ఎన్టీఆర్ కి వైసీపీ గుర్తింపు ఇవ్వడం ఏంటి?

-ఎన్టీఆర్ కి వైసీపీ గుర్తింపు ఇవ్వడం ఏంటి?.. తెలుగు జాతికే గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ 
– వైసీపీ పాలనలో ఎన్టీఆర్ కు జరిగిన అవమానం ప్రతి అభిమాని గుండెల్లో మంటలా రగులుతోంది
– ఓట్లకోసం వైసీపీ నాటకాలు మానుకోవాలి, ఎన్టీఆర్ పేరు పలికే అర్హత కూడా వైసీపీకి లేదు
– టీడీపీ శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి

ఎన్టీఆర్ కు జగన్ గుర్తింపు ఇచ్చారని వైసీపీ నేతలు మాట్లాటడం ఎన్టీఆర్ ని అవమానించడమే. ఆ వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ఎన్టీఆర్ కి వైసీపీ గుర్తింపు ఇవ్వడం ఏంటి? తెలుగు జాతికే గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్.

ఆయన ఒక మహాశక్తి. కృష్ణాజిల్లాలోని సగం ప్రాంతానికి ఎన్టీఆర్ పేరు పెట్టి ఎన్టీఆర్ వైసీపీనే గుర్తింపు ఇచ్చినట్లు మాట్లాడి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం సిగ్గుచేటు. వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ పేరు చెప్పుకుని ఓట్లు దండుకోవాలని వైసీపీ ఈ డ్రామా ఆడుతోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని విధాలుగా ఎన్టీఆర్ ని అవమానిస్తునే ఉంది. ఎన్టీఆర్ పేరుతో ఉన్న పేదల కడుపునింపే అన్న క్యాంటీన్ నుమూసివేసినప్పుడే వైసీపీ కుట్ర బయటపడింది. ఎన్టీఆర్ కాలనీలకు పేరు తొలగించి జగనన్న కాలనీలుగా పేరు మార్చుకోవడం ఎన్టీఆర్ ను గౌరవించడమా? ఎన్టీఆర్ జలసిరి, ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ జలసిరి, ఎన్టీఆర్ సుజల శ్రవంతి వంటి 16 రకాల పథకాలకు ఎన్టీఆర్ పేరు ఎందుకు తొలగించారు.?

టీడీపీ హయాంలో నీరుకొండలో చేపట్టిన ఎన్టీఆర్ మెమోరిల్ ను ఎందుకు నిలిపేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరును రాజశేఖర్ రెడ్డి తొలగించారు. ఆనాడు తండ్రి ఎన్టీఆర్ పేరు లేకుండా చేస్తే నేడు తనయుడు ఆయన పేరు వినబడకుండా పథకాలన్నీ రద్దు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇష్టానుసారంగా ఎన్టీఆర్ విగ్రహాలకు నిప్పు పెట్టి కూల్చేశారు. విగ్రహాలపై దాడి చేసిన ఒక్క వైసీపీ కార్యకర్తనైనా మందలించి, పార్టీ నుండి సస్పెండ్ చేశారా.? ఎన్టీఆర్ కుమార్తెను అసెంబ్లీలో అవమానించినప్పుడు ఆయనపై గౌరవం వైసీపీ నేతలకు ఎటు వెళ్లింది.?

వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలకు ఎన్టీఆర్ పై ఉన్న అభిమానం తరగదు. ఎన్టీఆర్ ఆశయాలు, ఆయన కీర్తిని నిలబెట్టడం చంద్రబాబు నాయుడుకే సాధ్యం. ఎన్టీఆర్ కు, ఆయన కుటుంబ సభ్యులకు వైసీపీ చేసిన అవమానాన్ని ప్రతి తెలుగుదేశం కార్యకర్త మర్చిపోలేదు.ఓట్ల కోసం వైసీపీ నేతలు డ్రామాలు ఆడటం మననుకోవాలి. ఎన్టీఆర్ పేరును ఉచ్చరించే అర్హత కూడా వైసీపీకి లేదు.

Leave a Reply