Suryaa.co.in

Andhra Pradesh

వరద తగ్గిన ప్రాంతాల్లో డోర్ టు డోర్ ఆహారం

– ప్రతి కుటుంబానికి ఉచితంగా నిత్యావసర సరుకులు
– మొబైల్ రైతు బజార్లతో కూరగాయలు, ఇతర సామగ్రి
– సరుకులు బ్లాక్‌ కానీయొద్దు
– మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
– వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి
– అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

విజయవాడ: వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ వివరాలు..

• వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకొస్తున్నాం. ప్రతి ఇంటికి సహాయం అందించాలి
• వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి, వారి కుటుంబాల వారికి అప్పగించాలి. ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాలి.
• మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం తరపున అందించాలి.
• వరద తగ్గినందును ఆహారం డోర్ టు డోర్ వెళ్ళే అవకాశం ఉంది.
• ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు బంగాళదుంప, కేజీ చక్కెర అందించాలి.
మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి బ్లాక్ మార్కెటింగ్ లేకుండా అతి తక్కువ ధరకు కూరగాయలు విక్రయించేలా చర్యలు చేపట్టాలి.
• నష్టాన్ని వివరించి కేంద్ర సాయం కోరదాం.
• ఆహారం, నీరు, బిస్కెట్స్, పాలు, అరటిపండ్లు అన్నీ డోర్ టు డోర్ అందాలి.
• అన్ని అంబులెన్స్ లు పూర్తి స్థాయిలో అందుబాటులో పెట్టండి.
• విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయాలి. శానిటేషన్ పనులు ఒక యుద్దంలా జరగాలి.
• ప్రతి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఇంటికి సంబంధించిన వారిని భాగస్వామ్యులను చేయండి.
• వైరల్ ఫీవర్లు, దోమల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కరపత్రాల ద్వారా ప్రజలను చైతన్య పరచండి.
* ప్రతి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి. ఎవరికి ఏ మెడిసిన్ కావాలన్నా అందించాలి.
* పంట నష్టంపై అంచనాలు నమోదు చేయండి.

మంత్రులు, అధికారులు మాట్లాడుతూ….
• ఈ ఉదయం 2.3 లక్షల అల్పాహారం ప్యాకెట్లు పంపించాం. 4.5 లక్షల మందికి మధ్యాహ్నం, సాయంత్రానికి భోజనం సిద్ధం చేస్తున్నాం.
• 2.5 లక్షల పాల ప్యాకెట్లు, 5 లక్షల వాటర్ బాటిళ్లతో పాటు 117 ట్యాంకర్లను పంపించాం. మరో 6 లక్షల నీళ్ల బాటిళ్లు సిద్ధంగా ఉంచాం. వాటర్ ప్యాకెట్లు 10 లక్షల తరలించాం…మరో 6 లక్షలు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం 50 ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉన్నాయి. వాటితో పారిశుద్ధ్య పనులు మొదలు పెట్టాం.

LEAVE A RESPONSE