణలన్నీ పసలేనివని అక్కడ ప్రజలే చెబుతున్నారు. ఎవడో చెప్పినవి, రాసిచ్చిన స్క్రిఫ్టును పట్టుకుని పవన్‌ వీరావేశం పడటంలో అర్ధమేముంటుంది..? ఆయన పిచ్చి మాటలకు కాకినాడ ప్రజలు నవ్వుకుంటున్నారు.

ద్వారంపూడి సవాల్‌ను స్వీకరించే దమ్ముందా..?
తనపై పవన్‌కళ్యాణ్‌ చేసిన ఆరోపణల్ని రుజువు చేయాలని ద్వారంపూడి చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఒకవైపు మా ద్వారంపూడి చంద్రశేఖర్‌ గారు మీకు బహిరంగ సవాల్‌ విసురుతున్నాడు. తనపై చేసిన ఆరోపణల్ని ఆధారాలతో సహా రుజువు చేయాలని.. లేదంటే, కాకినాడలో నాపై పోటీచేస్తానని కాకినాడ యాత్ర ముగించేలోపు చెప్పాలంటూ సవాల్‌ విసిరాడు కదా.. మరి, మా నాయకుడు సవాల్‌ను స్వీకరిస్తారా పవన్‌కళ్యాణ్‌..?

జనసేన పార్టీ అధినేతగా మీకు మీరే నిర్ణయం తీసుకున్నా సరే..లేదంటే, చంద్రబాబును అడిగి చెబుతానని చెప్పినా సరిపోతుంది. ఖచ్చితంగా మా ద్వారంపూడి చంద్రశేఖర్‌ సవాల్‌ను స్వీకరించి ఆయనపై పోటీచేస్తే పవన్‌కళ్యాణ్‌కు ఒక విలువ, గౌరవం ఉంటుందని హితవు పలుకుతున్నాను.

ప్రాణహాని ఉందంటూ సానుభూతి కబుర్లు ఆపాలి
2018లో పవన్‌కళ్యాణ్‌ తనకు ప్రాణహాని ఉందని ఆరోజు తన మిత్రుడు అధికారంలో ఉండగా అడిగాడు. అప్పట్లో పోలీసుల్ని కూడా తాను నమ్మనన్నాడు. మరి, ఈరోజు వారాహీ యాత్ర గత నాలుగురోజులుగా పూర్తి స్వేచ్ఛగా పోలీసు సెక్యూరిటీతో.. వారంతా మేకు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు గదా..? అలాంటిది, మళ్లీ ఇప్పుడు నాకు ప్రాణహాని ఉందని పదేపదే ఎందుకు చెబుతున్నాడు..? నిజానికి, ప్రజలకోసం పనిచేసే నాయకుడు తన సొంత ప్రాణాన్ని కూడా పణంగా పెడతానని అనడం పరిపాటి. ఏ నాయకుడైనా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలంటే తన ప్రాణాల్ని సైతం లెక్కచేయనని చెప్పుకోవడం మంచిదని హితవు చెబుతున్నాను.

మహిళల గురించి మాట్లాడే నైతిక అర్హత పవన్‌కు లేదు
మహిళలను ఉద్దేశించి నా ఆడబిడ్డలు, నా ఆడపడుచులంటూ ఆయన దీర్ఘాలు తీస్తున్నాడు. అసలు, మహిళలు, వారి భద్రత, సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత పవన్‌కళ్యాణ్‌కు లేదని ప్రపంచమంతా చెబుతుంది. ఎందుకంటే, మహిళల పట్ల మీ ప్రవర్తన అలా ఉంది. మొన్న సనాతన ధర్మం, ధర్మరక్షణ అంటూ మాట్లాడారు. అసలు, సనాతన ధర్మానికి ప్రామాణికమైన రామాయణంను మీరు చదివారా..?

