విజయవాడ: నగరాన్ని వరద ముంచేసి ప్రజలకు తీవ్ర నష్టం చేకూర్చిందని, ఆ నష్టాన్ని పూడ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక రకాలు వారిని ఆదుకుంటున్నారని, చంద్రబాబు శ్రమకు తోడుగా దాతలు కూడా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారని శాసనసభ్యులు గద్దె రామమోహన్ తెలిపారు.
మంగళవారం ఉదయం 19వ డివిజన్ లబ్బీపేట ఎలక్ట్రిసిటీ కాలనీలోని బొప్పనాస్ వల్లూరు ఎంపైర్ ప్లాట్స్ ఓనర్స్ అసోయేషన్ వారు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2లక్షల 25 వేలు చెక్కును ఎమ్మెల్యే గద్దె రామమోహన్కు అందజేశారు.ఈ కార్యక్రమంలో వల్లూరు బసవయ్య చౌదరి, శేషసాయి, బుర్రే రమణ, సత్యవాణి, సంజన, ఉమర్ తదితరులు ఉన్నారు.