-
వరద ప్రభావిత ప్రాంతాలకు ఐదు టన్నుల దాణా
-
పంపిణీ ప్రారంభించిన పశు సంవర్ధక శాఖ అధికారులు
వరద ప్రభావిత గ్రామాల్లోని పశువుల కోసం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ యుద్ధ ప్రాతిపదికన దాణా సమకూర్చారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆదేశాలతో నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ పర్యవేక్షణలో అవనిగడ్డ సబ్ డివిజన్ పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బొండు సాంబశివరావు నియోజకవర్గానికి ఐదు టన్నుల పశువుల దాణా మంజూరు చేయించారు.
నాగాయలంకకు రెండు టన్నులు, ఈలచెట్లదిబ్బకు రెండు టన్నులు, అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలులంకకు ఒక టన్ను పశువుల దాణా మంజూరు చేసినట్లు డాక్టర్ సాంబశివరావు తెలిపారు.
బుధవారం దక్షిణ చిరువోలులంక గ్రామం వద్ద పశు పోషకులకు మోదుమూడి పశు వైద్యాధికారిణి డాక్టర్ సుధారాణి పశువుల దాణా పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు కొల్లూరి వెంకటేశ్వరరావు, బండే రాఘవ, గుడివాక శేషుబాబు, కర్రా సుధాకర్, బచ్చు రఘునాథ్, బచ్చు రాఘవయ్య పాల్గొన్నారు.