– ఆర్యవైశ్యుల్ని చంపేస్తే నోరెత్తలేని అసమర్థుడు… ఆర్యవైశ్య మహానీయుల్ని జగన్ రెడ్డి అవమానిస్తుంటే ప్రశ్నించలేని చేతగానివాడు వెల్లంపల్లి
• వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాశ్, మల్లాది విష్ణులు మూడుకోతుల్లా ప్రవర్తించారు. చెడువిని, చెడుచూస్తూ, చెడుప్రచారం చేస్తున్నారు
• వెల్లంపల్లి విజయవాడ వన్ టౌన్ పిల్లి.. పప్పెట్ పల్లీ. తాడేపల్లి స్రిప్ట్ చదవడం తప్ప ఆర్యవైశ్యుల కష్టాలు, బాధలు శ్రీనివాస్ కేం తెలుసు
– టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్
విజయవాడలో యువగళం పాదయాత్ర సృష్టించిన ప్రభంజనంతో, నగరప్రజల పాలిట శాపంగా మారిన మూడు కోతులు మీడియా ముందుకొచ్చి పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాయని ఎప్పుడూ పేలని పల్లీ అయిన వెల్లంపల్లి, దేవినేని అవినాశ్, మల్లాది విష్ణులు చెడు వింటూ, చెడు చూస్తూ, చెడుని ప్రచారం చేస్తున్నారని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండీ రాకేశ్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
జగన్ రెడ్డి రోశయ్యను అవమానించినా, పొట్టి శ్రీరాముల్ని విస్మరించినా మాట్లాడలేని అసమర్థుడు వెల్లంపల్లి
“ విజయవాడ వన్ టౌన్ పల్లి… వెల్లంపల్లి పెద్ద పప్పెట్. వైసీపీ ఆర్యవైశ్యులక సముచిత స్థానం కల్పించిందని, గుండెల్లో పెట్టుకుందని పప్పెట్ ప్రగల్భాలు పలికాడు. ఆ పప్పెట్ కు పవర్ లేదు. అది కేవలం తాడేపల్లి స్క్రిప్ట్ మాత్రమే వల్లె వేస్తుంది. వైసీపీ ప్రభుత్వం ఆర్యవైశ్యుల్ని నిట్టనిలువునా ముంచేసిందని పప్పెట్ కు తెలియకపోవడం సిగ్గుచేటు. తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యులకు ఇచ్చిన గౌరవం మరేపార్టీ ఇవ్వలేదు.
నవంబర్ 1న ఎప్పుడో ఏదో చిన్నపొరపాటు జరిగితే దాన్ని సరిచేస్తామని టీడీపీ అధినాయకత్వం ఇప్పటికే ప్రకటించింది. కానీ నవంబర్ 1న జగన్ రెడ్డి వైఎస్సార్ పేరు తో అవార్డులుఇస్తున్నాడు.. నవంబర్ 1 కి, వైఎస్సార్ కి ఏం సంబంధమో పప్పెట్ పల్లీ సమాధానం చెప్పాలి. నవంబర్ 1 పొట్టిశ్రీరాముల్ని గుర్తుచేసుకొని, ఆయనపేరుతో కా ర్యక్రమాలు చేయాల్సి ఉంటే, జగన్ రెడ్డి తనతండ్రి భజన చేస్తున్నాడు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా పనిచేసిన కొణిజేటి రోశయ్యను అవమానించి, జగన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్ నిర్మించుకున్నాడు . ఆర్యవైశ్యుల ముద్దుబిడ్డ, పెద్దాయన అయిన వ్యక్తి విగ్రహానికి, చిత్రపటానికి కనీసం దండకూడా వేయని కుసంస్కారి జగన్ రెడ్డి. అధికారికంగా నిర్వహించాల్సిన ఆయన సంతాపసభనుగానీ, ఇతర కార్యక్రమాల్ని గానీ జగన్ ఎందుకు నిర్వహించలేదో పప్పెట్ పల్లీ సమాధానం చెప్పాలి. రాజశేఖర్ రెడ్డికి కుడిభుజంగా వ్యవహరించిన పెద్దా యనపై జగన్ రెడ్డికి ఎందుకంత కోపం..అసూయ?
వెల్లంపల్లికి వైశ్యకోటాలో మంత్రి పదవి ఇచ్చిన జగన్, అతనివల్ల తనకేం ఉపయోగంలేదని తెలిసే ఆ పదవి పీకేశాడు. పదవి, పవర్ లేని పల్లీ పప్పెట్ సిగ్గులేకుండా జగన్ రెడ్డి భజన చేస్తున్నాడు. టీడీపీ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు ఎన్ని పదవులు ఇచ్చిందో, ఆధారాలతోసహా నిరూపించడా నికి నేను సిద్ధం. వైసీపీ నుంచి పప్పెట్ పల్లీ వచ్చినా.. ఎవరొచ్చినా బహిరంగంగా నిరూపిస్తాం.
