ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రదర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించమని కోరే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రికి ఉన్నాయా?

– దర్యాప్తు జరిపించలేకపోతే జగన్ రెడ్డి తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి
• గతకొద్ది సంవత్సరాలుగా జగన్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని, మేం ఏదైతే చెప్తూవచ్చామో, నేడు అధికారపార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి బయటపెట్టిన ఆధారాలతో నిజమైంది
• తనపై తనకు నమ్మకంలేక, ప్రజా విశ్వాసం కోల్పోయిన పులివెందుల పిల్లి ఫోన్ ట్యాపింగ్ ని నమ్ముకున్నాడు
• రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మరియు 21, ఐటీ యాక్ట్, టెలిగ్రాఫ్ యాక్ట్ లను తుంగలో తొక్కిమరీ జగన్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ చేస్తోంది
• ఫోన్ ట్యాపింగ్ కు వినియోగించే చట్టవ్యతిరేక సాఫ్ట్ వేర్ ను జగన్ సర్కార్ ఎవరిదగ్గర నుంచి ఎంతకు కొన్నదనే దానిపై కూడా దర్యాప్తు జరగాలి
• ఫోన్ ట్యాపింగ్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆగస్ట్ 17, 2020న, ప్రధాని నరేంద్రమోదీగారికి ఫిర్యాదు చేశారు.
• తక్షణమే కేంద్రనిఘా సంస్థలతో దర్యాప్తుకు ఆదేశించాలని ప్రధానిని కోరారు
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

జగన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం అడ్డదారులుతొక్కుతూ, రాజ్యాంగ, చట్టవ్యతిరేకంగా వ్యవహరి స్తూ, ఫోన్ ట్యాపింగ్ తో సొంతపార్టీ ఎమ్మెల్యేలతో పాటు, ప్రతిపక్షనేతల్ని, మీడియాతో పాటు ఆఖరికి న్యాయమూర్తుల్ని కూడా దారికి తెచ్చుకోవాలని చూస్తోందని, ఫోన్ ట్యాపింగ్ తో జగ న్ రెడ్డికి సంబంధంలేకపోతే, తక్షణమే కేంద్రదర్యాప్తుసంస్థలతో విచారణ జరిపించమని కేంద్రా న్నికోరి తననిజాయితీ నిరూపించుకోవాలని, లేనిపక్షంలో తక్షణమే తనపదవికి రాజీనామా చేయాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మా రెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే ..

“గత కొద్దిసంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగే ఫోన్ ట్యాపింగ్ పై టీడీపీ ఏదైతే చెప్తూవచ్చిందో అదే నిజమని వైసీపీఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పత్రికాసమావేశంలో బయటపెట్టిన ఆధారాలతో తేలిపోయింది. రాష్ట్రంలో విచ్చలవిడిగా అధికారపార్టీనేతలు, ప్రతిపక్షనేతలు, మీడియాసంస్థల అధిపతులు, న్యాయమూర్తులు, సమాజంలో వివిధహోదాల్లో ఉన్న పెద్దల ఫోన్ల ట్యాపింగ్ జరుగుతోంది. ఇలాజరుగుతోందని టీడీపీ కొన్నేళ్లనుంచి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసినా, బుకాయింపులతో జగన్ సర్కార్ తప్పించుకుంది. నిన్నటికి నిన్న సాక్షాత్తూ అధికారపార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేస్తోందని మీడియాముఖంగా రుజువుచేశారు.

ఇన్నాళ్లుగా ఫోన్ ట్యాపింగ్ పై బుకాయిస్తూ, టీడీపీ ప్రశ్నించినప్పుడల్లా తప్పించుకున్న ప్రభుత్వం, ముఖంచాటేసిన ముఖ్యమంత్రి ఇప్పుడేం సమాధానం చెబుతాడని ప్రశ్నిస్తున్నాం. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధారాలతో సహా, తన ఫోన్ ట్యాప్ అయినట్లు రుజువుచేశారు. ఇంటిలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు నుంచి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ కు వచ్చిన వాయిస్ మెసెజ్ ను ఆయనే నిన్న బయటపెట్టాడు. సీతారామాంజనేయులు ఫోన్ నంబర్ తో సహా, కోటంరెడ్డి వాయిస్ మెసేజ్ ని మీడియా వారికి వినిపించాడు. శ్రీధర్ రెడ్డి కంటే ముందు మరో సీనియర్ ఎమ్మెల్యే, మాజీమంత్రి ఆనం రామనారాయణ రెడ్డికూడా తన ఫోన్ ట్యాప్ అవుతుందని, తనకు భద్రతలేదని, తన ప్రాణాలకు హానిఉందని మీడియాసాక్షిగా వాపోయారు. స్వయంగా అధికారపార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆధారాలతో సహా ఫోన్ ట్యాపింగ్ బయటపెట్టాక కూడా, ఈ ప్రభుత్వం ఇంకా సిగ్గులేకుండా ఎలా బుకాయిస్తుంది? ఫోన్ ట్యాపింగ్ పై ఇంతకంటే రుజువులేం కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.