ఒకవేళ చదివితే, దాని సారాన్ని అనుభవంతో ఆచరించి ఎదుటివారికి ఆదర్శంగా నిలవాలి. ఇవన్నీ నాకేమీ వర్తించవు, ఎదుటివారిరకి చెప్పడానికి ఆ విలువలు ఉంటాయని మీరనుకుంటే చాలా దురదృష్టంగా భావించాలి. ఈ రాష్ట్రంలో ధర్మభక్షణ చేసినటువంటి చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్న మీరు అలా మాట్లాడటమేంటి..? ఎవరైనా మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తానని నాయకుడనే వాడు చెబుతాడు. మరి, నువ్వేమో.. నా ప్రాణాన్ని కాపాడేందుకు మీ ప్రాణాల్ని అడ్డువేయాలని కోరుతున్నారు. ఇలాంటి మీ మాటల్ని అర్థం చేసుకోనంత పిచ్చివాళ్లు ప్రజలు కాదని గుర్తుచేస్తున్నాను.

దేశానికే దిక్సూచీగా ఉన్న జగన్‌ని విమర్శిస్తారా..?
బీఆర్‌ అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రాం వంటి ఆదర్శనీయుల స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ రాష్ట్రంలోని సకలవర్గాల్ని అక్కునజేర్చుకుని సుభిక్షమైన పరిపాలనను అందిస్తున్నారు. ప్రభుత్వ పథకాల పంపిణీలో టీడీపీ శ్రేణులతో సహా శెభాష్‌ అనిపించుకుంటూ సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థ, ఆర్బీకే కేంద్రాలతో దేశానికే దిక్సూచీగా జగన్‌గారు ఆదరణ పొందుతున్నారు.

అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకుని పవన్‌కళ్యాణ్‌ ఇష్టానుసారంగా దూషిస్తాడా..? ఆయనకున్న అర్హతేంటి..? చంద్రబాబును అధికారంలోకి తేవాలనే లక్ష్యంతోనే జనసేన పార్టీని పెట్టడం, ఆయన భజన చేసుకుంటూ.. వైఎస్‌ఆర్‌సీపీని విమర్శిస్తూ ప్రజల ముందు ప్రగల్భాలు పలుకుతూ తిరుగుతున్నాడు పవన్‌కళ్యాణ్‌. సినిమాల్లో ఆయనెంత హీరోనైనా.. రాజకీయాల్లో మాత్రం ఆయనొక స్థిరత్వంలేని దిగజారుడు మనస్తత్వంతో ముందుకుపోతున్నారు.

175 స్థానాల్ని వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకోవడం ఖాయం
చంద్రబాబు చెప్పాడని.. ఈయనొచ్చి ఆయన కోసం మా నాయకుడ్ని తిడతాడా..? కులరాజకీయాలేమీ ఈ రాష్ట్రంలో ఎక్కడా జరగడంలేదు. అలాంటి రాజకీయాలకు మా జగన్‌ గారు పూర్తిగా వ్యతిరేకం. పవన్‌కళ్యాణ్‌ చేస్తున్న కులరాజకీయ ఆరోపణల్ని పసలేనివని చెబుతూ నేను ఖండిస్తున్నాను. టీడీపీ నేతలు, చంద్రబాబు మాదిరిగా మా పార్టీకి ఓటేస్తేనే ప్రభుత్వ పథకాలిస్తామనేది మా విధానం కాదు. మాకున్న ఏకైక సిద్ధాంతమల్లా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతంతో పాటు రాజకీయ పార్టీ కూడా చూడకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమం అందించాలనే లక్ష్యంతో మా నాయకుడు జగన్‌ ఆదేశాల్ని పాటిస్తున్నాం.

బాబు 2012 నుంచి జగన్‌ వ్యక్తిగత ప్రతిష్టతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అప్పట్నుంచి బాబు చేసిన ఆరోపణలన్నింటినీ ప్రజలు నమ్మలేదుకదా..? ఆయన చేసిన విమర్శల కారణంగానే మాకు 2019లో 151 సీట్లు వచ్చాయి. ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ చేసే విమర్శలతో 2024లో 175 స్థానాలకు 175 స్థానాల్ని కైవసం చేసుకోబోతున్నామని ధీమాగా చెబుతున్నాను.

Leave a Reply