2014-19మధ్యలో టీడీపీప్రభుత్వం ఆర్యవైశ్యులకు ఉన్నతస్థానాలు మొదలు కిందిస్థాయి పదవుల వరకు 6,276 కట్టబెట్టింది. టీడీపీ ఆర్యవైశ్యులకు ఒక రాజ్యసభ, ఎమ్మెల్సీ ఇచ్చింది. ఎవరెవరికి ఎలాంటి పదవులు ఇచ్చి, ఆర్యవైశ్యుల్ని ఎంతగా గౌరవించి, అభిమానించిందో వైసీపీ అజ్ఞానులకు వివరిస్తాం.
వెలంపల్లి తిరిగే కారుపై వివాదం…విగ్రహాలపై వివాదం… అతను ఎమ్మెల్యేనా?
గన్ కంటే జగన్ ముందొస్తాడు.. ఆడపిల్లకు అన్యాయం జరిగితే మేమున్నాం అన్న వాళ్లు ఆకివీడు గ్రామానికి చెందిన ఆర్యవైశ్య ఆడబిడ్డకు జరిగిన అన్యాయంపై ఏం సమాధానం చెబుతారు? సాయిలక్ష్మి కమలసంధ్య (24) ప్రేమించి పెళ్లుచేసుకుందని నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపేశారు. తమబిడ్డను కోల్పోయిన తల్లిదండ్రుల వేదన పల్లీ పప్పెట్ కు వినిపించలేదా? చంపింది కాక, నీకూతుర్ని చంపేశానని నిందితుడే తల్లికి ఫోన్ చేసి చెబితే, వైసీపీప్రభుత్వం ఆ దుర్మార్గుడిని ఎందుకు శిక్షించలేదు? వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఎంతమంది ఆర్యవైశ్యుల్ని చంపారో పప్పెట్ పల్లీకి తెలియదా?
నంద్యాలలో మండీ అసోసియేషన్ అధ్యక్షుడిని దారుణంగా నడిరోడ్డుపై చంపేశారు. ఒంగోలులో వైసీపీనేత సుబ్బారావు గుప్తాని రోడ్డుమీద, హోటల్లో చితకబాది, వీడియోలు తీసి ఆనందించారు. యర్రగొండపాలెంలో మంత్రి ఆఫీసు వెనక వైసీపీ యువకుడిని కత్తితో పొడిచి చంపారు. తనభర్తను చంపిన వాళ్లను శిక్షించాలని ఆ ఆడబిడ్డ నేటికీ కలెక్టర్ల కార్యాలయాలచుట్టూ తిరుగుతోంది. ఆమె ముఖం ఎప్పుడై నా చూశావా పప్పెట్ పల్లీ..వెల్లంపల్లి. శ్రీకాకుళంలో నడిరోడ్డుపై వైసీపీనేతను చంపేశా రు. ఇవేవీ నీకు తెలియదా వెల్లంపల్లి. నువ్వు లోకేశ్ ను అనేంతవాడివా?
విజయవాడ కు లోకేశ్ ఏంచేశాడంటావా…వెల్లంపల్లి. నీ ఇంటిముందున్న ఫ్లైఓవర్ కట్టింది టీడీపీ ప్రభుత్వమైతే, సిగ్గులేకుండా రిబ్బన్ కట్ చేసి, మేం చేశామని చంకలు గుద్దుకుంది మీరు కాదా? తనను గెలిపించిన విజయవాడ ప్రజలకు వెల్లంపల్లి చేసింది శూన్యం. ఆఖరికి దేవాలయ నిర్మాణాలు కూడా ఆపేయించాడు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నిర్మించుకుంటుంటే, సదరు కమిటీవారు తనను కలవలేదని నిర్మాణాన్ని ఆపేయించిన నీచుడు వెల్లంపల్లి. వారు లోకేశ్ నుకలిశారని, వాళ్లను బెదిరించాడు.. ఈ వెల్లంపల్లి.