కోటంరెడ్డి బహిరంగపరిచింది వాయిస్ రికార్డింగ్ అని బుకాయింపు…
ప్రభుత్వ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కప్పిపుచ్చుతూ, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ తప్పించుకునే ప్రయత్నం చేశారు. పక్కాగా, బహిరంగంగా ఆధారాలతో సహా, ఫోన్ ట్యాపింగ్ బట్టబయలయ్యాక కూడా అది వాయిస్ రికార్డింగ్ అని, గుడివాడ అమర్నాథ్ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నంచేశారు. నిజంగా వాయిస్ రికార్డింగ్ అయి తే, అది కోటంరెడ్డి ఫోన్లో మాత్రమే ఉంటుందికానీ, ఇంటిలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు గారి ఫోన్ కి చేరుకొని, తిరిగి వాయిస్ మెసేజ్ రూపంలో కోటంరెడ్డికి చేరదుకదా? ఇది స్పష్టం గా ఫోన్ ట్యాపింగ్ మాత్రమే. కోటంరెడ్డి ఫోన్ ని ఇంటిలిజెన్స్ వర్గాలు ట్యాప్ చేసి, వాయిస్ రి కార్డ్ చేసి, ఆ రికార్డింగ్ ని ఇంటిలిజెన్స్ డీజీ తనఫోన్ ద్వారా కోటంరెడ్డికి పంపడం జరిగింది. ఈ వాస్తవాన్ని రాష్ట్రప్రజలందరూ అర్థంచేసుకున్నారు. తనపై తనకు నమ్మకంలేక, ప్రజల్ని నమ్మలేక చట్టవిరుద్ధ, రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నువ్వు సింహానివి కాదు జగన్ రెడ్డి.. పులివెందుల పిల్లివి. రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆఖరికి తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల్ని కూడా నమ్మలేనిస్థితిలో వారి ఫోన్లు కూడా ట్యాప్ చేసే దుస్థితికి వచ్చాడు. పిరికిపందగా మారిన రాష్ట్ర ముఖ్యమంత్రి, తన నీడను కూడా నమ్మలేని పులివెందుల పిల్లి, తాడేపల్లి ప్యాలెస్ లోకూర్చొని చివరకు ఇలాంటి అనైతిక, చట్టవ్యతిరేక, రాజ్యాంగవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు. దీనిపై ఏం సమాధానం చెబుతాడని జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. తాను చాలా సాహసవంతుడినని, ధైర్యవంతుడినని, సింహం సింగిల్ గానే వస్తుందని ప్రగ ల్భాలు పలికే జగన్ రెడ్డి, నిజంగా పులివెందుల పిల్లే. పిల్లి కూడా కాదు.. అంతకంటే తక్కువే అనిచెప్పాలి. ఎందుకంటే ధైర్యంలేక, ప్రజలపై విశ్వాసం, తనపై తనకునమ్మకంలేని వారే ఫోన్ ట్యాపింగ్ లాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడతారు. తమనాయకత్వం పట్ల, ప్రజల పై, తమపై తమకు నమ్మకం ఉన్న వారు ఎవరూ ఇలాంటి నీతిమాలిన పనులు చేయరు.

రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై గతంలోనే ప్రధానికి లేఖ రాసిన చంద్రబాబు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆగస్ట్ 17, 2020న టీడీపీ అధినేత చంద్రబాబు గారు, దేశ ప్రధాని మోదీకి లేఖరాశారు. రెండున్నర సంవత్సరాల క్రితమే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తూ రాసిన లేఖలో చంద్రబాబుగారు, రాష్ట్రప్రభుత్వం ఇండియన్ టెలిగ్రా ఫ్ యాక్ట్ 1885, సెక్షన్ 5(2)ని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69ని ఉల్లంఘి స్తున్నట్టు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 మరియు ఆర్టికల్ 21లను కాలరాస్తున్నట్టు, ఇల్లీగల్ సాఫ్ట్ వేర్ సాయంతో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఆఖరికి న్యాయ వాదులు, న్యాయమూర్తులు సహా, మీడియాసంస్థల అధిపతులు, ప్రతిపక్షనేతలు, సమాజం లో వివిధ హోదాల్లో ఉన్న పెద్దమనుషుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్టు చంద్రబాబు గారు, మోదీకి రాసిన లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో జరిగే ఫోన్ ట్యాపింగ్ పై తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కూడా ఆయన కోరారు. ప్రతిపక్షనేత, మాజీముఖ్యమంత్రి రాసిన లేఖ పై జగన్ సర్కార్ ఆరోజు కూడా బుకాయించింది. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగే లేదని అడ్డదిడ్డంగా మాట్లాడింది.

