Suryaa.co.in

Andhra Pradesh

పోలీసును బట్టలు ఊడదీసికొడతామన్నా కేసు పెట్టరా?

– బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి

అనంతపురం: ఓ రాష్ట్ర మంత్రి పోలీసు అధికారిని బట్టలు ఊడదీస్తాం అంటే ఇప్పటి వరకు కేసు రిజిస్టర్ చేయలేదు. విపక్ష నేతలు, లేదా సామాన్యులు ఇలాగా పోలీసులను అని ఉంటే పోలీసులు ఇప్పటికే బట్టలు విప్పి కొట్టి జైల్లో పెట్టేవారు.అదే వేరే రాష్ట్రంలో అయితే మంత్రి అప్పలరాజు ఈ పాటికి కటకటాల పాలయ్యేవారు.పోలీసులు మిమ్మల్ని మీరు రక్షించుకో లేకపోతే మీరు ఇక రాష్ట్ర ప్రజలని ఏం రక్షిస్తారు ?మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు విషయంలో ముఖ్యమంత్రి మౌనం రహస్యం ఏంటి ? మంత్రి అధికార మదంతో ఇలా మాట్లాడుతున్నాడు. మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజీపీ రాష్ట్ర పార్టీ డిమాండ్ చేస్తుంది.

సీఎం జగన్ నివాసం ఉండే అమరావతి అభివృద్ధి కి రూ. 2,046 కోట్లు కేంద్రం ఇచ్చింది. ఒక్క రూపాయి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. కారణం చెప్పగలరా ?కేంద్ర ఇచ్చిన నిధుల విషయంలో రాష్ట్రం ప్రభుత్వం శ్వేతపత్రం విడదల చేయండి .

వైసిపి యంపిలు బాద్యతారాహిత్య విమర్శలు చేస్తున్నారు . జగన్ పంచడం తప్ప రాష్ట్రం ఆదాయం పెంచింది లేదు. 62 సంవత్సరాలు ఉద్యోగులకు పెంచి నిరుద్యోగుల గొంతు కోశారు. నిరుద్యోగులను 30 నెలలుగా ప్రకటనలతో మెూసం చేశారు .

కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ వాళ్లు ప్రధానిపై అవాకులు, చవాకులు పేలుతున్నారు. పార్లమెంట్ లో మీ శక్తి ఎంత. సీపీఐ కి దేశం లో ఓ ఎంపీ ఉన్నాడు. సీపీఎం శక్తి ఎంత… దేశంలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోల్పోయింది. కమ్యూనిస్టు లు రాష్ట్రం లో తోక పార్టీలుగా మిగిలాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యాలయాలు మూసివేశారు. ప్రధానిని విమర్శించే ముందు మీ పార్టీలను ప్రజలు ఎందుకు దూరంగా పెట్టారో ఆత్మపరిశీలన చేసుకోండి.

LEAVE A RESPONSE