వింజమూరు: జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నుండి బంగ్లా సెంటర్ వరకు జరిగిన స్వచ్ఛత హి సేవ ర్యాలీలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు.విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా అమలు చేయడం జరుగు తుందన్నారు. ఈనెల 17వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు గ్రామాల్లో మరియు పట్టణాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆయన చెప్పారు.
నియోజకవర్గంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రతి మండలం గ్రామపంచాయతీలలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంపై ర్యాలీలు,సదస్సులు నిర్వహించాలన్నారు. మండల మరియు గ్రామ స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను గ్రామస్థాయిలో భాగస్వాములుగా చేయాలన్నారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేష్ బాబు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు రెడ్డి ఎంఈఓ మధుసూదన్ రెడ్డి సర్పంచ్ నల్లగొండ్ల సృజన మండల నాయకులు గొంగటి రఘునాథరెడ్డి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ వనిపెంట సుబ్బారెడ్డి జూపల్లి రాజారావు ఉపాధ్యాయ బృందం తదితరులు ఉన్నారు.