8నెలల క్రితమే వైసీపీప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని అధికారికంగా బయటపెట్టిన పెద్దిరెడ్డి
మే 2022లో రాష్ట్రకేబినెట్ మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే స్వయంగా తమప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు మీడియాసమక్షంలోనే ఒప్పుకున్నారు. (మంత్రి పెద్ది రెడ్డి ట్యాపింగ్ పై మాట్లాడిన ఫోన్ సంభాషణల్ని పట్టాభిరామ్ విలేకరులకు వినిపించారు) పదోతర గతి ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంపై మాట్లాడుతూ, తమప్రభుత్వం అనేకరకాలుగా ఫోన్ ట్యాపింగ్ లు చేస్తోందని, తద్వారా వివిధరకాల సమాచారం రాబడుతోందని ఆయనే స్పష్టం చేశారు. మరినేడు జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగుసంవత్సరాల కాలంలో అసలు రాష్ట్రంలో ఎటువంటి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడలేదని నమ్మబలుకుతున్న ప్రభుత్వపెద్దలు, పెద్దిరెడ్డి వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారు? పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై ఆనాడే టీడీపీ గట్టిగా ప్రశ్నిస్తే, జగన్ సర్కార్ అప్పుడుకూడా బుకాయించింది.

ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రప్రభుత్వ చట్టాలు, రాజ్యాంగం ఏం చెబుతోంది?
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై చట్టాలు ఏంచెబుతున్నాయో అందరూ తెలుసుకోవాలి. ఇండి యన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 419 (A) ప్రకారం, ఏ రాష్ట్రంలో ఎవరి ఫోన్ ని ట్యాప్ చేయాల న్నాకూడా, ముందుగా ఆరాష్ట్ర హోంసెక్రటరీకి లిఖితపూర్వకంగా తెలియచేయాలి. ఆతరువాత హోం సెక్రటరీ ద్వారా రాష్ట్రస్థాయిలో ఏర్పాటైన రివ్యూకమిటీ దృష్టికి ఆ అంశాన్ని తీసుకెళ్లి, కచ్చితంగా అనుమతి తీసుకోవాలి.
ఆ రివ్యూకమిటీకి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఛైర్మన్ గా వ్యవహరి స్తారు, సభ్యులుగా లా సెక్రటరీ మరియు ఇతర శాఖలకు చెందిన ఒక సెక్రటరీ ఉంటారు. ప్రతి రెండు నెలలకోసారి, ఈ రివ్యూ కమిటీ తప్పనిసరిగా సమావేశమై, కింది స్థాయి అధికారులు పంపే ఫోన్ ట్యాపింగ్ దరఖాస్తులపై సమీక్ష చేయాలన్న నిబంధనని ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 419 (A)లో పొందుపరిచారు. మరి రాష్ట్రంలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ ఎవరి అనుమతితో జరుగుతోంది. రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ ఛైర్మన్ గా కమిటీ ఉందా.. ఉంటే ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం అవుతోందా? ఆ విధంగా సమావేశమయ్యే ఫోన్ ట్యాపింగ్ కు అనుమతి ఇచ్చిందా? ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలని చెప్పారు? రాష్ట్రంలో జరిగే ఫోన్ ట్యాపింగ్ కు ముఖ్యమంత్రి అనుమతి ఉం దా? ముఖ్యమంత్రికి తెలియకుండా చీఫ్ సెక్రటరీ ట్యాపింగ్ కు అనుమతించే అవకాశం ఉందా? ఇవన్నీ బయటపడాలంటే తక్షణమే కేంద్రదర్యాప్తు సంస్థలతో ఫోన్ ట్యాపింగ్ పై విచా రణ జరిపించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేంద్రప్రభుత్వానికి లేఖ రాయాలని టీడీపీ డిమాం డ్ చేస్తోంది. అలా కోరే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రికి ఉన్నాయా? దర్యాప్తు కోరలేని పక్షం లో, జగన్ రెడ్డి తక్షణమే ప్రభుత్వాన్ని రద్దుచేసి, ముఖ్యమంత్రి పదవినుంచి వైదొలగాలన్నదే టీడీపీ డిమాండ్. గతంలో కర్ణాటకలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలువస్తే, అప్పుడు ముఖ్యమం త్రిగా ఉన్న రామకృష్ణహెగ్దే తన పదవికి రాజీనామాచేశారు. అలా చేయగల ధైర్యం జగన్ రెడ్డి కి ఉందా?