లోకేశ్ గురించి మాట్లాడే సినిమా నీకుందా వెల్లంపల్లి. నువ్వు తిరిగే కారుపై వివాదం…నీ పుట్టినతేదీపై వివాదం.. నీ బతుకే వివాదం వెల్లంపల్లి. నీ బాగోతం ఎవరికి తెలియదని మాట్లాడుతున్నావు పల్లీ..పప్పెట్. నడిరోడ్డుపై ఆడబిడ్డను చంపితే బాధి తురాలి కుటుంబానికి న్యాయంచేయలేని నువ్వు.. నీ జగన్ రెడ్డి ఆర్యవైశ్యుల్ని ఉద్ధ రించారా? వైసీపీలోని ఆర్యవైశ్యులే మమ్మల్ని పట్టించుకోవడంలేదని బోరుమంటు న్నారు. అన్నారాంబాబు ఆవేదన నీకు కనపించలేదా? టీడీపీ నుంచి వైసీపీలోకి లాక్కున్న ఆర్యవైశ్య నేతల పరిస్థితేంటో చెప్పు పల్లీ..వెల్లంపల్లి.
రోశయ్య ఇచ్చిన జీవోని తాను ఇచ్చినట్టు వెల్లంపల్లి చెప్పుకుంటున్నాడు
ఆర్యవైశ్యుల సత్రాలు, దేవాలయాలు కాపాడుకోవడానికి దేవాదాయశాఖ మంత్రిగా జీవో ఇచ్చానంటున్న పల్లీ..వెల్లంపల్లి, ఆ జీవో తొలుత ఇచ్చింది రోశయ్య అని తెలియ దా? ఎప్పుడో రోశయ్య ఇచ్చిన జీవోకు కొనసాగింపుగా మీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలో అన్నీ తప్పులే. వెల్లంపల్లి ఇచ్చిన జీవో అమల్లో ఉంటే, గుంటూరులోని ఆర్ అగ్రహారం లో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని ఎండో మెంట్ విభాగం ఎందుకు స్వాధీనం చేసుకుంది?
తనకు ఇబ్బంది కలిగినప్పుడే వెల్లం పల్లికి ఆర్యవైశ్యులు గుర్తుకొస్తారు. విజయవాడ వన్ టౌన్ లో రోశయ్య విగ్రహం పెట్టి.. మొత్తం వివాదాలమయం చేసింది వెల్లంపల్లి కాదా? విజయవాడ ఫ్లైఓవర్ పై పొట్టి శ్రీరాములు విగ్రహం ఎందుకు పెట్టించలేకపోయావు? రోడ్డువెడల్పు పనులపేరుతో తొలగించిన గాంధీ కాంస్య విగ్రహం ఏమైందో చెప్పు వెల్లంపల్లి. విజయవాడ దుర్గమ్మ తల్లి రథంపైన ఉండే మూడు సింహాలు మాయమైతే మంత్రిగా ఉండి ఎందుకు కనిపెట్టలేకపోయావు వెల్లంపల్లి. ఎమ్మెల్యేగా ఉండి ఏంసాధించావు?
ఎప్పుడు ఏ పార్టీ లో ఉంటావో తెలియని నువ్వు లోకేశ్ ను అంటావా? ఒకే రోజు రెండుపార్టీల తరుపన బీఫామ్ లు అందుకున్న నువ్వెంత.. నీ మాటలెంత? వెల్లంపల్లికి నిజంగా ఆర్యవైశ్యు లపై అభిమానముంటే జగన్ పాలనలో సర్వంకోల్పోయిన వారికి అండగా నిలవాలి. జగన్ రెడ్డి వేసిన వైశ్యకార్పొరేషన్ కు ఎన్నినిధులిచ్చి ఎందరు డైరెక్టర్లను నియమిం చారో చెప్పాలి. వెల్లంపల్లి పద్ధతి మార్చుకోకుంటే, ప్రజలే ఆయనకు బుద్ధిచెబుతారు. చే సే పనుల్ని బట్టి గౌరవం, మర్యాద ఉంటాయని వెల్లంపల్లి గుర్తుంచుకోవాలి.
బెదిరిస్తేనో, భయపడితేనో ఎవరూ మీకు లొంగరని వైసీపీనేతలు తెలుసుకోవాలి. ప్రజలకు ఇచ్చే పింఛన్లు ఆర్యవైశ్యకార్పొరేషన్ ద్వారా ఇచ్చామని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. ఆర్య వైశ్యుల ద్రోహి జగన్ రెడ్డి. చంద్రబాబుని నేరుగా కలిసి ఆర్యవైశ్యుల సమస్యలు చెప్పగ ల ధైర్యం నాకుంది.. రోశయ్య విగ్రహానికి దండవేసి, నమస్కరించమని జగన్ రెడ్డికి చెప్పే దమ్ము, ధైర్యం వెల్లంపల్లికి ఉందా?” అని రాకేశ్ సవాల్ విసిరారు.