గతంలో టీడీపీ అధినేత చంద్రబాబుగారు, రాష్ట్రంలో జరిగే ఫోన్ ట్యాపింగ్ పై రాసిన లేఖపై కేంద్రహోం శాఖ దృష్టిపెట్టాలి. రాష్ట్రంలో ఏంజరుగుతోంది.. ఎవరిఫోన్లు ట్యాప్ అవుతున్నాయి.. ఈ వ్యవహారం ఎలాజరిగింది.. దీనిలో ఎవరి ప్రమేయం ఉంది.. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ చేస్తోందనే వివరాలు బయటపెట్టాలని కేంద్రహోంశాఖను కోరుతున్నాం. అలానే ఏపీప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు వినియోగిస్తున్న ఇల్లీగల్ సాఫ్ట్ వేర్ ఎక్కడినుంచి, ఎంతకు కొన్నారనే దానిపై కూడా కేంద్రహోంశాఖ లోతైన దర్యాప్తు జరపాలని కోరుతున్నాం. గతంలో టీడీపీప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్ వేర్ తో ఫోన్ ట్యాపింగ్ చేసిందని జగన్ సర్కార్ నిరా ధార ఆరోపణలు చేసింది. పెగాసస్ సాఫ్ట్ వేర్ పై కమిటీలువేసి, చర్చలుజరిపిన వైసీపీప్రభు త్వం చివరకు చేతులెత్తేసింది. కేంద్రప్రభుత్వం కూడా దేశంలో ఏప్రభుత్వం కూడా పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేయలేదని తేల్చేసింది. నాడు ఆరకంగా టీడీపీప్రభుత్వంపై అకారణంగా బురదజల్లిన జగన్ సర్కార్ కు, నేడు తన నిజాయితీని నిరూపించుకునే దమ్ముందా?

దేశభద్రతకు ముప్పువాటిల్లే అత్యవసర సందర్భాల్లో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ కు అనుమతి అని చెబుతున్న ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5 (2), మరియు ఐటీ యాక్ట్ సెక్షన్ 69
ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5(2) ప్రకారం దేశభద్రతకు ముప్పువాటిల్లే అత్యవసర సందర్భాల్లో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ కు అనుమతించాలని చట్టం చెబుతోంది. దేశ సమగ్రత కు, సార్వభౌమాధికారానికి భంగం కలిగే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే, కావాల్సిన అన్ని అనుమతులతో చట్టప్రకారమే ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69కూడా స్పష్టంచేస్తోంది. ఆ విధంగా దేశంలో ఏ రాష్ట్రమైనా, కేంద్రప్రభుత్వమైనా ఏఏ సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్ కు అనుమతించాలో స్పష్టంగా మనచట్టాలు తెలియచేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ తో రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్21 (Right To Protection Of Life And Personal Liberty Which Includes Right To Privacy) ప్రకారం దేశపౌరులందరికీ వ్యక్తిగతస్వేచ్ఛను, గోప్యతను కాపాడుకునే హక్కు ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 14 (Right To Freedom Of Speech And Expression) భావప్రకటనా స్వేచ్ఛను కల్పిస్తోంది. రెండింటినీ జగన్ సర్కార్ ఉల్లంఘిస్తూ, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి పౌరహక్కులను కాలరాస్తోంది. మంత్రి పెద్దిరెడ్డే స్వయంగా తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని ఒప్పుకున్నాక, జగన్ రెడ్డి, ఆయన దిక్కుమాలిన ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ లో అడ్డంగా దొరికిపోయినా కూడా మంత్రి గుడివాడ అమర్నాథ్, కోటంరెడ్డిది ఫోన్ ట్యాపింగ్ కాదు, ఆడియో రికార్డింగ్ మాత్ర మేనంటూ బుకాయిస్తున్నాడు. మరోవైపు మాజీమంత్రి, గుడివాడ గుట్కా కొడాలినాని ఇంటిలిజెన్స్ డీజీ ఫోన్ ట్యాపింగ్ చేయిస్తే తప్పా, ఆడియో మెసెజ్ లు పంపకూడదా అంటున్నాడు. ఇలా పొంతనలేని మాటలతో, పులిహోర కబుర్లతో ఎన్నాళ్లు తప్పించు కుంటా రు? ఎన్నికల్లో తాను గెలవలేనని తెలిసే, తననీడను కూడా తాను నమ్మలేని దుస్థితిలో ఉన్న ముఖ్యమంత్రి ఇలాంటి చట్ట విరుద్ధ, అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. జగన్ రెడ్డి తక్షణమే ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రదర్యాప్తు సంస్థల విచారణ కోరి, తన సచ్ఛీలతను నిరూపించుకోవాలి, లేనిపక్షంలో ముఖ్యమంత్రి పదవినుంచి వైదొలగాలి” అని పట్టాభిరామ్ డిమాండ్ చేశారు.

Leave a Reply